‘ఉద్యోగం పోయింది.. అందుకే నా సెక్సీ ఫోటోలు అమ్ముకుంటున్నా’

- రచయిత, లారా జోన్స్
- హోదా, బీబీసీ బిజినెస్ రిపోర్టర్
"నాకు ఇది తప్పదు. ఆదాయం కావాలి. నేను ఊరికే నా నగ్న ఫోటోలు తీసుకుని ఆన్‌లైన్‌లో పెట్టడం లేదు'' అన్నారు మార్క్.
కరోనా వైరస్ కారణంగా మార్చి నెలలలో మార్క్ ఉద్యోగం పోయింది. అప్పటి నుంచి తన సెమీ న్యూడ్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉపాధి పొందుతున్నాడు.
32 ఏళ్ల మార్క్ గతంలో ఓ ఫైవ్‌స్టార్ రిసార్ట్ కంపెనీలో షోలు నిర్వహించేవారు. లాక్‌డౌన్‌తో ఆయన కాంట్రాక్టు రద్దయింది. " జాబ్‌సెంటర్ వెబ్‌సైట్‌లో షాప్‌కీపర్ పోస్టు దగ్గర్నుంచి కనిపించిన ప్రతి జాబ్‌కు నేను అప్లికేషన్లు పెట్టాను'' అని చెప్పారు మార్క్.
ఒక మిత్రుడి సలహాతో ఓన్లీఫ్యాన్స్‌లో ఒక అకౌంట్ ఓపెన్ చేశారాయన. దీన్ని ఫాలో అయ్యే సబ్‌స్క్రైబర్లు నెలనెలా కొంత ఫీజు చెల్లించి ఈ అకౌంట్ సృష్టికర్త పెట్టే ఫోటోలు, వీడియోలు, లైవ్ స్ట్రీమ్‌లను వీక్షించవచ్చు. ఇందులో పోస్టులు పెట్టేవారి నుంచి ఈ వెబ్‌సైట్ 20శాతం కమీషన్ తీసుకుంటుంది.
పూర్తి నగ్నచిత్రాలు ఉండవంటూ ప్రొఫైల్‌లో పేర్కొన్నప్పటికీ, ఆయన చిత్రాలు అమ్ముడు పోవడం మొదలు పెట్టాయి. గత నాలుగు నెలలుగా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా నెలకు 1500 యూరోలు సంపాదిస్తున్నారు.
"ఓన్లీఫ్యాన్స్ సైట్ నా ఇంటి రెంట్‌ను చెల్లిస్తోంది. నా తిండి ఖర్చులు, నా కారు ఖర్చులు చెల్లిస్తోంది. నాకు కావాల్సిన అన్ని అవసరాలను తీరుస్తోంది'' అని చెబుతున్నారు మార్క్.
"దీనికి నెగెటివ్ కోణం కూడా ఉంది. దీన్ని ప్రారంభించిన కొత్తల్లో నా స్నేహితులు నన్ను తిడుతూ కామెంట్లు పెట్టారు'' అని చెప్పారు మార్క్.
"ఇది ఆత్మను అమ్ముకోవడంలాంటిది'' అని నా స్నేహితులు విమర్శించారు. నేను అందరితో సెక్స్‌లో పాల్గొంటు, వాటిని రికార్డు చేసి పోస్ట్ చేస్తానని ఊహించుకున్నారు. కానీ ఇది అలాంటిది కాదు. నా పేజ్‌లో అలాంటివి ఉండవు'' అన్నారాయన.
శృంగార కార్యకలాపాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేయమని చాలామంది అడిగారని కాను తాను తిరిస్కరించానని, ఇలా చేయడం వల్ల డబ్బు తక్కువైన ప్రతి ఒక్కరూ అలా చేయడానికి ప్రయత్నిస్తారని భావించానని మార్క్ చెప్పారు.
"ఈ రోజుల్లో చాలామంది యువత సోషల్ మీడియాలో ప్రతి ఒక్కటి పోస్ట్ చేస్తున్నారు. ఇది దానికి కొనసాగింపు. దీని ద్వారా డబ్బు సంపాదించవచ్చు అంతే'' అన్నారు మార్క్."డబ్బు సంపాదించడానికి కష్టపడుతున్న వారికి ఇది కొంచెం మెరుగైన ఆప్షన్'' అన్నారాయన.
"నేనొక్కదాన్నే కాదు, ఉద్యోగం లేక నా స్నేహితులు చాలామంది ఇబ్బందులు పడుతున్నారు'' అని చెప్పారు రెబెకా(ఇది ఆమె అసలు పేరు కాదు). స్కాట్‌లాండ్‌లో క్రాఫ్ట్‌వర్కర్‌గా పని చేస్తున్న రెబెకా, లాక్‌డౌన్ కారణంగా ఉద్యోగం పోవడంతో ఏప్రిల్‌లో తన తల్లిదండ్రుల వద్దకు వచ్చారు.
