నెదర్లాండ్స్: ట్రామ్ బండిపై కాల్పుల కేసులో టర్కీ పౌరుడిని అరెస్టు చేసిన పోలీసులు

ఫొటో సోర్స్, @POLITIEUTRECHT / TWITTER
నెదర్లాండ్స్‌లోని యూట్రెక్ట్ నగరంలో ఒక ట్రామ్ బండిపై కాల్పుల కేసులో అనుమానితుడైన టర్కీ పౌరుడు గోక్‌మెన్ టానిస్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
కాల్పులు జరిగిన తర్వాత కొన్ని గంటలకు ఘటనా స్థలం 24 ఆక్టోబెర్‌ప్లీన్ కూడలికి దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలోని ఒక భవనంలో టానిస్‌ను అరెస్టు చేశారు.
అతడి వయసు 37 సంవత్సరాలు.
కాల్పుల వెనక టానిస్ ఉద్దేశమేమిటనేది స్పష్టం కాలేదని అధికారులు తెలిపారు.

ఫొటో సోర్స్, EPA
సోమవారం జరిగిన ఈ కాల్పుల్లో ముగ్గురు మరణించారు. ఐదుగురు గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి తీవ్రంగా ఉంది.
దుండగుడు విచక్షణరహితంగా కాల్పులు జరిపాడని ఒక ప్రత్యక్ష సాక్షి స్థానిక మీడియాకు తెలిపారు.
ఈ కాల్పుల ఘటన ఉగ్రవాద దాడిగా అనిపిస్తోందని పోలీసులు ఇంతకుముందు చెప్పారు. ఒక ప్రాసిక్యూటర్ మాత్రం- టానిస్ జరిపిన కాల్పులకు కుటుంబ సంబంధ కారణాలు ఉండొచ్చని మీడియా సమావేశంలో చెప్పారు.

ఫొటో సోర్స్, EPA
టానిస్ లోగడ చెచెన్యాలో పోరాటంలో పాల్గొన్నాడని స్థానిక వ్యాపారవేత్త ఒకరు బీబీసీకి వెల్లడించారు. ఇస్లామిక్ స్టేట్(ఐఎస్)తో సంబంధాలపై అతడిని అరెస్టు చేశారని, తర్వాత విడుదల చేశారని వివరించారు.
‘‘యూట్రెక్ట్ ఘటన మన నాగరికతపై, సహనంపై జరిగిన దాడి‘‘ అని నెదర్లాండ్స్ ప్రధాని మార్క్ రుటె వ్యాఖ్యానించారు. ఈ దాడితో దేశం దిగ్భ్రాంతి చెందిందని, ఎంతగానో కలత చెందిందని చెప్పారు.
యూట్రెక్ట్ దేశంలోని నాలుగో అతిపెద్ద నగరం. దీని జనాభా సుమారు 3 లక్షల 40 వేలు.
ఇక్కడ నేరాలు తక్కువగా జరుగుతుంటాయి. తుపాకులతో కాల్చి చంపే ఘటనలు అరుదు.
ఇవి కూడా చదవండి:
- రవీంద్రనాథ్ ఠాగూర్: ‘జాతీయవాదం ప్రమాదకారి. భారతదేశ సమస్యలకు అదే మూలం’
- ''ఆ మసీదుకు మేం కేవలం 50 గజాల దూరంలో ఉన్నాం.. ఐదు నిమిషాలు ముందు వెళ్లుంటే ఏమైపోయేవాళ్లమో" - బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు మేనేజర్
- భారతదేశం ఇస్లామిక్ పేర్ల మీద యుద్ధం ప్రకటించిందా?
- మొబైల్ డేటా: ప్రపంచంలో అత్యంత చౌక భారతదేశంలోనే... మున్ముందు ధరలు పెరిగిపోతాయా...
- జాతీయ పార్టీ స్థాపించడానికి అర్హతలేమిటి... ఒక పార్టీకి జాతీయ హోదా ఎలా వస్తుంది...
- 'ఈ ఎన్నికల తర్వాత అవసరమైతే జాతీయ పార్టీని స్థాపిస్తా' -కేసీఆర్
- ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు: వైసీపీ అభ్యర్థుల పూర్తి జాబితా
- పతన దశలో వెబ్... అందరం కలసి కాపాడుకోవాలి: బీబీసీతో టిమ్ బెర్నర్స్-లీ
- మోదీ, షా సొంత బరి వేదికగా కాంగ్రెస్ ఎన్నికల వ్యూహరచన... సవాళ్లను అధిగమించగలదా
- భారత సరిహద్దుల్లో స్వచ్ఛంద కాపలాదారులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








