తెలంగాణ బంద్ : 13 ఫోటోలలో

బంద్
బారులు తీరిన బస్సులు
తెలంగాణ బంద్

బీసీ సంఘాల జేఏసీ ధర్నా నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా శనివారం ఉదయం నుంచి బస్సులు ఆర్టీసీ డిపోలకే పరిమితమయ్యాయి

బంద్
బంద్

హైదరాబాద్‌లో బంద్ ప్రభావం పాక్షికంగా కనిపించింది రహదారులపై ప్రైవేటు వాహనాలు ఎక్కువగా తిరుగుతూ కనిపించాయి .

ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి .

దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ప్రైవేటు వాహనాల్లో ఎక్కువ చార్జీలు వసూలు చేయడం ఆర్థికంగా భారమైందని ప్రయాణికులు బీబీసీకి చెప్పారు.

ఆందోళనలో మహేష్ కుమార్ గౌడ్, మంద కృష్ణ మాదిగ

ఫొటో సోర్స్, TPCC

బంద్

ఫొటో సోర్స్, BJP

కవిత

ఫొటో సోర్స్, Kavita Office

బీఆర్ఎస్ ధర్నా

ఫొటో సోర్స్, BRS party

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ తెలంగాణ బంద్ నిర్వహించారు

ఈ బంద్‌కు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, బీజేపీ మద్దతు ప్రకటించి రాష్ట్రంలో పలుచోట్ల ఆందోళనలో పాల్గొన్నాయి

హైదరాబాదులో జరిగిన ఆందోళనలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మందకృష్ణ మాదిగ , బీసీ సంఘాల నాయకులు ఆర్ కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు

బీఆర్ఎస్ తరఫున ఆందోళనలో మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్ పాల్గొన్నారు

బీజేపీ నుంచి ఆందోళనలో ఎంపీ ఈటెల రాజేందర్ జూబ్లీ బస్ స్టేషన్ వద్ద ఆందోళనలో పాల్గొన్నారు

దుకాణాలు మూయిస్తున్న ఆందోళనాకారులు
బంద్
బస్సులు లేక ప్రయాణికుల అవస్థ
బస్టాండ్ నుంచి వెనుదిరుగుతున్న ప్రయాణికులు

తెలంగాణ వ్యాప్తంగా పలు చోట్ల బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.వారాంతంతోపాటు దీపావళి సెలవు కూడా కలిసి రావడంతో సొంత ఊళ్లకు ప్రయాణమైనవారు ఆర్టీసీ బస్సులు కదలకపోవడంతో పలు ఇబ్బందులు పడ్డారు.

లగేజీలు మోసుకుంటూ బస్సు డిపోల బయటకు రావడం కనిపించింది. వీలున్నవారు ప్రైవేటు వాహనాలు మాట్లాడుకుని ప్రయాణమవ్వగా, చాలామంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సులు కదిలినప్పుడు వెళదామని ఎదురుచూడటం కనిపించింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)