#MeToo: భారత మీడియాలో వెలుగు చూస్తున్న లైంగిక వేధింపులు

మీ టూ

మహిళలు ఏదైనా ఆఫీసులో తమ పనితీరును నిరూపించుకోవడం చాలా సంక్లిష్టమైన విషయంగా మారింది. వృత్తిలోని సవాళ్లే కాకుండా, మహిళలు చాలాసార్లు పనిచేసే చోట లైంగిక వేధింపులు కూడా ఎదుర్కోవాల్సి వస్తోంది.

ఇందుకు మీడియా రంగం కూడా అతీతం కాదు. మీడియా ప్రపంచం బయటి నుంచి ఎంత మిరుమిట్లు గొలిపేలా కనిపిస్తుందో, లోపల లోతుల్లో తొంగి చూస్తే అంతే చీకటి కథలు కూడా కనిపిస్తాయి.

ఈరోజుల్లో చిన్నాపెద్ద మీడియా హౌస్‌లలో కూడా ఎవరో ఒక మహిళ పట్ల వేధింపులు జరిగిన విషయం గుసగుసగా చెప్పుకుంటుంటారు. కానీ, ఇలా ఇప్పుడే కొత్తగా ఏమీ జరగడం లేదు. ఇన్నాళ్ళూ చెవులు కొరుక్కున్న విషయాలనే ఇప్పుడు బాహాటంగా చెప్పడానికి ముందుకు వస్తున్నారు. స్వయంగా బాధిత మహిళలే తమపై జరిగిన వేధింపులను బహిర్గతం చేస్తున్నారు.

విలేఖరులుగా పనిచేసే చాలా మంది మహిళలు తమ పట్ల ఆఫీసుల్లో జరిగిన లైంగిక వేధింపుల గురించి సోషల్ మీడియాలో బహిరంగంగా పోస్ట్ చేయడం ప్రారంభించారు. వీరిలో దేశంలోని ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసినవారు, ఇప్పటికీ చేస్తున్నవారు చాలా మంది ఉన్నారు.

ఈ మహిళలు ఆరోపిస్తున్న పురుషులు కూడా మీడియా, జర్నలిజం ప్రపంచంలో ప్రముఖ వ్యక్తులే. దీనిని భారత్‌లో #MeToo ఉద్యమం ప్రారంభంగా చూస్తున్నారు.

మీ టూ

ఫొటో సోర్స్, AFP

చాట్ చేసిన స్క్రీన్ షాట్

కొన్ని రోజుల ముందు బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా, బాలీవుడ్ నటుడు నానా పటేకర్‌ సినిమా షూటింగ్‌ సమయంలో తనను వేధించారని ఆరోపించారు. ఆ తర్వాత ఇతర మహిళలు చాలా మంది కూడా వరసగా తమపట్ల జరిగిన లైంగిక వేధింపుల గురించి ప్రస్తావించడం ప్రారంభించారు.

మహిళలు తమ పట్ల ఆఫీసుల్లో జరిగిన లైంగిక వేధింపుల గురించి చెప్పడానికి ధైర్యంగా ముందుకు వస్తున్నారు. వారంతా సోషల్ మీడియా ద్వారా ఆ ఘటనలను ప్రస్తావిస్తున్నారు. తమను వేధించిన పురుషుల పేర్లను కూడా ప్రకటిస్తున్నారు.

మీడియాకు సంబంధించిన చాలా మంది మహిళలు ఈ విషయంలో ట్వీట్ చేశారు. తమ పట్ల జరిగిన లైంగికంగా వేధించిన పురుషుల చాట్ స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో షేర్ చేశారు.

నిజానికి ఇదంతా కమెడియన్ ఉత్సవ్ చక్రవర్తిపై ఒక మహిళ ఆరోపణలు చేయడంతో మొదలైంది.

ఉత్సవ్ తన న్యూడ్ ఫొటోలు పంపించమని తనను అడిగాడని, దానితోపాటు అతడి జననాంగాల ఫొటోలు తనకు పంపించాడని ఆ మహిళ గురువారం ఆరోపించారు.

