2021లో డబ్బు గురించి మీ ఆందోళనలు దూరం చేసే ఐదు మార్గాలు ఇవే

ఐదు మార్గాలు

ఫొటో సోర్స్, DEEPAK SETHI/GETTY IMAGES

ప్రసాదరావు క్రెడిట్ కార్డు అప్పుల్లో పీకల్లోతు మునిగిపోయారు. ఆయనకు వాటి నుంచి ఎలా బయటపడాలో, అసలు ఏం చేయాలో అర్థం కాలేదు.

ఆయన బయటకు వెళ్లాలంటేనే ఇబ్బంది పడిపోయారు. అప్పుల వాళ్లు ఎదురై అడుగుతారని ఆలోచించేవారు.

ఒకరోజు ఆయనకు భార్య ఇంట్లో ఏవో సరుకులు కావాలని చెప్పారు. కానీ, ఆయన 'నేను వెళ్లలేను, అక్కడ చాలా అప్పు పేరుకుపోయి ఉంది' అన్నారు.

ఆ సమయంలో ప్రసాదరావు అప్పుల గురించి మొత్తం భార్యకు చెప్పారు. ఆయన 4 లక్షలకు పైగా అప్పులు చేశారు.

ఫైనాన్షియల్ ప్లాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫైనాన్షియల్ ప్లాన్

ఇక్కడ, ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే ఆ అప్పుల నుంచి ఎలా బయటపడాలో ప్రసాదరావుకు తెలీలేదు.

అయితే, ఆయన భార్య సలహాతో అప్పులు తీర్చడం మొదలుపెట్టారు. ప్రతి నెలా తన బడ్జెట్, ఫైనాన్షియల్ ప్లాన్ వేసుకునేవారు. అంతకు ముందు ఆయన ఎప్పుడూ అలా చేయలేదు.

"నేను అంతకు ముందెప్పుడూ బడ్జెట్ వేసుకునేవాడిని కాదు. దానివల్ల నాకు ఆర్థిక స్వేచ్ఛ లేకుండా పోతుందేమో అనుకునేవాడిని" అంటారు ప్రసాదరావు.

కానీ, బడ్జెట్ వేసుకున్న తర్వాత తనకు స్వేచ్ఛ పెరిగినట్లు ఆయనకు అనిపించింది. మెల్లమెల్లగా ఖర్చులు కూడా తగ్గించారు. ఆదా చేయడం పెరిగింది. వాటితో ఆయన అప్పులు పూర్తిగా తీర్చేసారు.

"నా అప్పుల వల్ల, ఇప్పుడు డబ్బులు తెలివిగా ఖర్చు పెట్టడం నేర్చుకున్నాను. జీవితాన్ని ఆస్వాదించే సరైన దారిని కనుగొన్నాను" అన్నారు.

ప్రసాదరావులాగే ఎంతోమంది ఆర్థిక సమస్యలతో సతమతం అవుతుంటారు. దీనికంతటికీ కారణం ఫైనాన్షియల్ యాంగ్జయిటీ అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

ఫైనాన్షియల్ యాంగ్జయిటీ

ఫొటో సోర్స్, Getty Images

ఫైనాన్షియల్ యాంగ్జయిటీ(ఆర్థిక ఆందోళన) ఏమిటి

ఏదో సరిగా జరగడం లేదని, దానిపై దృష్టి పెట్టాలని మన శరీరం, మెదడు మనకు సిగ్నల్ ఇచ్చినపుడు ఆందోళన కలుగుతుంది.

దానిని, కష్ట సమయం నుంచి బయటపడే సమయం వచ్చింది అని చెప్పే ఒక ప్రమాద ఘంటికలా అనుకోవాలి. అయితే తరచూ జనం ఆందోళనగా అనిపించినప్పుడు, కష్టాలపై దృష్టి పెట్టడం మానేస్తారు.

అందుకే, మనకు డబ్బు గురించి ఆందోళన ఉంటుంది. మనం సాధారణంగా దాన్ని పట్టించుకోం. పరిస్థితులు ఎంత ఘోరంగా మారుతాయంటే, మనం ఆవేశంతో నిర్ణయాలు తీసుకుంటాం.

