కోవిడ్-19: కరోనావైరస్ వ్యాప్తి కట్టడికి కొత్త ఆంక్షల నడుమ యూరప్‌లో నిరసనలు - Newsreel

హేగ్

ఫొటో సోర్స్, Getty Images

ఐరోపాలో పెరుగుతున్న కోవిడ్-19 కేసులను కట్టడి చేసేందుకు విధిస్తున్న లాక్‌డౌన్‌ నిబంధనలకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి.

నెదర్లాండ్స్‌లో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. హేగ్‌లో పోలీసులపైకి నిరసనకారులు బాణాసంచా విసిరారు. ద్విచక్ర వాహనాలకు నిప్పు పెట్టారు.

రోట్రెడామ్‌లో విధ్వంసకర నిరసనల నడుమ పోలీసులు కాల్పులు జరిపిన మరుసటి రోజే తాజా పరిణామాలు చోటుచేసుకున్నాయి.

తాజా లాక్‌డౌన్‌లకు వ్యతిరేకంగా ఆస్ట్రియా, క్రొయేషియా, ఇటలీ దేశాల్లో వేల మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసనలు చేపడుతున్నారు.

హేగ్

ఫొటో సోర్స్, AFP

ఐరోపాలో కోవిడ్-19 కేసులు పెరగడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆందోళన వ్యక్తంచేసింది.

ఇక్కడ కఠినమైన లాక్‌డౌన్‌లు విధించకపోతే ఐదు లక్షల మందికిపైగా కోవిడ్-19తో చనిపోయే ముప్పుందని డబ్ల్యూహెచ్‌వో ప్రాంతీయ డైరెక్టర్ డాక్టర్ హన్స్ కుల్గే బీబీసీతో చెప్పారు.

‘‘మళ్లీ ఇక్కడ కరోనావైరస్ విజృంభిస్తోంది. కరోనావైరస్‌పై పోరాటంలో ఏం చేయాలో మనకు తెలుసు. అందరూ వ్యాక్సీన్లు వేయించుకోవాలి. మాస్క్‌లు పెట్టుకోవాలి’’ అని ఆయన చెప్పారు.

పెరుగుతున్న కోవిడ్-19 కేసులను కట్టడి చేసేందుకు ఐరోపాలోని చాలా దేశాలు మళ్లీ లాక్‌డౌన్‌లను అమలు చేస్తున్నాయి. ఇక్కడ చాలా దేశాల్లో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)