గతంలో న్యూడ్ ఫోటోలను ఆన్‌లైన్‌లో అమ్ముకున్న అనుభవమున్న రెబెకా "ఉద్యోగం పోయాక దీన్ని మరింత సీరియస్‌గా నిర్వహించక తప్పలేదు'' అని ఆమె వివరించారు.
ఓన్లీఫ్యాన్స్ సైట్‌లో ఎకౌంట్ ఓపెన్ చేసిన ఆమె, తన తల్లిదండ్రులు పనిమీద బయటకు వెళ్లినప్పుడు తన ఫోటోషూట్ ప్రారంభిస్తారు. వీటిని సబ్‌స్క్రైబర్లకు అమ్ముకోవడం ద్వారా ఆమె నెలకు సుమారు 5.55 యూరోలు సంపాదిస్తారు.
ఇది ప్రమాదకరం కూడా
ఆన్‌లైన్‌లో మాట్లాడేవారితో తన సమయాన్ని చక్కగా వినియోగించుకుంటారు రెబెకా. "ఇదో మంచి ఆదాయ వనరు. కానీ ఇందులో రిస్కులు కూడా ఉంటాయి'' అన్నారామె. "ఇదో ఎమోషనల్ వర్క్. నిన్ను నువ్వు ఆవిష్కరించుకోవాలి. ఒక్కోసారి ప్రమాదంలో కూడా ఇరుక్కోవచ్చు'' అన్నారు రెబెకా.
ఇందులో ఆదాయం లేని శ్రమ కూడా ఉంటుందన్నది మర్చిపోవద్దు. ఫోటోలు తీయడం, దానికోసం రెడీ కావడం, సోషల్‌మీడియా ప్రమోషన్, క్లయింట్లకు సమాధానాలు ఇవ్వడంలాంటివన్నీ ఉంటాయి అంటున్నారు మరో మహిళ లెక్సీ (ఆమె పేరు మార్చాం).
36 ఏళ్ల వయసున్న ఈ పోల్ డాన్సర్ లాక్‌డౌన్ కారణంగా తన ఉద్యోగం పోవడంతో ఓన్లీఫ్యాన్స్ అకౌంట్ ఓపెన్ చేశారు. ప్రతినెలా ఆమె 1,000 యూరోలు సంపాదిస్తారు. ఇవి ఆమె ఖర్చులకు సరిపోతాయి.
"మనం కమిషన్ పొందే సేల్స్ వర్కర్‌లా పని చేయాలి. అలా చేయకపోతే డబ్బులు రావు'' అన్నారామె. "ఇది రెండువైపులా పదునున్న కత్తిలాంటిది. పబ్లిక్‌లోకి రాలేని బెరుకుతనాన్ని ఇది పోగొడుతుంది. కానీ చాలామంది తక్కువ ఖర్చుతో ఎక్కువ చూడాలనుకుంటారు. ఇందుకు సిద్ధపడిన అనేకమంది ఇందులో చేరుతుంటారు. ఇప్పటికే మార్కెట్ ఓవర్ సాచ్యురేషన్‌కు వచ్చింది'' అన్నారు లెక్సీ.

ఫొటో సోర్స్, Megan Barton-Hanson
"మీరు సరదా కోసమైతే ఈ అకౌంట్‌ను తెరవకండి. ఎందుకంటే దాని మీద ఆధారపడి జీవించేవారికి అది ఇబ్బందిగా మారుతుంది'' అన్నారు లెక్సీ. "మీరు ఈ రంగంలోకి రావాలనుకుంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి. మీ పరిధులు మర్చిపోకండి. ఎందుకంటే ఒక్కసారి ఇందులో మీరు పోస్ట్ చేశారంటే ఇవి కలకాలం ఉంటాయి'' అని లెక్సీ హెచ్చరించారు.
ఈ రంగంలో కస్టమర్ల నుంచి వేధింపులకు గురయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. మార్క్, రెబెకా, లెక్సీలు ప్రైవసీ గురించి ఆందోళన వ్యక్తం చేశారు. మన గుర్తింపును దాచుకోవడం సాధ్యం కాదు. ఒక్కోసారి కంటెంట్ చోరీ కూడా జరుగుతుంది.
ఇందులో పోస్ట్ చేసిన వీడియోలను, ఫోటోలను ఎవరైనా కాపీ చేయవచ్చు. దీనివల్ల ఆదాయం కూడా తగ్గుతుంది. అవి ఇంటికి, ఆఫీసుకు కూడా చేరవచ్చు.
ఈ మధ్యకాలంలో లండన్‌లో ఓన్లీఫ్యాన్స్ వెబ్‌సైట్ యూజర్ కంటెంట్ లీకయినట్లు ప్రచారం జరిగింది. ఇది ఆ సోషల్ ప్లాట్‌ఫామ్ నిబంధనలను ఉల్లంఘించడమే.
ఇందులో తమ చిత్రాలను అమ్ముకునే వారి వయసు నిర్ధరణ ప్రక్రియలో చాలా లోపాలున్నట్లు బీబీసీ త్రీ పరిశోధనలో బయటపడింది. 18యేళ్ల లోపువారు కూడా అక్రమంగా తమ కంటెంట్‌ను సైట్‌కు అమ్ముకునే అవకాశం ఉంది.
