బెంగాల్ టైగర్: 70 పులులను చంపిన వేటగాడు 20 ఏళ్ల తర్వాత దొరికాడు.. ఒంటరిగా పులులతో పోరాడే ఈ టైగర్ హబీబ్ ఎవరు

ఫొటో సోర్స్, Getty Images
అంతరించిపోయే దశకు చేరుకున్న బెంగాల్ పులులను చంపినట్లు అనుమానిస్తున్న ఓ బంగ్లాదేశ్ వాసిని ఎట్టకేలకు అరెస్టుచేశారు. ఇతడి కోసం అటవీ అధికారులు 20 ఏళ్లపాటు గాలించారు. 70 పులులను ఆయన చంపినట్లు చెబుతున్నారు.
హబీబ్ తాలుద్కెర్ చాలామందికి 'టైగర్ హబీబ్'గా సుపరిచితుడు. ఆయనపై ఇప్పటివరకు మూడు అరెస్టు వారెంట్లు జారీ అయ్యాయి.
భారత్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో విస్తరించిన సుందర్‌బన్ మడ అడవుల్లో ఆయన తన కార్యకలాపాలు సాగించాడు.
ఈ ప్రాంతం బెంగాల్ పులులకు నిలయం. ప్రపంచంలో ఈ రకం పులులు అత్యధిక సంఖ్యలో ఉన్నది ఇక్కడే. ప్రస్తుతం వాటి సంఖ్య కొన్ని వేలకే పరిమితమైంది.
ఈ పులుల చర్మం, ఎముకలు, మాంసం ఇలా అన్నింటినీ బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తుంటారు. హబీబ్‌కు వాటి అమ్మకాల్లో సిద్ధహస్తుడిగా పేరుంది.
హబీబ్ చాలా కాలం నుంచీ పరారీలో ఉన్నాడని బంగ్లాదేశ్ పోలీసు విభాగం అధిపతి సైదుర్ రెహ్మాన్ ఢాకా ట్రిబ్యూన్‌కు చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
"50 ఏళ్ల హబీబ్ మొదట్లో అడవిలో తేనె సేకరించేవారు. స్థానికులు కొందరు ఆయన్ను గౌరవిస్తారు. మరికొందరు హబీబ్ పేరు చెబితేనే భయపడతారు" అని తేనె సేకరించే అబ్దుస్ సలాం ఏఎఫ్‌పీ వార్త సంస్థకు చెప్పారు.
పోలీసులు, అటవీశాఖ అధికారులు అతడి కోసం ఎన్నో ఏళ్ల నుంచీ వెతుకుతున్నారని అధికారి అబ్దుల్ మన్నన్ ఢాకా ట్రిబ్యూన్‌కు చెప్పారు.
"హబీబ్ చాలా ప్రమాదకరమైన వ్యక్తి. అడవిలో పులులతో ఒంటరిగా పోరాడగలడు. పులులను వేటను నిషేధించి చాలా కాలమైనా ఆయన గుట్టుగా అడవిలోకి చేరుకుని, వాటిని వేటాడుతుంటాడు" అన్నారు.
"తనపై ఎన్నో కేసులు ఉన్నప్పటికీ, హబీబ్ ఈ నేరాలు చేయడం ఆపలేదు. ఇందులో కొన్ని బలమైన ముఠాల ప్రమేయం ఉంది" అని చెప్పారు.
నిందితుడు హబీబ్‌ను శనివారం ఉదయం అదుపులోకి తీసుకున్నారని పత్రిక చెప్పింది. 2018లో విడుదలైన బంగ్లాదేశ్‌లోని పులుల జనాభా గణాంకాల ప్రకారం సుందర్‌బన్ అడవుల్లో బెంగాల్ పులుల సంఖ్య 114కు పెరిగింది. 2015లో వాటి సంఖ్య 106 ఉంది.
గత కొన్ని దశాబ్దాల్లో వీటి సంఖ్య వేగంగా తగ్గిపోయిందని, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బెంగాల్ పులుల జనాభా గణనీయంగా పెరిగిందని డబ్ల్యుడబ్ల్యుఎఫ్ గణాంకాలు విడుదల చేసింది.
ఇవి కూడా చదవండి:
- MIS-C: కరోనా వల్ల పిల్లలకు వస్తున్న ఈ కొత్త వ్యాధి ఎంత ప్రమాదకరం, దీనిని ఎలా గుర్తించాలి?
- జీడీపీ: నాలుగో త్రైమాసికంలో 1.6 శాతం వృద్ధి
- కోవిడ్: కరోనా నుంచి కోలుకున్న తరువాత డయాబెటిస్ వస్తుందా?
- భారతదేశంలో కోవిడ్ కారణంగా పెరుగుతున్న అనాథ పిల్లలు...ఈ సమస్యకు పరిష్కారం ఏంటి?
- 'ఆనందయ్య మందు' కరోనాకు పని చేస్తుందా... ఎప్పటి నుంచి అందుబాటులోకి రావొచ్చు.. ఇప్పటి వరకు ఏం జరిగింది?
- భారత్‌లో 500 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడతామని ప్రకటన.. కానీ, ఆ కార్యాలయమే లేదు: బీబీసీ పరిశోధన
- కరోనా సోకితే గర్భిణులు ఏం చేయాలి? తల్లి నుంచి బిడ్డకు వస్తుందా?
- తెలంగాణ: అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్న ఖమ్మం మహిళలు
- కరోనావైరస్ను జయించారు సరే, కానీ ఈ విషయాలను ఏమాత్రం మర్చిపోకండి
- ఊరంతా కలిసి కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేసుకున్నారు
- మ్యూకోర్మైకోసిస్: భారత్‌లో కోవిడ్ రోగుల అవయవాలు దెబ్బతీస్తున్న 'బ్లాక్ ఫంగస్'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