మీ టూ

ఫొటో సోర్స్, TWITTER/@WOOTSAW

ఫొటో క్యాప్షన్, ఉత్సవ్ చక్రవర్తి

ఆ తర్వాత మరికొంత మంది మహిళలు కూడా తమకు జరిగిన అలాంటి అనుభవాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మొదలెట్టారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

మహిళా విలేఖరి సంధ్యా మీనన్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఉద్యోగి కె.ఆర్.శ్రీనివాసన్‌పై ఆరోపణలు చేస్తూ ఒక ట్వీట్ చేశారు. "ప్రస్తుతం టైమ్స్ ఆఫ్ ఇండియా, హైదరాబాద్‌లో రెసిడెంట్ ఎడిటర్ ఒకసారి నన్ను ఇంటి దగ్గర వదలనా అని అడిగారు. అది 2008లో ఒక పత్రిక ఎడిషన్ లాంచ్ కోసం నేను బెంగళూరు వెళ్లినప్పుడు జరిగింది. అప్పుడు ఆ సిటీ నాకు కొత్త" అని అందులో చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

దానికి సమాధానంగా కె.ఆర్.శ్రీనివాసన్ ఒక పోస్ట్ చేశారు. "టైమ్స్ ఆఫ్ ఇండియా లోని లైంగిక వేధింపుల విచారణ కమిటీ దీని గురించి విచారణ ప్రారంభించింది. ఒక సీనియర్ మహిళ నేతృత్వంలో ఒక బలమైన కమిటీ దీనిపై విచారణ చేస్తోంది. నేను ఈ విచారణకు పూర్తిగా సహకరిస్తున్నాను" అని అందులో తెలిపారు.

సంధ్యా మీనన్ ట్వీట్‌కు స్పందించిన కొందరు యువతులు ట్విటర్‌లో తమకు తెలిసిన వారు కూడా ఇలాంటి అనుభవాలు ఎదుర్కున్నారని చెబుతున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

గీతాంజలి అనే ఒక యువతి తన ట్విటర్‌లో "ఒక పత్రికలో కొంతమంది సీనియర్ బాసులు మహిళా ఉద్యోగులతో అతి చనువు చూపేవారని తాను విన్నట్లు" తెలిపారు. దురదృష్టవశాత్తూ వారి ఫిర్యాదులను ఎవరూ పట్టించుకోలేదన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

సంధ్య మీనన్ తనకు జరిగింది షేర్ చేసుకున్నందుకు రంజితజ్యూర్కర్ ట్విటర్‌లో థాంక్స్ చెప్పారు. తన స్నేహితులు కొందరు అతని ప్రవర్తన గురించి చెప్పారని తెలిపారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 5
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 5

ఐటీ రంగంలో కూడా ఇలాంటి మానసిక ఉన్మాదులు చాలా మంది ఉన్నారని గోమతి అనే మరో ట్విటర్ హాండిల్ పోస్ట్ చేశారు. మీరు పెట్టింది చదువుతుంటే, బాధగా ఉందన్నారు.

ప్రముఖులపై ఆరోపణలు

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 6
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 6

సుప్రీంకోర్టు న్యాయవాది ఇందిరా జయసింగ్ మహిళలు ఇలా ధైర్యంగా ముందుకు రావడాన్ని ప్రశంసించారు. "తమ పట్ల జరిగిన లైంగిక వేధింపుల గురించి చెప్పడానికి ధైర్యంగా ముందుకు వచ్చిన ఈ మహిళలకు నేను సెల్యూట్ చేస్తున్నా. న్యాయవ్యవస్థలో కూడా ఇలాంటి వాటిపై పోరాటం చేస్తున్న చాలా మంది మహిళలు ఉన్నారు. మీ అందరికీ నా పూర్తి మద్దతు ఉంటుంది" అని పోస్ట్ చేశారు.

అదే విధంగా కొంత కాలం ముందు హఫింగ్టన్ పోస్ట్‌లో పనిచేసే అనురాగ్ వర్మపై అభ్యంతరకర సందేశాలు పంపిస్తున్నారని చాలా మంది మహిళలు ఆరోపణలు చేశారు. స్నాప్‌చాట్‌లో ఆయన అలాంటి సందేశాలు పంపించేవారని చెప్పారు.

దానిపై వివరణ ఇచ్చిన అనురాగ్ క్షమాపణలు కోరుతూ ట్వీట్ చేశారు. తను ఆ సందేశాలు సరదాగా పంపించినట్టు చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 7
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 7

అనురాగ్ తన సందేశాల వల్ల వారి మనోభావాలు గాయపడతాయని అనుకోలేదని పోస్టులో తెలిపారు. న్యూడ్ ఫొటోలు పంపించమని కూడా కొంతమంది మహిళలకు తను సందేశాలు పంపినట్లు ఆయన అంగీకరించారు.

దీనికి సంబంధించి హఫింగ్టన్ పోస్ట్ కూడా ఒక ప్రకటన జారీ చేసింది. ఇందులో తమ మాజీ ఉద్యోగులు అనురాగ్ వర్మ, ఉత్సవ్ చక్రవర్తిపై చాలా మంది మహిళలు లైంగిక వేధింపుల ఆరోపణలు చేసినట్లు తెలిపింది.

