సూయజ్ కాలువ: ‘పోటు’ వచ్చినా కదలని ఓడ... మరిప్పుడేం చేస్తారు

ఫొటో సోర్స్, EPA
సూయజ్ కెనాల్‌లో ఇరుక్కుపోయిన ఓడను 'పోటు' (high tide) సమయంలోనైనా కదిలించగలమన్న నిపుణుల ఆశ నిరాశగా మిగిలింది. శనివారం సాయంత్రం సముద్రపు పోటు వచ్చినా, ఓడ ఏ మాత్రం దారికి రాలేదు. దీంతో దాన్ని కదిలించే ప్రయత్నాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
ఆదివారం సాయంత్రం కల్లా తమ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉందని నిపుణులు వెల్లడించారు.
ఈ ఓడ సూయజ్ కాలువలో ఇరుక్కుపోవడం వల్ల ఆ మార్గం గుండా వెళ్లాల్సిన దాదాపు 300 కార్గో షిప్‌లు నిలిచిపోయాయి.
కొన్ని ఓడలు వెనక్కి తిరిగి ఆఫ్రికా మీదుగా ప్రయాణం ప్రారంభించాయి.

ఫొటో సోర్స్, Reuters
ఇప్పుడు ఏం జరుగుతోంది?
ప్రస్తుతానికి అదనపు డ్రెడ్జింగ్ పరికరాలతో ఇసుక, బురద మట్టిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.
ఒక్క శనివారం నాడు సుమారు 20,000 టన్నుల ఇసుకను ఎత్తిపోశారు.
ఎవర్ గివెన్ నౌకను కదిలించడానికి 14 టగ్ బోట్లు నిరంతరాయంగా పని చేస్తున్నాయి.
బలమైన గాలులు, అలల కారణంగా ఈ ఓడను కదిలించే పనులకు పదే పదే అంతరాయం కలుగుతోంది.
ఇప్పటి వరకు రెండు వైపులా 30 డిగ్రీల మేర మాత్రమే ఓడను కదిలించగలిగారు.
ఈ పనుల్లో చిన్నపాటి విజయం సాధించగలిగామంటూ టగ్ బోట్లు హారన్లతో సంతోషం వ్యక్తం చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపించాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఓడ కింద నుంచి నీరు ప్రవహించడం ప్రారంభించిందని సూయజ్ కెనాల్ అథారిటీ చైర్మన్ జనరల్ ఓసామా రాబీ వెల్లడించారు.
" ఏ క్షణంలోనైనా ఓడ కదలవచ్చు" అని ఆయన అన్నారు.
ప్రస్తుతానికైతే ఓడ మీద ఉన్న బరువును తగ్గించడానికి, దానిపై ఉన్న 18,300 కంటెయినర్లను దింపాల్సిన అవసరం కనిపించడం లేదని రాబీ వ్యాఖ్యానించారు
తీవ్రమైన అలలు, గాలుల వల్ల ఈ ఓడ ఇసుకలోకి కూరుకుపోయిందని మొదట్లో అంతా అనుకున్నారు.
అయితే వాతావరణ పరిస్థితులే ఈ ఘటనకు ప్రధాన కారణం కాదని, కొన్ని సాంకేతిక సమస్యలు, మానవ తప్పిదాలు కూడా ఉన్నాయని రాబీ మీడియాకు చెప్పారు. అయితే దీనికి సంబంధించి ఎలాంటి వివరాలను ఆయన ఇవ్వలేదు.
"అన్ని విషయాలు విచారణలో బయటపడతాయి" అని మాత్రం అన్నారు.

