‘ఉత్తర భారతీయుల్లో అర్హులు లేరు.. ఉద్యోగాల లోటు లేదు’ - కేంద్ర మంత్రి సంతోష్ గంగ్వార్ ప్రకటనపై విమర్శలు

ఫొటో సోర్స్, Getty Images
కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖల సహాయ (స్వతంత్ర హోదా) మంత్రి సంతోష్ గంగ్వార్ చేసిన ఒక ప్రకటనపై సోషల్ మీడియాలో విమర్శలు మొదలయ్యాయి.
మంత్రి సంతోష్ గంగ్వార్ తన పార్లమెంట్ స్థానం బరేలీలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ "దేశంలో ఉపాధికి లోటు లేదు. మన ఉత్తర భారతంలో రిక్రూట్‌మెంట్ చేసుకోడానికి వస్తున్నారు. అయితే, ఏ ఉద్యోగాల కోసం వాటిని పెడుతున్నారో ఆ అర్హత ఉన్న వ్యక్తులు మనకు తక్కువ దొరుకుతున్నారు" అన్నారు.
గంగ్వార్ మీడియా సమావేశంలో "ఈ మధ్య పత్రికల్లో ఉద్యోగాల గురించి చెబుతున్నారు. మేం ఆ శాఖను చూసే పనే చేస్తున్నాం. రోజూ దానిని పరిశీలిస్తుంటాం. దేశవ్యాప్తంగా ఉపాధిలో లోటు లేదు, ఉద్యోగాలు చాలా ఉన్నాయి" అన్నారు
గాంగ్వార్ చేసిన ఈ ప్రకటన.. 2019లో సరిగ్గా సార్వత్రిక ఎన్నికలకు ముందు లీక్ అయిన నేషనల్ శాంపిల్ సర్వేకు వ్యతిరేకంగా ఉంది. దాని ప్రకారం దేశవ్యాప్తంగా నిరుద్యోగం రేటు గత 45 ఏళ్లలో అత్యంత దిగువ స్థాయికి చేరుకుంది. కానీ ప్రభుత్వం అప్పుడు లీకైన ఆ రిపోర్టును కొట్టిపారేసింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
లీక్ అయిన రిపోర్ట్ నిజం తర్వాత వెలుగులోకి వచ్చింది. రెండో సారి ప్రమాణ స్వీకారం చేసిన ఒక రోజు తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ప్రభుత్వ గణాంకాలు జారీ చేస్తూ గత నాలుగు దశాబ్దాల్లో నిరుద్యోగం రేటు అత్యంత నీచ స్థితికి చేరుకుందని చెప్పారు.
ఈ గణాంకాల తర్వాత దేశవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా ఉపాధిలో సంక్షోభం పెరుగుతోంది. ఆర్థికాభివృద్ధి రేటు తగ్గి ఐదు శాతానికి రావడంతో ఆటో సెక్టార్, టెక్స్‌టైల్ సెక్టార్, టీ పరిశ్రమ అన్నిటిలో వరుసగా ఉద్యోగులను తీసేస్తున్నట్టు వార్తలు వెలుగులోకి వస్తున్నాయి.
అలాంటి సమయంలో సంతోష్ గంగ్వార్ చేసిన ప్రకటనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
"మంత్రి గారూ, మీ ప్రభుత్వం ఐదేళ్లకు పైనే ఉంది. ఉద్యోగాలు ఏర్పడలేదు. ప్రభుత్వం వల్ల వచ్చిన ఆర్థిక మాంద్యంతో ఉన్న ఉద్యోగాలు కూడా ఊడిపోతున్నాయి" అన్నారు.
ఆమె తన ట్వీట్‌లో "మీరు ఉత్తర భారతీయులను అవమానిస్తూ, తప్పించుకోవాలని చూస్తున్నారు. అది కుదరదు" అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
శనివారం చేసిన ప్రకటనకు సంతోష్ గంగ్వార్ ఆదివారం వివరణ కూడా ఇచ్చారు. వార్తా సంస్థ ఏఎన్ఐ వివరాల ప్రకారం ఆయన తన వివరణలో "ఆ ప్రకటనను వేరే సందర్భంలో ఇచ్చాను. స్కిల్ తక్కువ ఉందని, ప్రభుత్వ స్కిల్ డెవలప్‌మెంట్ శాఖ ఉపాధి అవకాశాలకు తగ్గట్టు యువకులకు ట్రైనింగ్ ఇవ్వడం కూడా ప్రారంభించింది" అన్నారు.
కొన్ని రోజుల క్రితం ఫ్యాక్ట్ చెక్ చేసే ఫ్యాక్ట్ చెకర్ డాట్ ఇన్ వెబ్‌సైట్ కూడా ఒక విస్తృత రిపోర్ట్ విడుదల చేసింది. అందులో గత కొన్నిరోజులుగా ఉద్యోగాలు తగ్గిపోతూ వస్తున్నాయని చెప్పింది.
అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ సెంటర్ ఆఫ్ సస్టైనబుల్ ఎంప్లాయ్‌మెంట్ స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా-2019 వార్షిక నివేదికలో 2016 తర్వాత పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వరుసగా ఉద్యోగాలు తగ్గిపోతున్నట్లు చెప్పింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
సంతోష్ గంగ్వార్ ప్రకటన తర్వాత సోషల్ మీడియాలో చాలా మంది 2014లో మోదీ ప్రభుత్వం ప్రారంభించిన స్కిల్ ఇండియా కార్యక్రమం ఏమైందని అడిగారు.
