మానవ పరిణామ క్రమంలో భాగమైన కోతి ఇదేనా

ఫొటో సోర్స్, CMNH/MATTCROW
- రచయిత, పల్లబ్ ఘోష్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఇథియోపియాలో మానవ పూర్వీకులుగా భావించే కోతికి సంబంధించిన దాదాపు 38 లక్షల సంవత్సరాల కిందటి పురాతన పుర్రెను పరిశోధకులు కనుగొన్నారు.
ఈ పుర్రెను విశ్లేషించడం ద్వారా కోతి నుంచి మనిషి ఎలా వచ్చాడనే విషయం తెలిసే అవకాశం ఉంది.
అయితే, మానవ జాతి పరిణామ క్రమానికి ముందు లూసీ అనే కోతి ఉందనే అభిప్రాయాన్ని మనం పరిగణించాల్సి ఉంటుంది.
ఈ ఆవిష్కరణను నేచర్ జర్నల్‌లో ప్రచురించారు.
ఈ పుర్రెను మిరో డోరా అనే ప్రదేశంలో ప్రొఫెసర్ యోహన్నెస్ హైలే-సెలాసీ కనుగొన్నారు. ఈ ప్రాంతం ఇథియోపియాలోని మిల్లె జిల్లాలో ఉంది.
ప్రొఫెసర్ యోహన్నెస్ హైలే-సెలాసీ అమెరికాలోని ఒహియోలో క్లీవ్‌ల్యాండ్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ శాస్త్రవేత్త.
ఈ శిలాజం దొరకగానే తాను ఇది కలా నిజమా అనుకున్నాని ఆయన బీబీసీతో చెప్పారు.
ఆస్ట్రాలోపిథెకస్ అనామెన్సిస్(4.2 మిలియన్ ఏళ్ల కిందటి) అని పిలిచే కోతి లాంటి మానవ పూర్వీకుడికి ఈ శిలాజం చక్కటి ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Cleveland Museum of Natural History
ఎ. అనామెన్సిస్ మానవ పరిణామ క్రమానికి సంబంధించిన ముందు దశగా భావిస్తుంటారు. దీని తర్వాత దశను
ఆస్ట్రాలోపిథెకస్ అఫారెన్సిస్‌గా పేర్కొంటారు. మానవ పరిణామక్రమ పూర్వ దశగా దీన్ని పరిగణిస్తారు. ఈ దశను హోమోగా పిలుస్తారు.
1974లో తొలిసారిగా అఫారెన్సిస్ అస్థిపంజరాన్ని గుర్తించడం సంచలనాన్ని కలిగించింది. తవ్వకాలు జరిపిన స్థలంలో
బీటిల్స్‌లోని లక్కీ ఇన్ ది స్కై విత్ డైమండ్స్ పాటను ప్రదర్శించిన తర్వాత ఈ శిలాజానికి పరిశోధకులు లూసీ అని పేరు పెట్టారు.
''నడిచే తొలి కోతి'' అని ప్రశంసలందుకున్న లూసీ ప్రజల దృష్టిని ఆకర్షించింది. లండన్‌లోని నేచురల్ హిస్టరీ మ్యూజియం ప్రొఫెసర్ ఫ్రెడ్ స్పూర్ దీనిపై నేచర్‌లో రాస్తూ ''లూసీ మానవ పరిణామక్రమానికి ప్రసిద్ధ చిహ్నంగా మారింది'' అని పేర్కొన్నారు.
ఏళ్ల కిందట అనామెన్సిస్ ఒక చిన్న సమూహంగా ఉండి ప్రధాన సమూహం నుంచి వేరుపడింది. కాలక్రమేణా స్థానిక పరిస్థితుల కారణంగా అఫారెన్సిస్‌గా పరిణామం చెందింది.
అయితే, మానవ పరిణామ క్రమానికి చెందిన కోతి దశను కనుక్కోవడం చాలా కీలకం. అనామెన్సిస్, అఫారెన్సిస్‌లే కాకుండా మానవ పరిణామ క్రమానికి దగ్గరగా ఉన్న అనేక కోతి జాతులు ఉండి ఉండొచ్చు.