అలాంటి నిర్ణయాల వల్ల పరిస్థితులు మరింత ఘోరంగా మారిపోతాయి. దానివల్ల ఆందోళన మరింత పెరిగిపోతుంది. అలా ఒక విషవలయంలో చిక్కుకుపోతాం. అందుకే మొట్టమొదట మన ఆందోళనపై దృష్టి పెట్టాలి. మనకు ఏం జరుగుతోంది అనేది ఆలోచించాలి. ఈ ఫైనాన్షియల్ యాంగ్జైటీ నుంచి బయటపడడానికి ఐదు చిట్కాలు ఉన్నాయి.

1. డబ్బు గురించి జిజ్ఞాస పెరగాలి

మొదటి అడుగు ఏంటంటే, డబ్బుల గురించి తెలుసుకోవాలి అని మనలో ఆసక్తి పెరగాలి.

ఇది, ప్రస్తుతం ఉన్న అప్పులను తీర్చడం గురించి ఆలోచించకుండా, మీ ఆర్థిక జీవితంలో ఏం జరుగుతోంది అనేదానిపై ఆసక్తి చూపడం లాంటిది.

దానికోసం, మన డబ్బులను బట్టి మన గురించి ఏం తెలుస్తోంది. మనం సమయాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నాం. మన కోసం ఏవి నిజంగా ముఖ్యం అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవడం ఒక మంచి పద్ధతి.

మన డబ్బులపై దృష్టి పెట్టాలి

ఫొటో సోర్స్, Getty Images

2.మన డబ్బులపై దృష్టి పెట్టాలి

నెలకు కనీసం ఒకసారైనా ఈ మూడూ చేయాలి.

- మీ బ్యాంక్ అకౌంట్‌లో ఎంత డబ్బు వస్తోంది. ఎంత మిగులుతోంది.

- ముందు ముందు ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతోంది అనేది కూడా ఆలోచించాలి.

- ఒక ప్లాన్ రూపొందించుకోవాలి.

ఉదాహరణకు మీ అద్దె పెరగవచ్చు. అద్దె ఇచ్చే సమయానికి ముందే మీరు ఏదైనా ఏర్పాట్లు చేసుకునేలా మీ బడ్జెట్‌లో కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సి రావచ్చు. అది సమయానికి ముందే చేయాలి. ఆ సమయం వచ్చేవరకూ వేచిచూడకూడదు.

3. మీ బలాన్ని గుర్తించండి

మీ లక్ష్యం దిశగా మీరు ఎంత పురోగతి సాధించారో గుర్తించడం కూడా చాలా ముఖ్యం.

మీరు లక్ష్యం ఎందుకు చేరుకోలేదు అనే దాని గురించి కంగారు పడకండి.

మీరు చిన్న చిన్న అడుగులు వేస్తున్నప్పటికీ, మీకు ఆ సామర్థ్యం ఉందని అనిపించడం అనేది ఒక ముఖ్యమైన మార్పు

ఫైనాన్షియల్ యాంగ్జయిటీ అంతం కావడం అనేది రాత్రికిరాత్రే జరిగిపోయేది కాదు.

ప్రయోగాలకు అవకాశం ఇవ్వండి

ఫొటో సోర్స్, Getty Images

4. ప్రయోగాలకు అవకాశం ఇవ్వండి

మనం తరచూ సరైన పద్ధతిలోనే ఏదైనా చేయాలని అనుకుంటాం. ఎందుకంటే ఏదైనా తేడా వస్తే విఫలం అవుతామో అనే భయం ఉంటుంది.

కానీ, చాలాసార్లు ఏదైనా చేయడానికి సరైన పద్ధతి ఒక్కటే ఉండదు. మనం ఇంకాస్త ఆలోచిస్తే, మన ముందు ఇంకా ఎన్నో దారులు తెరుచుకోవచ్చు.

మరింత సృజనాత్మకంగా ఉండేందుకు మనకు మనమే ఒక అవకాశం ఇవ్వాలి.

5. డబ్బులు లేకపోవడం 'శుభవార్తే'

డబ్బులు లేకపోవడం 'శుభవార్త' అనేది వినడానికి వింతగా ఉన్నా, పరిస్థితులను ఎదుర్కోడానికి, అది మన ఆలోచనా విధానంలో మార్పు తీసుకురావడం లాంటిది.

