‘12 ఏళ్లప్పుడు ఇస్లామిక్ స్టేట్ బందీగా పట్టుకుంది.. 8 మంది పురుషులకు అమ్మేసింది’

మర్యం.. ఐఎస్ బాధితురాలు

12 ఏళ్ల వయసులో ఇస్లామిక్ స్టేట్ చేతిలో బందీగా చిక్కిన మర్యం తర్వాత నాలుగేళ్లకు వారి నుంచి తప్పించుకోగలిగింది.

ఇప్పుడు క్షణం క్షణం ఆ నరకం గుర్తుకు వస్తుంటే ఒంటరి జీవితాన్ని ఇష్టపడుతోంది.

ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ 2014లో ఇరాక్‌లోని యజీదీ పౌరులను బంధించింది. మహిళలు, పిల్లలు 6 వేల మందిని బందీలుగా పట్టుకుంది.

వారిలో మర్యం, ఆమె తల్లి కూడా ఉన్నారు. తల్లీబిడ్డలను వేరు చేసిన ఐఎస్.. మర్యంను 8 మంది పురుషులకు అమ్మేసింది.

వీడియో క్యాప్షన్, వీడియో: ఐఎస్ బందీగా నరకం చూసిన యువతి

వారిలో కొందరు చిన్నారి మర్యంపై అత్యాచారం చేస్తే, మిగతా వాళ్లు ఆమెను ఒక బానిసలా ఉపయోగించుకున్నారు.

ఐఎస్ దగ్గర బందీగా ఉన్నప్పుడు జరిగిన ఆ ఘోరాలు ఆమె మాటపైనే ప్రభావం చూపించాయి.

మర్యం మాట తడబడింది

బందీగా ఉన్నప్పుడు మర్యం మాటల్లో తడబాటు మొదలైంది. అది ఇప్పటికీ అలాగే ఉంది.

నాలుగేళ్ల తర్వాత ఆమె వారి నుంచి తప్పించుకుంది. ఎన్నోసార్లు ఆత్మహత్య చేసుకోవాలని అనుకుని, ఐఎస్ దగ్గర బందీగా ఉన్న తల్లికి ఇచ్చిన మాట గుర్తుకు రావడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది.

ఆమె తల్లి ఆచూకీ ఇప్పటికీ తెలీలేదు.

ప్రస్తుతం ఒక ఎన్జీవోకు సంబంధించిన రీటా అనే సైకియాట్రిస్ట్ సాయంతో ఆమె పీడకల లాంటి తన గతాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)