లూసీ కూడా హోమో సమూహానికి చెందిన తాజా ఆవిష్కరణగా నిరూపించనప్పటికీ ఇటీవల వెలుగు చూసిన కొన్ని జాతులను ఇది వివాదంలోకి తీసుకొస్తుంది.
మానవాళి ప్రత్యక్ష పూర్వీకుడు ఏ జాతికి సంబంధించిన వ్యక్తి అనే పందేలు ఇప్పుడు ఆపేశారు అని ప్రొఫెసర్ హైల్-సెలాసీ అంగీకరించారు.
''చాలా ఏళ్లుగా మానవ పూర్వికులుగా అఫారెన్సిస్ జాతిని పరిగణించారు. కానీ, మేం ఇప్పుడు మనం ఆ స్థితిలో లేము'' అని ఆయన పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, P.PLAILLY/E.DAYNES/SPL
మనవుడి, కోతికి మధ్య సంబంధానికి గల 'లింక్' గురించి ప్రస్తావన వచ్చినప్పుడు మానవ శాస్త్రవేత్తలు వెర్రిగా ప్రవర్తిస్తుంటారు. ముఖ్యంగా జర్నలిస్టులు అనామెన్సిస్ శిలాజం గురించి వివరించాల్సి వచ్చినప్పుడు అది కోతిలోని భాగంగానూ, మానవుడిలోని భాగంగానూ వర్ణిస్తుంటారు.
మానవ పరిణామ క్రమంలో చాలా లింకులు ఉన్నాయి. కొన్ని ఇప్పటికీ మనకు అంతుచిక్కడం లేదు.
ఆధునిక మానవుడి పరిణామ క్రమం సరిగ్గా లేదని నిరూపించే అంశాల్లో అనామెన్సిస్ ఆవిష్కరణ తాజాది.
నిజం చాలా క్లిష్టమైంది, ఆసక్తికరమైంది. వాతావరణం, ఆవాసాలు, ఆహార కొరతను తట్టుకొని మానవ పరిణామ క్రమం ఎలా ఎదిగిందనే కథను అనామెన్సిస్ ఆవిష్కరణ చెబుతుంది.
మానవ పరిణామ క్రమానికి సంబంధించిన పరిశోధనలో పనిచేస్తున్న కొద్దిమంది ఆఫ్రికన్ శాస్త్రవేత్తలలో ప్రొఫెసర్ హైల్-సెలాసీ ఒకరు.
పాశ్చాత్య ఆధారిత పరిశోధన సంస్థల నుంచి అవసరమైన నిధులు, ఆర్థిక మద్దతు పొందడం అర్హత కలిగిన ఆఫ్రికన్ పరిశోధకులకు కూడా కష్టమైన పని అని ఆయన చెప్పారు.
"మానవ పరిణామ క్రమానికి సంబంధించిన చాలా శిలాజ ఆధారాలు ఆఫ్రికా నుంచి వచ్చాయి. ఆఫ్రికన్లు తమ ఖండంలో లభించే వనరులను ఉపయోగించుకోగలరని, ఆంత్రోపాలజీని మరింత ముందుకు తీసుకెళ్లగలరని నేను భావిస్తున్నాను'' అని ఆయన నాకు చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- జియో గిగా ఫైబర్: సూపర్ స్పీడ్ ఇంటర్నెట్.. టీవీ, ఫోన్ ఫ్రీ
- హైదరాబాద్‌లో అమ్మపాల బ్యాంకు: తల్లుల నుంచి పాల సేకరణ.. ఉచితంగా చిన్నారులకు
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫొటో బ్లాక్ అండ్ వైటా.. కలరా?
- భారత్-పాక్ వాణిజ్య సంబంధాలు: తెంచుకుంటే ఎవరికెంత నష్టం?
- డాక్టర్ మయిల్‌స్వామి అన్నాదురై: పశువుల కొట్టం నుంచి అంతరిక్ష పరిశోధనల దాకా...
- కార్గిల్ చొరబాట్ల గురించి ఉప్పందించిన గొర్రెల కాపరి ఇప్పుడేం చేస్తున్నారు
- ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఐదుగురు మహిళా గూఢచారులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








