నేపాల్‌లో కల్లోలం ఈ 8 ఫోటోలలో చూడండి

ఫొటో సోర్స్, Getty Images
నేపాల్‌లో సోషల్ మీడియాపై ప్రభుత్వం నిషేధం విధించడంతో మొదలైన యువత నిరసన ప్రదర్శనలు హింసాత్మకంగా మారాయి.
సోషల్ మీడియాపై నిషేధం తర్వాత మొదలైన ఈ నిరసనలు తీవ్రంకావడంతో ప్రధాని కేపీ శర్మ ఓలీ తన పదవికి రాజీనామా చేశారు.
ఆ తర్వాత, ఆందోళనలు మరింత తీవ్రమయ్యాయి.
మంగళవారం మధ్యాహ్నం పార్లమెంట్ ఆవరణలో ప్రవేశించిన నిరసనకారులు, ఆ తర్వాత పార్లమెంట్ భవనానికి నిప్పంటించారు.
ఓలీ, షేర్ బహదూర్ దేవ్‌బా సహా పలువురు నేతల ఇళ్లపై దాడులు జరిగాయి.
రాజధాని కాఠ్‌మాండూతో పాటు నేపాల్‌లోని పలు ప్రాంతాల్లో పెద్దఎత్తున యువత నిరసనల్లో పాల్గొన్నారు.
వారిని అదుపు చేసేందుకు సైన్యం రంగంలోకి దిగింది.

ఫొటో సోర్స్, Getty Images
నేపాల్ పార్లమెంట్ బయట పోలీసులు ఏర్పాటుచేసిన బారికేడ్‌కు నిరసనకారులు నిప్పుపెట్టారు.

ఫొటో సోర్స్, Getty Images
కాఠ్‌మాండూలోని నేపాల్ ప్రభుత్వ ప్రధాన పరిపాలన భవనం ముందు కారును ఆందోళనకారులు తగులబెట్టారు.

ఫొటో సోర్స్, Getty Images
కాఠ్‌మాండూలోని నేపాల్ పార్లమెంట్ భవనం ఎదుట నిరసనకారులను చెదరగొట్టేందుకు భద్రతాబలగాలు వచ్చాయి.
కానీ నిరసనకారులు రాళ్లు రువ్వడంతో తమను రక్షించుకునేందుకు సెక్యూరిటీ వాహనం వెనుక దాక్కోవడాన్ని పైచిత్రంలో చూడొచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
నేపాల్‌లోని కాఠ్‌మాండూ, లలిత్‌పూర్, భక్తాపూర్ జిల్లాలలో నిరసనలు పెల్లుబికాయి. కాఠ్‌మాండూలోని పార్లమెంటు భవనం సహా అనేక భవనాలను నిరసనకారులు దహనం చేశారు.
భవనాల్లో నుంచి దట్టమైన పొగ వెలువడుతున్న పార్లమెంటు పరిసరాలను పై చిత్రంలో చూడొచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
కాఠ్‌మాండూలోని నేపాల్ పార్లమెంటు భవనం వద్ద నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు.

ఫొటో సోర్స్, Getty Images
సెప్టెంబర్ 8న కాఠ్‌మాండూలో నిరసకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు.
నేపాల్ పార్లమెంట్ బిల్డింగ్ ఎంట్రన్స్ వాల్ మీద నుంచి దూకుతున్న ప్రదర్శనకారుడిని పై చిత్రంలో చూడొచ్చు.

ఫొటో సోర్స్, EPA
నిరసనకారులు మంగళవారం కాఠ్‌మాండూలోని పార్లమెంట్ హౌస్, సింహ్ దర్బార్‌లకు నిప్పుపెట్టారు. సింహ్ దర్బార్‌లో అనేక ప్రభుత్వ భవనాలు ఉన్నాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














