మోదీ-పుతిన్ మధ్య ఒప్పందం: రష్యా రక్షణ రంగ పరికరాల విడిభాగాలు భారత్‌లో తయారీ

ఫొటో సోర్స్, TWITTER @MEAINDIA
రష్యాలో రెండు రోజుల పర్యటన కోసం వ్లాదివోస్తోక్ చేరుకున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య చాలా ఒప్పందాలు జరిగాయి.
జ్వేదా నౌక నిర్మాణ కేంద్రం సమీపంలో ఒక నౌకపై జరిగిన సమావేశం తర్వాత ఇద్దరు నేతలు ఒక సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడారు. అందులో రష్యాతో చాలా ఒప్పందాలు జరిగినట్లు ప్రధాని మోదీ చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
మోదీ ఏం చెప్పారు
- 2001లో రష్యాలో ఈ సమిట్ మొదటిసారి జరిగినప్పుడు అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలో గుజరాత్ ముఖ్యమంత్రి హోదాలో నేను భారత ప్రతినిధి మండలిలో ఇక్కడికి వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటివరకూ రెండు దేశాల మధ్య సహకారం, స్నేహం వేగంగా వృద్ధి చెందింది. నేను, అధ్యక్షుడు పుతిన్ ఈ బంధాన్ని సహకారంలో మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్లాం.
- రెండు దేశాల మధ్య పదుల సంఖ్యలో వాణిజ్య ఒప్పందాలు జరిగాయి. రక్షణ రంగంలో రష్యా పరికరాల స్పేర్ పార్ట్స్‌ను భారత్‌లో రెండు దేశాలూ సంయుక్తంగా తయారు చేయడం కోసం ఈరోజు ఒప్పందం జరిగింది. ఇది దేశంలో పారిశ్రామిక రంగానికి జోష్ ఇస్తుంది.
- భారత్, రష్యా మధ్య రక్షణ, వ్యవసాయ, పర్యాటక, వాణిజ్యంతోపాటు అంతరిక్ష కార్యక్రమంలో కూడా సహకారం కొనసాగుతోంది.
- రష్యా సహకారంతో భారత్‌లో న్యూక్లియర్ ప్లాంట్ అభివృద్ధి చేయడంపై భాగస్వామ్యం కొనసాగుతోంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
- ఈస్టర్న్ ఎకానమీ ఫోరంకు భారత్‌ను దగ్గర చేయడాన్ని ఎంత ప్రశంసించినా తక్కువే అవుతుంది. బొగ్గు, వజ్రాలు, గనులు, వ్యవసాయం, రేర్ ఎర్త్, టింబర్, పల్ప్ అండ్ పేపర్, పర్యాటక రంగాలు కొత్త అవకాశాలకు అనువుగా ఉన్నాయి. ఈ రెండు ప్రాంతాల మధ్య కనెక్టివిటీ పెంచడానికి చెన్నై, వ్లాదివోస్తోక్ మధ్య సముద్ర మార్గం కోసం ప్రస్తావించాం.
- రెండు దేశాలు పరస్పరం హైడ్రో కార్బన్ రంగంలో పెట్టుబడులు పెట్టాయి. ఇందులో సహకారం కోసం ఐదేళ్ల రోడ్‌మ్యాప్, ఫార్ ఈస్ట్, ఆర్కిటిక్‌లో హైడ్రో కార్బన్ అండ్ ఎల్ఎన్‌జీ అన్వేషణ కోసం ఒప్పందం జరిగింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
- ఈ సమావేశంలో అఫ్గానిస్తాన్ గురించి మాట్లాడిన మోదీ "రెండు దేశాల అంతర్గత అంశంలో బయటి దేశాల జోక్యానికి నేను వ్యతిరేకం" అన్నారు. ఒక స్వతంత్ర, సురక్షిత, శాంతి పూర్వక, ప్రజాస్వామిక అఫ్గానిస్తాన్‌ను భారత్ చూడాలనుకుంటోందని చెప్పారు.
- అంతరిక్షలో సహకారం: గగన్‌యాన్ కోసం భారత అంతరిక్ష వ్యోమగాములు రష్యాలో ట్రైనింగ్ తీసుకుంటారు.
- వచ్చే ఏడాది పులుల సంరక్షణ కోసం భారత్, రష్యా మధ్య ఉన్నతస్థాయి ఫోరం ఏర్పాటు చేయడానికి ఒప్పందం జరిగింది.

ఫొటో సోర్స్, Twitter
వ్లాదివోస్తోక్- మోదీ వెళ్లిన రష్యా నగరం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పర్యటనకు రష్యాలోని వ్లాదివోస్తోక్ నగరం కేంద్రంగా మారింది.
వ్లాదివోస్తోక్ ఒక రేవుపట్టణం. ప్రైమరీ ఏరియా అయిన ఇది ఫార్ ఈస్ట్(సుదూర తూర్పు) ఫెడరల్ జిల్లా పరిపాలన, సాంస్కృతిక, ఆర్థిక కేంద్రం. ఇది రష్యాకు ఆగ్నేయంగా గోల్డెన్ హార్న్ లోయ దగ్గర ఉంది.
ఫార్ ఈస్ట్‌లో ఇది అతిపెద్ద ట్రైనింగ్, సైన్స్ సెంటర్. ఈ నగరంలో ఫార్ ఈస్టర్న్ ఫెడరల్ యూనివర్సిటీ, రష్యా సైన్స్ అకాడమీ బ్రాంచ్ ఉన్నాయి.
ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరం వెబ్‌సైట్ ప్రకారం రష్యా రాజధాని మాస్కోకు ఇది 9,258 కిలోమీటర్ల దూరంలో ఉంది. 2018లో ఈ నగరం జనాభా 6 లక్షలకు పైనే ఉంది.

