హాంగ్ కాంగ్ నిరసనలు: చైనా కమ్యూనిస్టు పార్టీ 70వ వార్షికోత్సవం.. ‘హాంగ్ కాంగ్‌లో అత్యంత హింసాత్మక, కల్లోల దినం’

చైనాలో కమ్యూనిస్టు పార్టీ పరిపాలన 70వ వార్షికోత్సవం.. ‘‘హాంగ్ కాంగ్‌లో అత్యంత హింసాత్మక, కల్లోల దినం’’గా మారిందని నగర పోలీస్ చీఫ్ స్టీఫెన్ లో పేర్కొన్నారు.
హాంగ్ కాంగ్ నిరసనకారుల మీద పోలీసులు జరిపిన ఆరు రౌండ్ల కాల్పుల్లో ఒక తూటా ఒక నిరసనకారుడి ఛాతీలో దిగింది.
నగరంలోని పలు ప్రాంతాల్లో.. పెట్రోల్ బాంబుల వంటి ఆయుధాలు ధరించిన ఆందోళనకారులకు - పోలీసులకు మధ్య ఘర్షణలు చెలరేగాయి.
ఈ హింసలో 15 మంది గాయాలతో ఆస్పత్రుల పాలయ్యారు. మరో 180 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 25 మంది పోలీసు అధికారులు కూడా గాయపడ్డారని స్టీఫెన్ లో చెప్పారు.

ఫొటో సోర్స్, EPA
చైనాలో కమ్యూనిస్టు పార్టీ పాలన వార్షికోత్సవం సందర్భంగా ప్రతి ఏటా హాంగ్ కాంగ్‌లో నిరసనలు ఎగసిపడుతుంటాయి.
అయితే.. ఈ ఏడాది నాలుగు నెలల ముందు నుంచే హాంగ్ కాంగ్ ప్రజల నిరసనలతో అట్టుడుకుతోంది. ఇప్పుడు చైనా కమ్యూనిస్టు పార్టీ పాలన వార్షికోత్సవం నాటికి నగరంలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి.
హాంగ్ కాంగ్‌లోని నిందితులను చైనాకు అప్పగించటానికి ఉద్దేశించిన బిల్లు.. ఈ భారీ నిరసనలను రాజేసింది. ఉధృత ఆందోళనలతో ప్రభుత్వం.. చైనాకు నిందితుల అప్పగింత ప్రతిపాదనలను పక్కనపెట్టింది. అయినా ఆందోళనలు సద్దుమణగలేదు.

ఫొటో సోర్స్, Getty Images
మరింత ప్రజాస్వామ్యం కావాలనే డిమాండ్‌తో నిరసనలు కొనసాగాయి.
ఈ నిరసనల్లో పోలీసులతో తలెత్తిన ఘర్షణలో ఒక కర్రతో ఒక పోలీసు అధికారి మీద దాడి చేయబోతున్న త్సాంగ్ చి-కిన్ అనే ఆందోళనకారుడి మీద సదరు పోలీసు అధికారి తుపాకీతో కాల్పులు జరుపుతున్న వీడియో మీడియాకు దొరికింది. ఆ వీడియోను ఆన్‌లైన్‌లో విస్తృతంగా షేర్ చేశారు.
త్సాంగ్ చి-కిన్ వయసు 18 సంవత్సరాలు. ‘‘నా ఛాతీలో చాలా నొప్పిగా ఉంది. నన్ను ఆస్పత్రికి తీసుకెళ్లండి’’ అని చెప్పాడతడు.
అతడి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని ప్రభుత్వం పేర్కొంది.

హాంగ్ కాంగ్‌లో ఇంతకుముందు నిరసనల్లో ఆందోళనకారుల మీద పోలీసులు రబ్బరు బులెట్లతో కాల్పులు జరిపారు. అయితే.. నిజమైన బులెట్ల కాల్పుల్లో ఒక నిరసనకారుడు గాయపడటం ఇదే ప్రథమం.
కాల్పులు జరిపిన పోలీసు అధికారి తన ప్రాణం, తన సహచరుల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని భావించటం వల్ల తుపాకీతో కాల్పులు జరిపాడంటూ.. ‘‘ఇది పూర్తిగా చట్టబద్ధం.. సహేతుకం’’ అని పోలీస్ చీఫ్ స్టీఫెన్ లో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
- 17 ఏళ్లుగా దొరకని నేరస్తుడిని డ్రోన్ల సాయంతో పట్టుకున్న పోలీసులు
- కశ్మీర్, గో రక్షణ, మూకదాడులు, మతాంతర వివాహాలపై గాంధీ అభిప్రాయాలేంటి?
- బోటు వెలికితీతలో ఆటంకాలు.. తెగిన ఇనుప తాడు, వంగిన లంగరు
- ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎవరు.. ఆయన చరిత్ర ఏంటి?
- ఇక చరిత్రను తిరగరాయాల్సిందేనా?
- చమురు వరమా, శాపమా?.. ప్రపంచాన్ని అది ఎలా మార్చింది
- వృద్ధురాలి వంటగదిలో దొరికిన రూ.46 కోట్ల విలువైన కళాఖండం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









