పాకిస్తాన్‌: ఇసుకలో ముగ్గురు పిల్లల మృతదేహాలు.. హత్యకు ముందు ఒకరిపై అత్యాచారం

పాకిస్తాన్

పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్సులో ఉన్న కసూర్ జిల్లాలో ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. ఆ జిల్లాలో తాజాగా ముగ్గురు బాలుర మృతదేహాలు లభ్యమయ్యాయి.

వారిలో ఒకరిపై అత్యాచారం కూడా జరిగినట్లు పోలీసులు ధ్రువీకరించారు. మిగతా ఇద్దరి పోస్ట్‌మార్టం నివేదికలు ఇంకా రావాల్సి ఉంది.

కసూర్‌లో గత కొన్నేళ్లలో చిన్నారుల అపహరణలు, అత్యాచారాలు, హత్యలు బాగా పెరిగాయి.

2018లో జైనాబ్ అనే ఆరేళ్ల బాలిక అదృశ్యమైన ఘటనపై పాకిస్తాన్‌లో పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ జనాలు రోడ్ల మీదకు వచ్చారు. ఈ ఆందోళనల్లో చోటుచేసుకున్న హింసలో ఇద్దరు వ్యక్తులు మరణించారు.

ఈ పరిణామాల తర్వాత జైనాబ్‌పై అత్యాచారం చేసి, హత్య చేసిన 24 ఏళ్ల ఇమ్రాన్ అలీని పోలీసులు పట్టుకున్నారు. అతడు మరో ఆరుగురు బాలికలపైనా ఇలాంటి నేరాలకే ఒడిగట్టినట్లు తేలింది.

ఆ వ్యక్తికి అదే ఏడాది అక్టోబర్‌లో మరణశిక్ష అమలు చేశారు.

పోస్ట్‌ Instagram స్కిప్ చేయండి
Instagram ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of Instagram ముగిసింది

తాజాగా చున్నియన్ ప్రాంతంలో బుధవారం ప్రజలు ఆందోళనలు చేపట్టారు. స్థానిక పోలీస్ స్టేషన్‌ను చట్టుముట్టి రాళ్లు రువ్వారు.

మంగళవారం ఓ పారిశ్రామిక ప్రాంతంలో ఇసుకలో ముగ్గురు బాలుర మృతదేహాలు లభ్యమయ్యాయి. ఆ చిన్నారులందరి వయసు పదేళ్లలోపే ఉంటుందని పాక్ మీడియా పేర్కొంటోంది.

దీనికి సంబంధించి పలువురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఇప్పుడు లభ్యమైన మృతదేహాల్లో ఎనిమిదేళ్ల ఫైజాన్ కూడా ఉన్నట్లు సీనియర్ పోలీస్ అధికారి ఇనామ్ ఘని బీబీసీతో చెప్పారు.

సోమవారం అతడు కనిపించకుండా పోయాడని, అతడిపై అత్యాచారం జరిగినట్లు పోస్ట్‌మార్టం నివేదికలో వెల్లడైందని అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

మరో ఇద్దరు బాలురు ఆగస్టులో అదృశ్యమైనవారు అయ్యుండొచ్చని అధికారులు భావిస్తున్నారు. అదృశ్యమైన సమయంలో వారు ధరించిన దుస్తులతో ఈ మృతదేహాలతోపాటు దొరికిన గుడ్డ పీలికలు సరిపోలుతున్నట్లు వారు చెప్పారు.

''డీఎన్‌ఏ పరీక్షల కోసం శాంపిల్స్ సేకరించాం. జూన్‌లో గల్లంతైన ఓ బాలుడి గురించి గాలింపు కొనసాగుతోంది. వాళ్ల వివరాలు, మృతికి కారణాలు ఇంకా పూర్తిగా వెల్లడి కాలేదు'' అని ఘని చెప్పారు.

మహమ్మద్ అఫ్జల్ అనే కార్మికుడి కుమారుడు అలీ హుస్సేన్ గత ఆగస్టులో అదృశ్యమయ్యాడు.

అప్పటి నుంచి తాము ఇంట్లో సరిగ్గా పొయ్యి వెలిగించింది కూడా లేదని అఫ్జల్ బీబీసీతో చెప్పారు.

గత ఆగస్టులో ఆడుకునేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లిన సులేమాన్ అక్రమ్, తిరిగి ఇంటికి రాలేదని అతడి మామయ్య మహమ్మద్ అష్రఫ్ చెప్పారు. గాలింపు విషయంలో పోలీసులు సహకరించట్లేదని ఆయన అన్నారు.

జైనాబ్

ఫొటో సోర్స్, Twitter

ఫొటో క్యాప్షన్, జైనాబ్

కొన్ని వారాలుగా కసూర్‌లోని ప్రజలు భయాందోళనతో ఉన్నారని, తమ చిన్నారులను ఇళ్ల నుంచి బయటకు వెళ్లనివ్వడం లేదని బీబీసీ ఉర్దూ తెలిపింది.

చిన్నారుల అపహరణల విషయాన్ని పాకిస్తాన్‌లోని ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి.

జైనాబ్ హత్య తర్వాత పోలీసుల శిక్షణ, చట్టాలు పకడ్బందీగా ఉండేలా చర్యలు చేపడతామని పాకిస్తాన్ పేర్కొంది.

అయితే, హంతకుడు జైనాబ్‌ను తీసుకువెళ్తున్న వీడియో ఫుటేజీ ఆమె కుటుంబ సభ్యులు సంపాదించి, కోర్టుకు సమర్పించాకే అతడికి శిక్ష పడింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)