ఫొటో సోర్స్, SUEZ CANAL AUTHORITY
ప్లాన్ బి ఉందా?
ఇసుక తవ్వకం, టగ్ బోట్లతో లాగడం ద్వారా పని కాకపోతే ఓడ మీద ఉన్న కొన్ని కంటెయినర్లను దించడమే మార్గమని సూయజ్ కెనాల్ అథారిటీ చైర్మన్ రాబీ అన్నారు.
నౌక మీద ఉన్న సామాగ్రిలో కొంత భాగాన్ని దించాలన్నా, వేరే షిప్పుల్లోకి ఎక్కించాలన్నా ప్రత్యేక యంత్రాలు, పెద్ద పెద్ద క్రేన్‌ల(60 మీటర్ల దూరం వరకు వెళ్లగలవి) అవసరం ఉంటుందని యూకే చాంబర్ ఆఫ్ షిప్పింగ్ అధ్యక్షుడు జాన్ డెన్‌హామ్ అన్నారు.
బరువులు తగ్గించాల్సి పరిస్థితి వస్తే ఈ ప్రక్రియకు కొన్ని వారాల సమయం పడుతుందని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Vessels Value
ఈ నౌకా మార్గానికి ఎందుకంత ప్రాధాన్యం?
400 మీటర్ల పొడవు, 200,000 టన్నుల బరువున్న ఈ నౌక పెనుగాలి, ఇసుక తుపాను రావడంతో దారి కనిపించక మంగళవారం ఉదయం నీటిలో చిక్కుకుపోయిందని చెబుతున్నారు.
ప్రపంచ వాణిజ్యంలో 12 శాతం 193 కిలోమీటర్ల మేర ఉన్న ఈ కెనాల్ మీదుగానే జరుగుతుంది.
ఈ కాలువ మధ్యధరా సముద్రం, ఎర్ర సముద్రాలను కలుపుతుంది.
ఇది ఆసియాకు, యూరోప్‌కు దూరాన్ని తగ్గించే సముద్ర మార్గం.
ఆఫ్రికా దక్షిణ భాగంలో ఉన్న ప్రత్యామ్నాయ మార్గం కేప్ ఆఫ్ గుడ్‌హోప్ మీదుగా ప్రయాణించాలంటే అదనంగా మరో రెండు వారాల సమయం పడుతుంది.
ఎవర్ గివెన్ నౌక చిక్కుకు పోయిన కారణంగా ఇప్పటి వరకు 300 నౌకలు నిలిచిపోయాయి.
పెద్ద ఎత్తున కార్గో షిప్‌లు నిలిచిపోవడం వల్ల సరకు రవాణాకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.
రోజుకు సుమారు 9.6 బిలియన్ డాలర్లు అంటే దాదాపు 70 వేల కోట్ల నష్టం జరుగుతోందని అంచనా వేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- అంగారకుడి మీద ఒకప్పుడు ప్రవహించిన నీరంతా ఆ గ్రహం పైపొరలోనే బందీగా ఉందా?
- కండోమ్స్, టైర్లు సహా ఎన్నో వస్తువుల తయారీలో వాడే విలువైన పదార్థం కనుమరుగైపోనుందా
- విశాఖపట్నం: సాగర తీరంలో టీయూ-142 యుద్ధ విమానం... దీని చూస్తే ఎందుకు ఉద్వేగం ఉరకలేస్తుంది?
- ఆఫ్రికా నుంచి హబ్సిగూడకు.. బానిసలుగా వచ్చి బాద్‌షాలయ్యారు
- దేశంలో మళ్లీ లాక్డౌన్.. ఎక్కడెక్కడంటే
- యాంటీకిథెరా: రెండు వేల ఏళ్ల కిందటి 'పురాతన కంప్యూటర్'.. గుట్టు వీడబోతోందా
- సముద్రపు చేపలా, చెరువు చేపలా... ఏవి తింటే ఆరోగ్యానికి మంచిది?
- మహానగరం మధ్యలో అభయారణ్యం... అందులో రహస్య గిరిజన గ్రామం
- గుజరాత్: టీ షర్ట్ ధరించి వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేను సభ నుంచి పంపించేసిన స్పీకర్
- మీ వ్యక్తిగత సమాచారాన్ని ఇంటర్నెట్ నుంచి ఇలా తొలగించండి
- బిర్యానీ పక్కాగా వండాలంటే కచ్చితమైన లెక్కలు ఉంటాయా? దీనికో ఆల్గారిథమ్ ఉందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