వెబ్‌సైట్‌లో - మేం ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. చక్రవర్తి మూడేళ్ల ముందే హఫింగ్టన్ పోస్ట్ వదిలేశారు. అనురాగ్ వర్మ 2017 అక్టోబర్‌లో హఫింగ్టన్ పోస్ట్ వీడి వెళ్లారు. ఇద్దరూ మా దగ్గర పనిచేసినంత వరకూ వీరిపై ఆరోపణల గురించి మాకు తెలీదు. ఇక్కడ పనిచేస్తున్నప్పుడు కూడా వారిపై ఇలాంటి ఆరోపణలు వచ్చాయేమో వివరాలు సేకరిస్తున్నాం.

నిర్భయ, ఫర్హా

ఫొటో సోర్స్, Getty Images

ఈ #MeToo అంటే ఏంటి?

#MeToo అనేది నిజానికి లైంగిక వేధింపుల వ్యతిరేకంగా జరుగుతున్న ఒక భారీ ఆన్‌లైన్ ఉద్యమం. సోషల్ మీడియాలో ఈ హాష్‌టాగ్‌తో లైంగిక వేధింపులకు(ముఖ్యంగా కార్యాలయాల్లో) గురైన బాధితులు తమకు జరిగిన వాటిగురించి వెల్లడిస్తున్నారు.

ఈ ఉద్యమం మహిళలకు ధైర్యం నూరిపోస్తోంది. తమ పట్ల జరిగిన లైంగిక వేధింపుల గురించి, హింసించిన వారికి వ్యతిరేకంగా గొంతు వినిపించడానికి బాధితుల్లో స్ఫూర్తి నింపుతుంది.

గత ఏడాది హాలీవుడ్ నిర్మాత హార్వే వైన్‌స్టీన్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత ప్రపంచమంతా ఈ ఉద్యమం ఊపందుకుంది. ఇప్పటివరకూ సామాన్యుల నుంచి ఎంతోమంది ప్రముఖుల వరకూ ఇందులో భాగం అయ్యారు.

వీడియో క్యాప్షన్, బాలీవుడ్‌లో లైంగికవేధింపులపై పోరాటం

దీని ప్రారంభం ఎక్కడ

2017 అక్టోబర్‌లో సోషల్ మీడియాలో #MeToo హ్యాష్‌ట్యాగ్‌తో బాధితులు తాము పనిచేసే చోట జరిగిన లైంగిక వేధింపుల గురించి సోషల్ మీడియాలో షేర్ చేయడం ప్రారంభించారు.

ది గార్డియన్ ప్రకారం టెరానా బర్క్ అనే ఒక అమెరికా సామాజిక కార్యకర్త చాలా ఏళ్ల క్రితమే 2006లో 'మీ టూ' అనే పదాన్ని ఉపయోగించడం ప్రారంభించారు.

కానీ, 2017లో అమెరికా నటి అలిసా మిలానో తన ట్వీట్‌లో దీన్ని ఉపయోగించడంతో ఈ పదం పాపులర్ అయ్యింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 8
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 8

మిలానో లైంగిక వేధింపులకు గురైన వారిని తమకు జరిగిన వాటి గురించి ట్వీట్ చేయమని కోరారు. అప్పుడే అందరికీ ఇది ఎంత పెద్ద సమస్యో తెలుస్తుందని అన్నారు.

ఆమె ప్రయత్నం ఫలించింది. #MeToo హ్యాష్‌ట్యాగ్ ఉపయోగిస్తూ చాలా మంది తమకు జరిగిన వేధింపులను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

అప్పటి నుంచి హ్యాష్‌ట్యాగ్ రూపంలో #MeTooను ప్రపంచమంతా విస్తృతంగా ఉపయోగించారు. అయితే, కొన్ని ప్రాంతాల్లో బాధితులు ఇలాంటి వాటి గురించి చెప్పడానికి వేరే రకాల హ్యాష్‌ట్యాగ్ కూడా ఉపయోగించారు. కానీ అవి అక్కడివరకే పరిమితం అయ్యాయి.

ఉదాహరణకు, ఫ్రాన్స్ ప్రజలు #balancetonporc పేరుతో ఒక ఉద్యమం ప్రారంభించారు. అలాగే మరికొంత మంది #Womenwhoroar పేరుతో హ్యాష్‌ట్యాగ్ ఉపయోగించారు. కానీ అవి అంత పాపులర్ కాలేదు.

కానీ #MeToo కేవలం సోషల్ మీడియాలో మాత్రమే కాదు, ఇది ఇప్పుడు వర్చువల్ ప్రపంచం బయటకు కూడా వ్యాపించింది. లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ఒక ప్రజాదరణ పొందిన ఉద్యమంగా మారింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)