టిఫనీ ట్రంప్: ఇవాంకా తెలుసు.. మరి ఈమె తెలుసా

టిఫనీ ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రస్తుతం బ్రిటన్‌లో పర్యటిస్తున్నారు. ఆయన వెంట విమానాలు, హెలికాప్టర్లు, కార్ల కాన్వాయ్‌తో పాటు దాదాపు 1,000 మంది సిబ్బంది కూడా వచ్చారు.

ట్రంప్ ఈ పర్యటనకు తన కుటుంబ సభ్యులను కూడా వెంట తీసుకువెళ్లారు. ఆయన భార్య మెలానియా ట్రంప్‌తో పాటు నలుగురు పిల్లలు కూడా ప్రస్తుతం లండన్‌లో ఉన్నారు.

డోనల్డ్ ట్రంప్, టిఫనీ ట్రంప్

ఫొటో సోర్స్, GETTY/REUTERS

ట్రంప్ సంతానంలో జూనియర్ ట్రంప్, ఇవాంకా ట్రంప్ గురించి తెలిసినంతగా ప్రపంచానికి తెలియని కూతురు ఒకరు ఉన్నారు.

ఆమె పేరు టిఫనీ ట్రంప్. వయసు పాతికేళ్లు. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో పది లక్షల మందికి పైగా ఫాలోయర్లు ఉండటం విశేషం.

టిఫనీ ట్రంప్

ఫొటో సోర్స్, INSTAGRAM/TIFFANYTRUMP

నిజానికి.. ఉన్నతస్థాయి సంబంధాలున్న యువ, సంపన్న సోషల్ మీడియా ప్రముఖుల బృందం 'స్నాప్ ప్యాక్'లో టిఫనీ ఒకరని 'న్యూయార్క్ టైమ్స్' పత్రిక అభివర్ణించింది.

డోనల్డ్ ట్రంప్ రాజకీయాలు, వ్యాపార లావాదేవీల్లో ఆయన కూతురు ఇవాంకా, కొడుకులు డొనాల్డ్ జూనియర్, ఎరిక్‌లు చాలా సన్నిహితంగా పాలుపంచుకుంటుంటే.. వారి సవతి సోదరి టిఫనీ మాత్రం న్యాయశాస్త్రం అభ్యసిస్తున్నారు.

టిఫనీ తల్లి మార్లా మాపిల్స్.. డోనల్డ్ ట్రంప్ రెండో భార్య

ఫొటో సోర్స్, Getty Images

ఆమె వాషింగ్టన్ డీసీలోని జార్జ్ టౌన్ లా స్కూల్‌లో 2017 నుంచి చదువుకుంటున్నారు.

టిఫనీ బాయ్ ఫ్రెండ్ మైఖేల్ బోలోస్ సిటీ యూనివర్సిటీ ఆఫ్ లండన్‌లో ఆర్థికశాస్త్రం చదువుతున్నారు. వీరిద్దరూ కలిసి లండన్‌లో పలుమార్లు మీడియా ఫొటోల్లో కనిపించారు.

టిఫనీ ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, టిఫనీ బాయ్ ఫ్రెండ్ మైఖేల్ బోలోస్ లండన్‌లో ఆర్థికశాస్త్రం అభ్యసిస్తున్నారు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంతగా ఇష్టపడని నైజీరియాలో పెరిగారు మైఖేల్ బోలోస్.

టిఫనీ కాలిఫోర్నియాలో పెరిగారు. గతంలో పలు రంగాల్లో పనిచేయటానికి ప్రయత్నించారు.

ఆమె 17 ఏళ్ల వయసులో 2011లో 'లైక్ ఎ బర్డ్' అనే సింగిల్ విడుదల చేశారు.

2016లో అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో తండ్రి డోనల్డ్ ట్రంప్‌తో పాటు తన సోదరులు పాలుపంచుకున్నా.. టిఫనీ కనిపించలేదు.

టిఫనీ ట్రంప్

ఫొటో సోర్స్, GETTY/REUTERS

ఆమె చదువుల్లో బిజీగా ఉండటం వల్ల ప్రచారంలో పాలుపంచుకోలేదని చెప్తుంటారు.

అయితే.. 2016లో జరిగిన రిపబ్లికన్ జాతీయ సదస్సులో ప్రసంగించారు. తన తండ్రి చాలా స్నేహపూర్వకంగా, హాస్యపూరితంగా, వాస్తవికంగా ఉంటారని ప్రసంశించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)