థాయ్‌లాండ్‌: ట్యాక్సీ రూఫ్ టాప్‌లపై మొక్కల పెంపకం

వాడకుండా వదిలేసిన ట్యాక్సీల పై మొక్కల పెంపకం

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, వాడకుండా వదిలేసిన ట్యాక్సీల పై మొక్కల పెంపకం

థాయ్లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌లో ఒక ట్యాక్సీ పార్కింగ్ ప్రాంతంలో ట్యాక్సీల రూఫ్ టాప్‌లపై చిగుర్లు తొడుగుతున్న పచ్చని మొక్కలు కనిపిస్తాయి.

నిరంతరం రద్దీగా ఉండే థాయ్ వీధులు కోవిడ్ నిబంధనలతో ఖాళీ అయిపోయాయి.

దాంతో ట్యాక్సీ డ్రైవర్‌లకు పని లేకుండా పోయింది.

గిరాకీ లేక ట్యాక్సీలను వదిలిపెట్టి చాలామంది డ్రైవర్లు సొంత గ్రామాలకు వెళ్లిపోయారు.

వాడకుండా వదిలేసిన ట్యాక్సీల పై మొక్కల పెంపకం

ఫొటో సోర్స్, Getty Images

ఇలా వాడకుండా వదిలేసిన ట్యాక్సీల పై కప్పును మొక్కలు పెంచేందుకు వాడాలని ఒక సంస్థ నిర్ణయించింది.

ఇలా చేయడం వల్ల పని లేకుండా ఉన్న డ్రైవర్లకు, తమ సంస్థ ఉద్యోగులకు కాయగూరలు సరఫరా చేయవచ్చని భావించింది.

వాడకుండా వదిలేసిన ట్యాక్సీల పై మొక్కల పెంపకం

ఫొటో సోర్స్, EPA

రాచఫ్రూయక్ ట్యాక్సీ కోపరేటివ్‌లో పని చేసే ఉద్యోగులు వెదురు కర్రలకు నల్లని బిన్ కవర్లు పెట్టి ఒక ఫ్రేమ్‌గా తయారు చేశారు.

దానిపై మట్టిని పరిచి చిన్న చిన్న మొక్కలు పెంచడం మొదలుపెట్టారు.

వాడకుండా వదిలేసిన ట్యాక్సీల పై మొక్కల పెంపకం

ఫొటో సోర్స్, Getty Images

ఆ తర్వాత అందులో పచ్చి మిర్చి, దోసకాయలు, కీరా లాంటి మొక్కలను పెంచడం ప్రారంభించారు.

డ్రైవర్లకు ఇచ్చిన తర్వాత, మిగిలిన కాయగూరలను స్థానిక మార్కెట్లలో అమ్మవచ్చని ఆశించారు.

వాడకుండా వదిలేసిన ట్యాక్సీల పై మొక్కల పెంపకం

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, "ప్రధానమంత్రి గారు.. మాకు సహాయం చేయండి" అని ఇక్కడ రాసుంది.

బ్యాంకాక్‌లో ట్యాక్సీ వ్యాపారం ఎక్కువగా పర్యటక రంగంపైనే ఆధారపడి ఉంటుంది.

కానీ ఆ దేశంలో విధించిన నిబంధనలతో వ్యాపారం స్తంభించిపోయింది.

వాడకుండా వదిలేసిన ట్యాక్సీల పై మొక్కల పెంపకం

ఫొటో సోర్స్, Getty Images

"ఇక ఇదే మాకు మిగిలిన చివరి మార్గం" అని ఒక కంపెనీ యజమాని థాపాకోర్న్ అస్సావాలెర్ట్‌కున్ ఏఎఫ్‌పీ వార్తా సంస్థకు చెప్పారు.

ఇందులో చాలా కార్ల లోన్లు ఇంకా తీరలేదు. వాటికి వాయిదాలు చెల్లించాల్సి ఉందని ఆయన చెప్పారు.

"చాలా ట్యాక్సీలు మరమ్మతులకు కూడా పనికి రాకుండా అయిపోవడంతో, ట్యాక్సీల పై కప్పుపై కాయగూరలు పెంచడం వల్ల ట్యాక్సీలకు కలిగే నష్టం ఏమీ ఉండదని ఆయన అన్నారు.

వాడకుండా వదిలేసిన ట్యాక్సీల పై మొక్కల పెంపకం

ఫొటో సోర్స్, EPA

కొన్ని కార్ల ఇంజన్లు, టైర్లు పూర్తిగా పాడైపోయాయని ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)