చైనా: 17 ఏళ్లుగా దొరకని నేరస్తుడిని డ్రోన్ల సాయంతో పట్టుకున్న పోలీసులు

ఫొటో సోర్స్, THE YONGSHAN POLICE/CHINANEWS
17 ఏళ్లుగా తప్పించుకుని, ఓ గుహలో దాక్కున్న ఓ వ్యక్తిని డ్రోన్ల సాయంతో కనిపెట్టి అరెస్టు చేశారు చైనా పోలీసులు.
సాంగ్ జియాంగ్ అనే 63 ఏళ్ల వయసున్న వ్యక్తి మహిళలు, పిల్లల అక్రమ రవాణా కేసులో అరెస్టై జైలుకు వెళ్లాడు. కానీ 2002లో అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు.
అప్పటి నుంచి మనుషుల కంటబడని ఓ ఇరుకైన గుహలో తలదాచుకున్నాడు.
సాంగ్ కదలికలు, అతని గుహకు సంబంధించిన వివరాలు తమకు సెప్టెంబర్ మొదట్లో తెలిశాయని యోంగ్‌షాన్ పోలీసులకు వెల్లడించారు.
సాంగ్ సొంత ఊరు యునాన్ ప్రావిన్స్‌ను ఆనుకుని ఉన్న పర్వతాల్లో అతడు తలదాచుకున్నాడని తెలుసుకున్న పోలీసులు అతడిని పట్టుకునేందుకు ప్రణాళికలు రచించారు.

ఫొటో సోర్స్, THE YONGSHAN POLICE/CHINANEWS
కానీ, అనేకసార్లు పోలీసులు ఆ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో వారు డ్రోన్ల సాయం తీసుకున్నారు.
నీలం రంగు టైల్ ఒకటి అడ్డంగా పెట్టి ఉన్న ఓ ప్రదేశాన్ని, దానికి సమీపంలోనే కొంత చెత్త ఉండడాన్ని డ్రోన్లు గుర్తించాయి.
దీంతో పోలీసులు కాలినడకన ఆ గుహ ఉన్న ప్రాంతానికి చేరుకుని 17 ఏళ్ల క్రితం పారిపోయిన సాంగ్‌ను అరెస్టు చేశారు.

ఫొటో సోర్స్, THE YONGSHAN POLICE/CHINANEWS
"సంవత్సరాల పాటు మనుషులకు దూరంగా గడపడం వల్ల ఇప్పుడు అతడికి మనతో సంభాషించడం కూడా కష్టం కావచ్చు" అని పోలీసులు తెలిపారు.
సమీపంలోని నది నుంచి నీటిని తెచ్చుకునేందుకు ప్లాస్టిక్ బాటిళ్లను అతడు ఉపయోగించాడని, చెట్ల కొమ్మలు ఉపయోగించి నిప్పురాజేసేవాడని చైనా మీడియా తెలిపింది.
ఇప్పుడు అతడిని తిరిగి జైలుకు పంపించారు.
ఇవి కూడా చదవండి.
- 30 ఏళ్ల కిందట సౌదీ కోట నుంచి దొంగిలించిన ఆభరణాలు ఏమయ్యాయి, ఆ దొంగ ఏమంటున్నాడు
- ఉత్తర భారతాన్ని కుదిపేస్తున్న భారీ వరదలు, 100మందికి పైగా మృతి
- కశ్మీర్, గో రక్షణ, మూకదాడులు, మతాంతర వివాహాలపై గాంధీ అభిప్రాయాలేంటి?
- మహాత్మా గాంధీ గురించి పాకిస్తానీలు ఏమనుకుంటుంటారు?
- మారణహోమంలో దూరమైన కుటుంబాలను కలిపిన రేడియో కార్యక్రమం
- మహాత్మా గాంధీ గురించి పాకిస్తానీలు ఏమనుకుంటుంటారు?
- ది జోకర్: నవ్వించాల్సినవాడు ఇంత విలన్ ఎందుకయ్యాడు
- ఒరాంగుటాన్ శాండ్రా: ఇది జంతువు కాదు, మానవ హక్కులున్న మనలాంటి మనిషే'
- గూగుల్ 21వ పుట్టిన రోజు... 21 ఆసక్తికరమైన విషయాలు
- 20 ఏళ్లుగా 200 విష సర్పాలతో కాటేయించుకుంటున్నాడు.. ఎందుకో తెలుసా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








