#HowdyModi: అమెరికాలో మోదీ కార్యక్రమానికి రానున్న ట్రంప్

ఫొటో సోర్స్, Reuters
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ అమెరికాలోని టెక్సాస్‌లో సెప్టెంబర్ 22న జరిగే ఒక ప్రత్యేక కార్యక్రమంలో కలుసుకోబోతున్నారు.
అమెరికా అధ్యక్షుడి కార్యాలయం వైట్‌హౌస్ ఆదివారం దీని గురించి సమాచారం ఇచ్చింది.
ఈ కార్యక్రమానికి 'హౌడీ, మోడీ' అనే పేరు పెట్టారు. అమెరికాలో స్నేహపూర్వక పలకరింపుగా ఉపయోగించే 'హౌడీ' అనే మాట చాలా పాపులర్.
"రెండు దేశాల ప్రజల మధ్య దృఢమైన సంబంధాలను చూపేందుకు, ప్రపంచంలో అత్యంత పురాతనమైన రెండు అతిపెద్ద ప్రజాస్వామిక దేశాల మధ్య వ్యూహాత్మక సహకారాన్ని మరింత ధృఢంగా చేసేందుకు, శక్తి, వాణిజ్య బంధాలను బలోపేతం చేసే మార్గాలను పరిశీలించడానికి ఇది ఒక అవకాశం అవుతుంది" అని వైట్‌హౌస్ చెప్పింది.
హూస్టన్‌లోని ఎన్ఆర్టీ స్టేడియంలో జరిగే ఈ కార్యక్రమానికి అమెరికాలోని 50 వేల మంది భారతీయులు హాజరవుతారని చెబుతున్నారు. అమెరికాలో ఒక విదేశీ నేత కార్యక్రమానికి ఈ స్థాయిలో జనం హాజరు కావడం ఇదే మొదటిసారి అని నిర్వాహకులు చెబుతున్నారు.
అమెరికాలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోతున్నాయి. ట్రంప్ కూడా అమెరికాలోని భారతీయులను ఊరించే ప్రయత్నం చేస్తారు.
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా "అమెరికా అధ్యక్షుడి ఈ ప్రత్యేక వైఖరి అమెరికా, భారత్ మధ్య ప్రత్యేక స్నేహబంధానికి ప్రతీకగా నిలుస్తుంది" అని ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
"ఈ కార్యక్రమానికి ట్రంప్ వస్తుండడం నాకు చాలా సంతోషం కలిగించింది. అమెరికాలో స్థిరపడ్డ భారతీయులతో కలిసి ఆయనకు స్వాగతం పలుకుతానని ఆశిస్తున్నా" అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
"ట్రంప్ తీసుకున్న ఈ ప్రత్యేక నిర్ణయం అమెరికా సమాజంలో, ఆ దేశ ఆర్థిక వ్యవస్థలో భారత సమాజం భాగస్వామ్యాన్ని, ఇరువురి మధ్య బలమైన బంధానికి ఇది తార్కాణంగా నిలుస్తుంది" అని అన్నారు.
సోమవారం ఉదయం నుంచీ ట్విటర్‌లో #HowdyModi, #Houston ట్రెండ్ మొదలైంది. మేలో మళ్లీ ప్రధానమంత్రిగా ఎన్నికైన తర్వాత నరేంద్ర మోదీకి అమెరికాలో ఇది మొదటి కార్యక్రమం.
ఇంతకు ముందు ఆయన 2014లో న్యూయార్క్ మాడిసన్ స్క్వేర్‌లో రెండు కార్యక్రమాలకు హాజరయ్యారు. 2016లో సిలికాన్ వాలీలో ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఫొటో సోర్స్, Reuters
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, నరేంద్ర మోదీ మధ్య ఈ ఏడాదిలో ఇది మూడో కలయిక కాబోతోంది. ఇద్దరు దేశాధినేతలు గత నెల ఫ్రాన్స్‌లో జరిగిన జీ-7 సదస్సు సమయంలో సమావేశం అయ్యారు.
అమెరికా మొదటి హిందూ ఎంపీ తులసీ గబార్డ్, ఎంపీ రాజా కృష్ణమూర్తి సహా గవర్నర్లకు సంబంధించిన ఒక ప్రతినిధి మండలి, అమెరికా కాంగ్రెస్ సభ్యులు, మేయర్, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని చెబుతున్నారు.
కొన్ని భారత మీడియా సంస్థల వివరాల ప్రకారం ఈ సమయంలో ఏదైనా ఒక పెద్ద వ్యాపార ఒప్పందం గురించి ప్రకటన కూడా చేయవచ్చని, ట్రేడ్ టారిఫ్ పెరగడం వల్ల కొన్ని నెలలుగా ఉన్న అసంతృప్తికి అది తెరదించుతుందని చెబుతున్నారు.
అమెరికాలోని గ్యాస్ ఉత్పత్తిదారుల కళ్లన్నీ ఈ కార్యక్రమంపైనే ఉన్నాయని బ్లూంబర్గ్‌లో వచ్చిన ఒక వ్యాసంలో పేర్కొన్నారు. అమెరికా నుంచి భారత్ మరింత గ్యాస్ కొనుగోలు చేయడానికి అంగీకరించవచ్చని అంచనా వేస్తున్నారని తెలిపారు. భారత్ ఇప్పటికే అమెరికా నుంచి లిక్విడ్ నేచురల్ గ్యాస్ కొనుగోలు చేసే ఆరో అతిపెద్ద దేశంగా ఉందని బ్లూంబర్గ్ చెప్పింది.
ఇవి కూడా చదవండి.
- మోదీని యూఏఈ సన్మానిస్తుంటే పాకిస్తాన్‌కు అభ్యంతరం దేనికి
- ట్రంప్ చేతులు కట్టుకున్న ఈ ఫొటో చెబుతున్న కథేంటంటే..
- భారత్-పాక్ వాణిజ్య సంబంధాలు: తెంచుకుంటే ఎవరికెంత నష్టం?
- కోడెల శివప్రసాద్ 'ఆత్మహత్య'.. ‘బసవతారకం ఆస్పత్రిని స్థాపించారు.. అక్కడే చనిపోయారు’
- బోటు ప్రమాదంలో 12 మంది మృతి.. రాజమండ్రిలో సీఎం జగన్ సమీక్ష.. కొనసాగుతున్న గాలింపు చర్యలు
- ‘ఉద్యోగాల లోటు లేదు, ఉత్తర భారతీయుల్లో వాటికి అర్హులు లేరు’ - కేంద్ర మంత్రి సంతోష్ గంగ్వార్
- కమలీ: ఆస్కార్ 2020 బరిలో నిలిచిన ఈ అమ్మాయి జీవిత కథేంటంటే..
- 11 తరాలుగా ఈ ఆలయంలో అర్చకులంతా దళితులే.. వివక్షను పారదోలిన ఉప్పులూరు చెన్నకేశవ ఆలయం ప్రత్యేకతలివీ
- 9/11 పుట్టిన తేదీ, 9.11 గంటలు పుట్టిన సమయం, పాప బరువు 9.11 పౌండ్లు.. ఏమిటీ చిత్రం?
- జీ7 సదస్సు: అసలు జీ7 బృందం ఏమిటి? అది ఏం చేస్తుంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








