హైతీ: కరిబియన్ దీవిలో తీవ్ర భూకంపం.. 1297 మంది మృతి

హైతీ భూకంపం

ఫొటో సోర్స్, Getty Images

కరిబియన్ దేశం హైతీని శనివారం శక్తిమంతమైన భూకంపం వణికించింది.

భూకంప తీవ్రతతో చాలా భవనాలు కుప్పకూలడంతో 1,297 మంది చనిపోయారు. 5,700 మందికి పైగా గాయపడ్డారని అధికారులు తెలిపారు.

దేశంలో చర్చిలు, హోటళ్ల సహా ఎన్నో భవనాలు దెబ్బతిన్నాయి.

''దేశ పశ్చిమ భాగంలో 7.2 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి సెయింట్ లూయిస్ డ్యూ సూడ్ నగరానికి 12 కి.మీ. దూరంలో భూకంప కేంద్రం ఉంది''అని అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది.

హైతీ

భూకంపం వల్ల పెద్దఎత్తున నష్టం జరిగిందని దేశ ప్రధానమంత్రి ప్రకటించారు. నెల పాటు అత్యవసరస్థితి ప్రకటించారు.

భవనాలు కుప్పకూలడంతో కనిపిస్తున్న శిథిలాల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

హైతీ

పది కి.మీ. లోతులో ఈ ప్రకంపనలు వచ్చినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే (యూఎస్‌జీఎస్) తెలిపింది. ప్రజలు ఎక్కువగా జీవించే పోర్టౌ ప్రిన్స్‌కు ఇది 150 కి.మీ. దూరంలో ఉందని వివరించింది.

భూకంప ప్రభావం దాదాపు అన్ని కరిబియన్ దీవుల్లోనూ కనిపించింది.

''చాలా ఇళ్లు శిథిలం అయ్యాయి. ప్రజలు చనిపోయారు. కొందరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు''అని భూకంప కేంద్రానికి సమీపంలో నివసించే క్రిస్టెల్లా సెయింట్ హిలైర్ తెలిపారు.

సహాయ కార్యక్రమాల కోసం ఒక బృందాన్ని పంపించామని ప్రధానమమంత్రి ఏరియెల్ హెన్రీ తెలిపారు.

"శిథిలాల కింద నుంచి వీలైనంత ఎక్కువ మందిని ప్రాణాలతో బయటికి తీయాలని ప్రయత్నిస్తున్నాం. స్థానిక ఆస్పత్రులు, ముఖ్యంగా లెకాయ్‌లోని ఆస్పత్రులు క్షతగాత్రులతో నిండిపోయినట్లు తెలిసింది" అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

తర్వాత ఏరియల్ సర్వే ద్వారా కేయెస్‌లో పరిస్థితిని పరిశీలించినట్లు హెన్రీ తెలిపారు.

హైతీకి సాయం చేయడానికి తక్షణం చర్యలు తీసుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారు. నష్టాన్ని అంచనా వేసేందుకు,క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించేందుకు యూఎస్ఏఐడీ కృషి చేస్తుందని తెలిపారు.

ఇప్పటికే హైతీ ప్రజలు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కుంటున్నారని, ఇప్పుడు ఈ భూకంపం విధ్వంసం సృష్టించడం విచారకరమని బైడెన్ అన్నారు.

భూకంపం వచ్చిన తర్వాత దాదాపు ఆరు సార్లు భూమి కంపించినట్లు కూడా చెబుతున్నారు.

లెకాయ్‌ పట్టణంలో ధ్వంసమైన భవనాల్లో రెండు హోటళ్లు కూడా ఉన్నాయని హైతీలోని 'లీ నోవెల్లిస్టే' పత్రిక ఎడిటర్ ఫ్రాంట్జ్ డువల్ ట్వీట్ చేశారు. స్థానిక ఆస్పత్రులన్నీ నిండిపోయినట్లు ఆయన తెలిపారు.

హైతీలో భూకంపం

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, లెకాయ్‌లో కుప్పకూలిన భవనం

"హైతీలో ఆగస్టు 14న ఉదయం 8.30 సమయంలో మెల్లమెల్లగా బలంగా చాలా సెకన్ల పాటు భూమి కంపించింది" అని ఆయన రాశారు.

చాలా మంది తమ కుటుంబ సభ్యులు, వైద్యం, నీళ్ల కోసం వెతుక్కుంటున్నట్లు లెకాయ్‌లోని ఒక చర్చి పెద్ద అబియాదే లోజామా న్యూయార్క్ టైమ్స్‌తో చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

నష్టాన్ని అంచనా వేయడానికి కొన్ని రోజులు పడుతుందని సేవ్ ది చిల్డ్రన్ హైతీ డైరెక్టర్ లీలా బోరహ్లా న్యూయార్క్ టైమ్స్‌కు చెప్పా

భూకంపం కుదుపుతో తన మంచం కదిలిపోయిందని రాజధాని పోర్టౌ ప్రిన్స్‌లో ఉంటున్న 34 ఏళ్ల నయోమీ వెర్నీస్ అసోసియేటెడ్ ప్రెస్ న్యూస్ ఏజెన్సీకి చెప్పారు.

"నేను వెంటనే చెప్పులు కూడా వేసుకోకుండా బయటకొచ్చా. మేం 2010లో కూడా భూకంపం చూశాం. వెంటనే బయటికెళ్లాలని నాకు తెలుసు. నా ఇద్దరు పిల్లలు, మా అమ్మ లోపలే ఉన్నారని నాకు తర్వాత గుర్తొచ్చింది. మా పక్కింటి వ్యక్తి లోపలికెళ్లి వెంటనే బయిటికి రమ్మని వారికి చెప్పారు. మేమంతా వీధిలోకి పరిగెత్తాం" అని ఆమె చెప్పారు.

హైతీలో 2010లో వచ్చిన భూకంపంలో 2 లక్షల మందికి పైగా మరణించారు. దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు, మౌలిక సదుపాయాలకు భారీ నష్టం కలిగింది.

వీడియో క్యాప్షన్, హైతీలో భారీ భూకంపం, 304 మంది మృతి

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)