ఫొటో సోర్స్, Reuters
కాలంతోపాటు మారిన వ్లాదివోస్తోక్
సైబీరియన్ రైల్వే చివరి స్టేషన్ అయిన వ్లాదివోస్తోక్‌కు రైల్లో వెళ్లడానికి ఏడు రోజులు పడుతుంది. అయితే ఈ నగరానికి 159 ఏళ్ల పురాతన చరిత్ర ఉంది.
1860 జూన్‌లో రష్యా, చైనా మధ్య జరిగిన ఐగున్ సంధి తర్వాత జపాన్ సముద్రం దగ్గర గోల్డన్ హార్న్ లోయ ద్వీపాలపై రష్యా సైన్యాన్ని మోహరించింది. దీనికి వ్లాదివోస్తోక్ అనే పేరు పెట్టింది.
1890లో దాదాపు ఏడున్నర వేల జనాభా ఉన్న వ్లాదివోస్తోక్‌కు నగరం హోదా దక్కింది.
1899లో ఇక్కడ ఈస్టర్న్ ఇన్‌స్టిట్యూట్ తెరిచారు. 20వ శతాబ్దం రాగానే ఈ చిన్న నగరం రష్యాకు, మొత్తం ఫార్ ఈస్ట్ ఏరియాకు చాలా కీలక రేవు పట్టణంగా, నౌకాదళ స్థావరంగా మారింది.
సోవియట్ యూనియన్‌లో వ్లాదివోస్తోక్ నగరం ఫార్ ఈస్ట్ సాంస్కృతిక, విజ్ఞాన, పారిశ్రామిక కేంద్రంగా ఉండేది.

ఫొటో సోర్స్, Twitter
ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరం వెబ్‌సైట్ వివరాల ప్రకారం ఆ సమయంలోనే నగరంలో మెషినరీ నిర్మాణం, నౌకా నిర్మాణం, రిపేర్లు, నిర్మాణ పరికరాల ఉత్పత్తి, చేపలు పట్టే పరికరాలు, ఆహార పదార్థాలు, ఇతర వస్తువుల నిర్మాణం, కొయ్య పనుల పరిశ్రమలు కూడా అభివృద్ధి చెందాయి.
వ్లాదివోస్తోక్ నుంచి పెట్రోలియం, బొగ్గు, ధాన్యం ఎగుమతి అవుతున్నాయి. బట్టలు, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ దిగుమతులు జరుగుతున్నాయి.
ఈ రేవుపట్టణంలో ఒక పెద్ద భాగంలో చేపలు పట్టడం, ఆ చేపలను దేశమంతా సరఫరా చేయడం జరుగుతుంటుంది.

ఫొటో సోర్స్, Twitter
నగరంలో మూడు థియేటర్లు, ఒక ఆర్ట్ గ్యాలరీ ఉన్నాయి. వ్లాదివోస్తోక్‌లో ఆధునిక జీవనవిధానంతోపాటూ గత లక్షణాలు కూడా కనిపిస్తాయి.
ఈ నగరంలో ఉన్న రకరకాల నిర్మాణ శైలి పశ్చిమ, తూర్పు రెండు సంస్కృతులకూ ప్రాతినిధ్యం వహిస్తుంది వ్లాదివోస్తోక్‌లో 30కి పైగా మ్యూజియంలు ఉన్నాయి.
2012 సెప్టంబర్‌లో ఏసియా-పసిఫిక్ ప్రాంతంలోని 20కి పైగా దేశాల అధినేతల ఏపీఈసీ బిజినెస్ సమ్మిట్ ఇక్కడ రస్కీ ద్వీపంలో జరిగింది.
ఈ ఏడాది ఏఫ్రిల్‌లో పుతిన్ ఇదే నగరంలో ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జాంగ్-ఉన్‌తో సమావేశం అయ్యారు.
ఇవి కూడా చదవండి:
- చాలా ఏళ్లుగా చిప్స్ మాత్రమే తింటున్నాడు.. చివరికి కంటి చూపు కోల్పోయాడు
- బ్రెగ్జిట్: బ్రిటన్‌లో రాజకీయ సంక్షోభానికి కారణాలేంటి? పార్లమెంటును ఎందుకు మూసివేశారు?
- నగర జీవితం మీ ఆరోగ్యం, సంతోషం మీద ఎలా ప్రభావం చూపుతోంది?
- కడుపులోని పసికందునూ కబళిస్తోన్న కాలుష్యం
- ‘మా నాన్న ఒక గ్యాంగ్‌స్టర్... నా మూలాలు దాచేందుకు నా ముక్కునే మార్చేశాడు’
- పెరూలో బయటపడ్డ 500 ఏళ్లనాటి మృతదేహాలు.. ‘దేవతలను సంతృప్తి’ పరచడానికి 227 మంది పిల్లల సామూహిక బలి
- 6174: ఒక భారతీయ ఉపాధ్యాయుడు కనిపెట్టాడు.. డెబ్బై ఏళ్లుగా గణిత శాస్త్రజ్ఞులు ఆశ్చర్యపోతున్నారు
- అమరావతి నుంచి రాజధాని మారుస్తున్నారా? అక్కడేం జరుగుతోంది?
- కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత అమిత్ షా టార్గెట్ మావోయిస్టులేనా...
- ఇంటి అద్దె వద్దు.. సెక్స్ కావాలంటున్నారు
- ఆర్ఎఫ్ఐడీ: రోజువారీ జీవితాల్లో భాగమైపోయిన ప్రచ్ఛన్న యుద్ధ కాలపు స్పై టెక్నాలజీ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








