అఫ్గానిస్తాన్‌కు అత్యవసర సాయం ప్రకటించిన చైనా

ఫొటో సోర్స్, Reuters
తాలిబాన్ కొత్త ప్రభుత్వంతో సంబంధాలు కొనసాగిస్తామని చెప్పిన చైనా.. తాజాగా అఫ్గానిస్తాన్‌కు భారీ సహాయం ప్రకటించింది.
అఫ్గానిస్తాన్‌కు 31 మిలియన్ డాలర్ల విలువైన అత్యవసర సాయం అందిస్తామని వెల్లడించింది. ఇందులో ఆహార ఉత్పత్తులు, కరోనావైరస్ వ్యాక్సీన్లు కూడా ఉన్నాయి.
అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్ కొత్త ప్రభుత్వం ఏర్పాటుతో ఆ దేశంలో అదుపు తప్పిన పరిస్థితులు తిరిగి కుదుటపడతాయని చైనా అభిప్రాయపడింది.
అఫ్గాన్‌లో తాలిబాన్ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఇటీవలే ప్రకటించారు. అఫ్గానిస్తాన్ పేరును ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ అఫ్గానిస్తాన్‌గా మార్చారు.
తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించడానికి ఇంకా చాలాకాలం పడుతుందని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ అన్నారు.
కానీ చైనా మాత్రం తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించడానికి అందరికంటే ముందుంది.

ఫొటో సోర్స్, Getty Images
అఫ్గానిస్తాన్ ఇరుగుపొరుగు దేశాలైన పాకిస్తాన్, ఇరాన్, తజికిస్తాన్, తుర్క్‌మెనిస్తాన్ ప్రతినిధులతో సమావేశం సందర్భంగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్ అఫ్గాన్‌కు అత్యవసర సహాయం గురించి వెల్లడించారు.
అఫ్గానిస్తాన్‌కు సహాయం చేయాలని ఈ దేశాలను కూడా చైనా కోరింది. తాము కూడా అఫ్గానిస్తాన్‌కు 3మిలియన్ డోసుల వ్యాక్సీన్‌ను అందిస్తామని పేర్కొంది.
అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా బలగాలను ఉపసంహరించిన తీరుపై చైనా అసంతృప్తి వ్యక్తం చేసింది. అమెరికా చర్య అఫ్గానిస్తాన్‌ను మరింత గందరగోళ పరిస్థితుల్లోకి నెట్టేసిందని అభిప్రాయపడింది.
అఫ్గాన్‌లో అడుగుపెట్టిన క్షణం నుంచి వెళ్లిపోయే వరకు అమెరికా బలగాలు ఆ దేశానికి తీవ్రమైన నష్టం కలిగించాయని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి ఒకరు చెప్పారు.
సైనిక జోక్యంతో ఒకరి సొంత భావజాలాన్ని, విలువలను మరొకరిపై బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తే ఏం జరుగుతుందో గత రెండు దశాబ్దాలుగా అఫ్గాన్‌లో జరిగిన పరిణామాలు కళ్లకుకడుతున్నాయి అని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వెన్బిన్ అన్నారు.
మరోవైపు, చైనా తమకు అత్యంత ముఖ్యమైన భాగస్వామి అని తాలిబాన్లు అన్నారు. యుద్ధంతో చితికిపోయిన అఫ్గాన్ పునర్నిర్మాణానికి చైనా సహాయంపై, చైనా పెట్టుబడులపై తాలిబాన్లు భారీ ఆశలు పెట్టుకున్నారు.
తాలిబాన్లతో మంచి సంబంధాలు పెట్టుకునేందుకు చైనా తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
తాలిబాన్లు అఫ్గానిస్తాన్‌ను హస్తగతం చేసుకోవడానికి ముందే, గత జులైలో కొందరు తాలిబాన్ ప్రతినిధులను తమ దేశానికి పిలిపించుకుని చైనా చర్చలు జరిపింది. అఫ్గానిస్తాన్‌కు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పింది. అయితే, ఆ దేశం టెర్రరిస్టులకు అడ్డాగా మారకూడదని కోరింది.
ఇవి కూడా చదవండి:
- 1965: పాకిస్తాన్ కమాండోలు పారాచూట్లలో భారత వైమానిక స్థావరాలపై దిగినప్పుడు...
- పాకిస్తాన్ జైల్లో 24 ఏళ్లు ఉన్న వ్యక్తి చివరికి స్వదేశానికి ఎలా చేరుకున్నారంటే...
- రాహుల్ గాంధీని మళ్లీ కాంగ్రెస్ అధ్యక్షుడిని చేయాలంటూ పెరుగుతున్న డిమాండ్, ఇంతకీ సమస్య ఎక్కడుంది?
- అఫ్గానిస్తాన్ పేరును 'ఇస్లామిక్ ఎమిరేట్స్'గా మార్చిన తాలిబాన్లు, కీలక స్థానాల్లో అతివాదులతో కొత్త ప్రభుత్వం ఏర్పాటు
- అఫ్గానిస్తాన్ మహిళల క్రికెట్ జట్లు సభ్యులు ఎక్కడ, తాలిబాన్ల భయంతో పారిపోయారా?
- పిల్లలకు కరోనా వ్యాక్సీన్ అవసరమా, వైద్యులు ఏం చెబుతున్నారు
- విరాట్ కోహ్లీ: స్థాయి లేనోడా? భయం లేనోడా? ఈ సంజ్ఞపై ఎందుకింత చర్చ?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