దానితోపాటూ అన్నిరకాల స్పందనలూ వస్తున్నాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
అలోక్ వర్మ అనే యూజర్ "నేను మూడు నెలల్లో 400-500 ఫామ్స్ వేశాను. అన్ని పరీక్షలూ టైంకు జరిగాయి, ఒక్క పేపర్ కూడా లీక్ కాలేదు, ఎగ్జామ్ క్యాన్సిల్ కాలేదు, అన్ని ఫలితాలూ సమయానికి వచ్చాయి, 100-200 ఆఫర్లు వచ్చాయి, 40-50లో నేనొక్కడినే జాయిన్ అవుతా" అని పెట్టాడు.
ఇక, అమర్ చౌహాన్ అనే యూజర్ ప్రధాని చేసిన ఒక ప్రకటన నుంచీ ముగ్గురు మంత్రుల వ్యాఖ్యల వరకూ ఏమేం అన్నారో ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5
"ప్రధాని.. పర్యావరణం మారలేదు, మనమే మారాం, మన అలవాట్లు మారాయి అన్నారు. ఆర్థిక మంత్రి.. యువత ఆలోచనల వల్లే మాద్యం వచ్చిందన్నారు. రైల్వే మంత్రి.. గురుత్వాకర్షణ శక్తిని ఐన్‌స్టీన్ కనిపెట్టారని చెప్పారు. సంతోష్ గంగ్వార్.. అవకాశాలు కాదు, ఉత్తరాది అభ్యర్థులకు అర్హతలు లేవన్నారు. ప్రభుత్వం తన న్యూనతను దాచుకోడానికి ఇతరులను పనికిరానివారుగా చెబుతోంది" అన్నాడు.

ఫొటో సోర్స్, Getty Images
కేంద్ర ప్రభుత్వంలోని ఏదో ఒక మంత్రి చేసిన ప్రకటన చుట్టూ వివాదాలు ముసురుకోవడం గత వారంలో ఇది మూడోసారి.
గురువారం కేంద్ర రైల్వే, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ప్రస్తుత ఆర్థికాభివృద్ధి రేటును చూస్తూ భారత్ ఐదు లక్షల కోట్ల ఆర్థికవ్యవస్థను ఎలా ఏర్పాటు చేస్తారనే ప్రశ్నకు మీరు లెక్కల పుస్తకాల్లో పడకండని చెప్పారు.
ఆయన "మీరు 5 ట్రిలియన్ ఆర్థికవ్యవస్థ కోసం దేశం 12 శాతం రేటుతో ముందుకెళ్లాలని టీవీల్లో చూపించే ఆ లెక్కల్లో పడకండి. ఈరోజు అది ఆరు శాతం వేగంతో ముందుకెళ్తోంది. అలాంటి లెక్కల్లో పడకండి. అలాంటి లెక్కలు ఐన్‌స్టీన్‌కు గురుత్వాకర్షణ గురించి తెలుసుకోడానికి కూడా పనికిరాలేదు" అన్నారు.
అంతకు ముందు బుధవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆటో సెక్టార్‌లో కనిపిస్తున్న మాంద్యానికి యువత ఆలోచనల్లో మార్పు రావడమే కారణం అన్నారు. దాంతో ఆమెపై కూడా సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి.
ఆర్థిక మంత్రి తన ప్రకటనలో "బీఎస్6, ప్రజల ఆలోచనల్లో మార్పుతో ఆటోమొబైల్ ఇండస్ట్రీపై తీవ్ర ప్రభావం పడింది. జనం ఇప్పుడు కారు కొనుక్కోడానికి బదులు ఓలా లేదా ఉబేర్‌నే ఎంచుకుంటున్నారు" అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఆర్థిక వృద్ధి అంచనాలు ఎందుకు తలకిందులయ్యాయి
- కశ్మీర్ కోసం భారత్‌తో యుద్ధం రావచ్చు: ఇమ్రాన్ ఖాన్
- రెండేళ్ల చిన్నారి మీద అత్యాచారం... కోర్టులో సాక్ష్యం చెప్పిన పసిపాప
- 6174: ఒక భారతీయ ఉపాధ్యాయుడు కనిపెట్టాడు.. డెబ్బై ఏళ్లుగా గణిత శాస్త్రజ్ఞులు ఆశ్చర్యపోతున్నారు
- నల్లమలలో యురేనియం సర్వే వివాదం: "ఇక్కడ తవ్వితే మా ఊళ్లు నాశనమైపోతాయి... ఆ విషంతో మేం భంగమైపోతాం"
- ‘ఎన్ఆర్సీ కేవలం హిందూ-ముస్లిం సమస్య కాదు... అసలు రాజకీయం వేరే ఉంది’
- లిరా పడిపోతోంది.. రూపాయినీ లాక్కెళుతోంది
- మోదీ ప్రభుత్వం ఆర్బీఐ నుంచి రూ. 1.76 లక్షల కోట్ల నిధులు ఎందుకు తీసుకుంది?
- ఇంజినీర్స్ డే: హైదరాబాద్‌ను వరదల నుంచి కాపాడిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య
- హైదరాబాద్‌లో అమ్మపాల బ్యాంకు: తల్లుల నుంచి పాల సేకరణ.. ఉచితంగా చిన్నారులకు
- 11 తరాలుగా ఈ ఆలయంలో అర్చకులంతా దళితులే.. వివక్షను పారదోలిన ఉప్పులూరు చెన్నకేశవ ఆలయం ప్రత్యేకతలివీ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)