ఇరాన్ నౌకాదళ ‘స్నేహపూర్వక కాల్పుల్లో’ 19 మంది నావికుల మృతి

ఫొటో సోర్స్, AFP
ఇరాన్ నౌకాదళానికి చెందిన రెండు నౌకల మధ్య ‘స్నేహపూర్వక కాల్పుల్లో’ 19 మంది నావికులు చనిపోయారని, మరో 15 మంది గాయపడ్డారని నౌకాదళం తెలిపింది.
ఆదివారం గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో జమారాన్ నౌక నుంచి కొత్త నౌకావిధ్వంసక క్షిపణిని పరీక్షిస్తుండగా.. అది కొనరాక్ నౌకను తాకిందని ఇరాన్ ప్రభుత్వ మీడియా చెప్పింది.
హోర్ముజ్ జలసంధిలో శిక్షణా విన్యాసాలు చేస్తున్నపుడు ఈ ప్రమాదం జరిగింది.
ఈ వ్యూహాత్మక జలమార్గంలో ఇరాన్ సాయుధ బలగాలు తరచుగా విన్యాసాలు నిర్వహిస్తుంటాయి.
ఇరాన్ దక్షిణ తీరంలో ‘‘బందారే జాస్క్ జలాల్లో సైనిక విన్యాసాల సందర్భంగా నిన్న మధ్యాహ్నం కోనరాక్ నౌకను ఒక క్షిపణి ఢీకొట్టింది’’ అని ప్రభుత్వ టీవీ వెబ్‌సైట్‌లో వివరించింది.
‘‘ప్రయోగం కోసం టార్గెట్‌ను తీసుకెళ్లిన ఆ నౌక.. ఆ టార్గెట్ నుంచి తగినంత దూరం రాకపోవటంతో క్షిపణి ఆ నౌకను తాకింది’’ అని పేర్కొంది.
టెహ్రాన్‌కు సుమారు 1,270 కిలోమీటర్ల దూరంలో గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో గల జాస్క్ రేవు సమీపంలో ఈ ఘటన జరిగినట్లు చెప్పింది.
జమరాన్, కొనరాక్ నౌకలు.. ఇరాన్ నౌకా దళానికి చెందినవని చెప్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇవి కూడా చదవండి:
- మే 12 నుంచి రైలు ప్రయాణాలు.. వెల్లడించిన పీయూష్ గోయల్
- కరోనావైరస్ సాకుతో కార్మికుల హక్కులపై వేటు.. మూడేళ్ల వరకూ కొన్ని చట్టాలు రద్దు
- పోర్న్ సైట్లకు క్రెడిట్ కార్డులతో చెల్లింపులు ఆపండి: స్వచ్ఛంద సంస్థల విజ్ఞప్తి
- "మా సిబ్బందికి కరోనావైరస్ వస్తుందో లేదో తెలియదు, కానీ వాళ్లు ఆకలితో చనిపోయేలా ఉన్నారు"
- 1918లో 5 కోట్ల మందిని బలి తీసుకున్న స్పానిష్ ఫ్లూ కట్టడికి ఏం చేశారంటే...
- కరోనావైరస్లో వందల సంఖ్యలో కొత్త మ్యుటేషన్లు: పరిశోధనలో ఉన్న వ్యాక్సీన్లు పనికి రాకుండా పోతాయా?
- లిపులేఖ్ రోడ్డు విషయంలో భారత్ తీరుపై నేపాల్‌లో ఆగ్రహం ఎందుకు
- కాలాపానీ: నేపాల్ సరిహద్దులోని 35 చ.కి.మీ భూమి సమస్యను వాజ్‌పేయి నుంచి మోదీ వరకు ఎవ్వరూ ఎందుకు పరిష్కరించలేదు?
- అమెరికా - ఇరాన్ ఘర్షణ: హోర్ముజ్ జలసంధిలో సంక్షోభం మీ మీద, ప్రపంచం మీద చూపే ప్రభావం ఏమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