ఈ ప్లాట్‌ఫామ్‌ను అక్రమంగా వినియోగించుకునే వారి గురించి తమకు సమాచారం ఇస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని, ఆ అకౌంట్‌ను రద్దు చేస్తామని వెబ్‌సైట్ నిర్వాహకులు చెబుతున్నారు.
ఖాతాదారుల్లో పెరుగుదల
ఇప్పుడు ఓన్లీఫ్యాన్స్ సైట్‌కు సైన్‌అప్ అవుతున్న వారి జాబితా పెరిగిపోతోంది. మార్చి నుంచి జులై మధ్యకాలంలో యూకేలో దీని యూజర్లు 42శాతం పెరిగారని, ప్రస్తుతం 95,000మంది సభ్యులున్నారని ఓన్లీఫ్యాన్స్ బీబీసీకి తెలిపింది.
ఇదే తరహాలో నడిచే అడ్మైర్‌మీ వెబ్‌సైట్ యూజర్లు కూడా లాక్‌డౌన్ కాలంలో సాధారణంకన్నా మూడింట ఒకవంతు అదనంగా పెరిగారు.
ఇందులో ఉన్న సమస్యలను ఎప్పటికప్పుడు కొత్త యూజర్లకు గుర్తు చేస్తూ ఉండాలని, అపరిచిత మెసెజ్‌లు వచ్చినప్పుడు వాటి నుంచి బైటపడటానికి సాయం చేయాలని, అవసరమైతే వారి ప్రొఫైల్‌ను పూర్తిగా రద్దు చేసుకునేందుకు ఈ సోషల్ వెబ్‌సైట్‌లు సహకరించాలని యూనివర్సిటీ ఆఫ్ లీసెష్టర్‌లో క్రిమినాలజీ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న టీలా శాండర్స్ అన్నారు. "ఇలాంటి కొత్త ప్లాట్‌ఫామ్‌లు వస్తున్న కొద్దీ ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి, అవగాహన కల్పించాలి'' అన్నారామె. ఇంగ్లాండ్‌లో ఇప్పుడున్న గడ్డుకాలంలో ఇలాంటి వాటిని అంగీకరించక తప్పదని, ఆన్‌లైన్ సెక్స్‌కు కూడా ప్రాధాన్యత పెరుగుతోందని, సామాజికంగా దీనికి ఆమోదం కూడా లభిస్తోందని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
"యూజర్ డేటాను జాగ్రత్తగా చూడటం మా విధి. ప్రైవసీకి భంగం కలిగించేవారితో మేం పోరాడతాం'' అని ఓన్లీఫ్యాన్స్ ప్రతినిధి ఒకరు చెప్పారు.
డేటాలీక్‌లు, కాపీరైట్ హక్కుల వ్యవహారాలను చూడటానికి కంపెనీ ఒక టీమ్‌ను కూడా ఏర్పాటు చేసింది. చోరీగురైన కంటెంట్‌లో 75శాతం వరకు సైట్ నుంచి తొలగించామని ఆ సంస్థ వెల్లడించింది. "మా కంటెంట్ సృష్టికర్తల భద్రత మా ప్రథమ కర్తవ్యం'' అని సంస్థ ప్రతినిధి వెల్లడించారు.
కొత్తగా ఇందులో చేరాలనుకునే వారి అర్హతల గురించి స్పష్టంగా పేర్కొన్నామని, దీన్ని ఎలా వినియోగించుకోవాలో బ్లాగుల్లో వివరిస్తున్నామని, దీనివల్ల కలిగే మంచి, చెడులను అందరూ గమనించాలని ఓన్లీఫ్యాన్స్ సంస్థ చెబుతోంది.
"ది ఆన్‌లైన్ హామ్స్ వైట్‌పేపర్'' సూచనల ప్రకారం ఈ వెబ్‌సైట్లకు సంబంధించిన చట్టపరమైన నిబంధనల అమలుకు ఒక స్వతంత్ర రెగ్యులేటరీ సంస్థను ఏర్పాటు చేసే ఆలోచనలో కూడా ఉన్నట్లు కూడా ఓన్లీఫ్యాన్స్ ప్రతినిధి వెల్లడించారు. "ప్రపంచ స్థాయి సంస్థ నిబంధనలు పాటించడం ద్వారా ఆన్‌లైన్‌లో ప్రమాదకరమైన కంటెంట్‌ను కట్టడి చేసి యూకేను ఆన్‌లైన్ సేఫ్ జోన్‌గా మార్చేందుకు అవకాశం ఉంది'' అని ఆ సంస్థ చెబుతోంది.
అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసిన "లార్డ్స్ డెమొక్రసీ అండ్ డిజిటల్ కమిటీ'' ఈ ఆన్‌లైన్ ప్రొటెక్షన్ బిల్లు వచ్చేసరికి 2023 లేదా 2024 వరకు పట్టవచ్చని ప్రకటించింది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








