సింగపూర్‌ వేరియెంట్‌: పిల్లలకు ముప్పు అంటున్న కేజ్రీవాల్‌, అలాంటిదేం లేదంటున్న సింగపూర్‌

సింగపూర్‌లో ఇటీవల కాలంలో కోవిడ్ కేసుల సంఖ్య పెరిగింది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సింగపూర్‌లో ఇటీవల కాలంలో కోవిడ్ కేసుల సంఖ్య పెరిగింది.

సింగపూర్‌లో కరోనావైరస్ కొత్త వేరియంట్ వెలుగు చూసిందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదని సింగపూర్ ప్రభుత్వం వెల్లడించింది.

సింగపూర్‌లో కనిపించిన కొత్త వేరియంట్ పిల్లలకు ప్రమాదకరమని, సింగపూర్ నుంచి వచ్చే విమానాలను ఆపాలని కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.

దీని వల్ల భారత్‌లో మూడో వేవ్ ఇన్ఫెక్షన్లు తలెత్తే అవకాశం ఉందని కూడా ఆయన అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

కేజ్రీవాల్ వ్యాఖ్యలపై సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తీవ్రంగా స్పందించింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

"ఇటీవల భారత్‌లో కనిపించిన బి.1.617.2 వేరియంట్‌కు సింగపూర్‌లో కనిపించిన అనేక క్లస్టర్లతో సంబంధం ఉన్నట్లుగా ఫైలోజెనెటిక్ పరీక్షల్లో తేలింది" అని సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

"ప్రత్యేకంగా సింగపూర్ వేరియంట్ అనేది ఏమీ లేదు" అని ఆ ప్రకటనలో పేర్కొంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

రాజకీయ నాయకులు వాస్తవాలకు కట్టుబడి ఉండాలని సింగపూర్ విదేశాంగ శాఖ మంత్రి వివియన్ బాలకృష్ణన్ అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

సింగపూర్ ప్రకటనపై భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జై శంకర్ స్పందిస్తూ "కేజ్రీవాల్ భారత్‌ తరపున మాట్లాడలేదు" అని అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 5
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 5

సింగపూర్‌లో గత కొన్ని నెలలుగా వైరస్ సామాజిక వ్యాప్తి జరగడం కనిపించలేదు. కానీ, ఇటీవల కాలంలో సింగపూర్‌ పెరుగుతున్న కేసులతో పోరాడుతోంది. సింగపూర్‌లో కొత్త వేరియంట్ ఏమీ కనిపించలేదు" అని సింగపూర్ మెడికల్ స్కూల్‌లో ఇవల్యూషనరీ బయోలజిస్ట్ గవిన్ స్మిత్ బీబీసీకి చెప్పారు.

"ఇది పూర్తిగా సాధ్యం కాదని చెప్పలేనప్పటికీ, సింగపూర్‌లో ఇన్ఫెక్షన్ వల్ల తీవ్రమైన సామాజిక వ్యాప్తి గాని, లాంగ్ చైన్ ట్రాన్స్‌మిషన్‌ కానీ లేకపోవడం వల్ల కొత్త వేరియంట్ వచ్చే అవకాశం లేదు" అని అన్నారు.

సింగపూర్‌లో కొత్త కరోనావైరస్‌ స్ట్రెయిన్‌ కనిపించడానికి చాలా తక్కువ అవకాశాలున్నాయని భారత్‌లో నిపుణులు కూడా అంగీకరిస్తున్నారు.

"ప్రత్యేకంగా సింగపూర్ వేరియంట్ లేదు"

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, "ప్రత్యేకంగా సింగపూర్ వేరియంట్ లేదు"

"అయితే, జీనోమ్ సీక్వెన్సింగ్ ద్వారా దీన్ని అధ్యయనం చేయాల్సి ఉంది. సింగపూర్‌లో ఈ వేరియెంట్‌ వైరస్‌ వ్యాప్తి చాలా తక్కువ కేసుల్లో కనిపించింది. ఈ కేసుల సంఖ్య మరో కొత్త వేరియంట్‌ను పుట్టించేందుకు సరిపోవు. ఒక వైరస్ కొత్త వేరియంట్‌గా రూపాంతరం చెందాలంటే కొన్ని లక్షల సార్లు మల్టిప్లై కావాలి. ఇది సింగపూర్ వేరియంట్ అవడానికి అవకాశాలు తక్కువ" అని భారత్‌లో పబ్లిక్ పాలసీ హెల్త్ సిస్టమ్స్ ఎపిడెమియాలజిస్ట్ డాక్టర్ చంద్రకాంత్ లహరియా చెప్పారు.

మిగిలిన వైరస్‌ల మాదిరిగా కాకుండా కరోనావైరస్ కూడా ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతున్న సమయంలో సూక్ష్మ స్థాయుల్లో రూపాంతరం చెందుతూ ఉంటుంది.

ఇందులో అత్యధిక మ్యుటేషన్లు వైరస్ ప్రవర్తనను ఏమాత్రం మార్చవు.

కానీ, కొన్ని మ్యూటేషన్లు మాత్రం స్పైక్ ప్రోటీన్‌ను మార్పులకు లోను చేసి మానవ శరీర కణాల్లోకి చేరిపోతాయి. ఇలాంటి వేరియంట్ల వల్ల ఇన్ఫెక్షన్ తీవ్రత పెరుగుతుంది. ఇలాంటి వేరియంట్లు వ్యాక్సీన్లకు కూడా లొంగవు.

భారత్‌లో కనిపించిన బి.1.6172 ఇలాంటి కోవలోకే వస్తుంది.

సింగపూర్‌లో కనిపించిన కొత్త వేరియంట్‌కు ప్రపంచవ్యాప్తంగా 44 దేశాల్లో వ్యాపించిన వైరస్‌తో సంబంధం ఉంది.

సింగపూర్‌లో సమగ్రమైన కోవిడ్ పరీక్షా విధానాలు, కాంటాక్ట్ ట్రేసింగ్ అమలులో ఉన్నాయి. ఇక్కడి పాజిటివ్ కేసుల్లో కనిపించిన వేరియంట్‌లను ఎప్పటికప్పుడు ఆ దేశం వెల్లడిస్తూనే ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)