మన జీవితంలో సవాళ్లకు మనం ఎలా స్పందిస్తాం, వాటిని ఎలా ఎదుర్కోవాలి అనే విషయంలో, అది మన దృక్పథాన్ని మార్చుకోవడం ఎంత ముఖ్యం అనేది చెబుతుంది.

'ఆర్థిక సమస్యల నుంచి బయటపడలేం అని ఆలోచించడానికి బదులు, 'ఈ సమస్యల నుంచి ఎలా బయటపడాలి' అని మనం ఆలోచించాలి.

ఈ ప్రక్రియలో మన గురించి మనకు చాలా ఆసక్తికరమైన విషయం తెలుస్తుంది. మనం డబ్బు ఎలా ఖర్చు చేస్తాం అనేదానిపై వ్యక్తిగత విషయాలు ఎలాంటి ప్రభావం చూపిస్తాయో మనం తెలుసుకోవచ్చు.

ఇందులో మాయలు, మంత్రాలు లేవు

ఫొటో సోర్స్, Getty Images

ఇందులో మాయలు, మంత్రాలు లేవు

పైనాన్షియల్ థెరపీ, డబ్బుల లావాదేవీల గురించి మనల్ని మనం మెరుగు పరుచుకునే ఈ ప్రవర్తన మంత్రదండం లాంటిదేమీ కాదు.

మన ముందు ఒక సవాలు ఉందని అంగీకరించడంతో ఈ ప్రక్రియ మొదలవుతుంది. కొన్ని అలవాట్లు మార్చుకునేలా, ఒక ప్లాన్ రూపొందించుకునేలా ఆ సిగ్నల్ మనకు ఏం చెప్పాలని అనుకుంటోంది అని తెలుసుకునే వరకూ మన ఈ ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది.

ఈ ప్రక్రియలో మనల్ని మనం ప్రశ్నించుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. అంటే మన పని ఉద్దేశం ఏంటి, మన ప్రాధాన్యం ఏంటి, మన లక్ష్యాన్ని ఏవేవి ప్రభావితం చేస్తున్నాయి. మన ఆర్థిక పరిస్థితులపై ఎలాంటి బంధాలు ప్రభావితం చూపుతున్నాయి. మనం ఏయే విషయాలను మార్చుకోగలం, వేటిని మార్చలేం అనేవాటికి సమాధానం తెలుసుకోవాలి.

మీ ఉద్యోగం పోతే

ఇలాంటి పరిస్థితిలో మీరు మొదట ప్రశాంతంగా కూర్చుని, ప్రస్తుత పరిస్థితిని విశ్లేషించుకోవాలి అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

ఇందులో, మీకు ఎవరితో అయితే ఆర్థిక బంధాలు ఉంటాయో.. అలాంటి వారిని గడువు అడగడం, అంటే మీ ఇంటి యజమాని లాంటి వారితో ముందే మాట్లాడడం, అద్దె ఇవ్వడానికి కాస్త సమయం ఇవ్వాలని అడగడం లాంటివి మంచి పద్ధతి.

ఉద్యోగం పోవడానికి ముందు మీరు పొదుపు చేసిన డబ్బు ఏదైనా ఉంటే, ఆ డబ్బుతో మీరు ఎప్పటివరకూ ఇంటి ఖర్చులు నడిపించవచ్చు అనే ఒక ప్లాన్ వేసుకోవాలి.

అలా చేయడం వల్ల, ప్రత్యామ్నాయ పద్ధతుల వల్ల మీరు డబ్బులు ఎలా సంపాదించవచ్చు అని ఆలోచించడానకి మీకు సాయం లభిస్తుంది.

మీరు ఆ డబ్బుతో అన్ని ఖర్చులూ తీర్చలేకపోవచ్చు. కానీ రుణం, దాని వడ్డీ నుంచి బయటపడ్డానికి ఇది మీకు ఒక స్థాయి వరకూ సాయం చేయవచ్చు. దానితోపాటూ మీ ఖర్చులు తగ్గించుకోవడం కూడా మర్చిపోకండి.

ఇవన్నీ చేయడం ద్వారా ఏయే విషయాలపై మీకు నియంత్రణ ఉంది, ఏయే విషయాలు మీ నియంత్రణలో లేవు అనేది తెలుసుకోడానికి ప్రయత్నించండి. దానివల్ల మన లక్ష్యం వైపు ముందుకు సాగడానికి మనకు సాయం లభిస్తుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)