బ్రెగ్జిట్: పార్లమెంటులో బిల్లు పాస్ కాకపోతే ఏమవుతుంది

ఫొటో సోర్స్, EPA
పార్లమెంటులో బ్రెగ్జిట్ ఒప్పందంపై ఓటింగ్ జరగడానికి ముందు ఈ ఒప్పందం వల్ల 'చట్టపరంగా కట్టుబడి ఉన్న' మార్పుల గురించి తాను పరిశీలించానని బ్రిటన్ ప్రధాని థెరెసా మే చెప్పారు.
ఈ ఓటింగ్ ఎందుకు ముఖ్యమైనది
ఈ ఓటింగ్‌ను చాలా ముఖ్యమైనదిగా భావిస్తున్నారు. పార్లమెంటులో బిల్లు తిరస్కరణకు గురైతే మార్చి 29న బ్రిటన్ ఎలాంటి ఒప్పందం లేకుండా యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వెళ్లాల్సి ఉంటుంది. లేదా దాని సమయం మరింత పొడిగిస్తారు.
లేదా ఎంపీలు ఈ ఒప్పందానికి మద్దతు ఇస్తే మార్చి 29న బ్రిటన్ యూరోపియన్ యూనియన్ వీడాల్సి ఉంటుంది. కానీ రెండు వైపులా శాశ్వత వాణిజ్య ఒప్పందాల మినహా, పరిస్థితులు చాలావరకూ 2020 వరకూ ఇలాగే ఉంటాయి.
అయితే, ఒప్పందానికి వ్యతిరేకంగా ఓటింగ్ జరిగితే తర్వాత మూడో అవకాశం లభించదని యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు జీన్-క్లాడీ జంకర్ హెచ్చరించారు.
స్ట్రాస్‌బర్గ్‌లో జరిగిన సుదీర్ఘ సమావేశం తర్వాత ఆయన ఒక సంయుక్త మీడియా సమావేశంలో ఈ విషయం చెప్పారు.
ఒప్పందం గురించి ప్రధాని థెరెసా మే చర్చలు విఫలం అయ్యాయని లేబర్ పార్టీ నేత జెరెమీ కాబిన్ అన్నారు.
మంగళవారం ఈ ఒప్పందంపై 'అర్థవంతమైన ఓటింగ్'కు ముందు పార్లమెంటులో స్వయంగా చర్చను ప్రారంభిస్తానని ప్రధాన మంత్రి ధ్రువీకరించారు. చివరగా జనవరిలో పార్లమెంటులో ఓటింగ్ కోసం ఈ ఒప్పందాన్ని ప్రవేశ పెట్టారు. అప్పుడు 230 ఓట్ల తేడాతో అది తిరస్కరణకు గురైంది.
ఓటింగ్‌కు ముందు ఈ ఒప్పంద సవరణలపై న్యాయపరమైన సలహాలు అందించాలని అటార్నీ జనరల్ జెఫ్రీ కాక్స్‌ను కోరినట్లు ప్రధాన మంత్రి చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
రెండు ఒప్పందాలపై అంగీకారం
ఓటింగ్‌కు ముందు కీలక చర్చల కోసం బ్రిటన్ ప్రధాన మంత్రి సోమవారం తన బ్రెగ్జిట్ సెక్రటరీ స్టీవ్ బార్క్‌లేతో కలిసి యూరోపియన్ పార్లమెంటుకు వెళ్లారు.
జంకర్, యూరోపియన్ యూనియన్, బ్రెగ్జిట్ ముఖ్య మధ్యవర్తి మిషెల్ బానియర్ మధ్య చర్చల తర్వాత అన్ని పక్షాలూ రెండు ఒప్పందాలను అంగీకరించాయి. మరోవైపు దీనిపై మాట్లాడిన కేబినెట్ మినిస్టర్ డేవిడ్ లైడింగ్టన్ యూరోపియన్ యూనియన్ బయటకు రావాలనే ఒప్పందాన్ని, భవిష్యత్తు సంబంధాలను ఇవి మరింత బలోపేతం చేస్తాయని అన్నారు.
వీటిలో ఒకదానిని 'చట్టపరమైన కట్టుబాటు'గా అనుకుంటున్నారు.
ఒక వేళ బ్రిటన్‌ను బాక్‌స్టాప్‌లో (ఐర్లాండ్ సరిహద్దులు నిరవధికంగా తెరిచివుంచితే) ఉంచేస్తే, యూరోపియన్ యూనియన్‌కు వ్యతిరేకంగా అధికారిక వివాదం ప్రారంభించడానికి ఈ ఒప్పందాన్ని ఉపయోగించవచ్చని ప్రధాన మంత్రి అన్నారు.
అయితే బాక్‌స్టాప్‌ను చాలా మంది విమర్శిస్తున్నారు. దీనివల్ల బ్రిటన్ యూరోపియన్ యూనియన్‌కు నిరవధికంగా అనుసంధానమై ఉంటుందని అంటున్నారు.
రెండో ఒప్పందం ఒక సంయుక్త ప్రకటన. దీనిని రాజకీయ ప్రకటనల్లో చేరుస్తారు. 2020 డిసెంబర్ వరకు బాక్‌స్టాప్ స్థానంలో వేరే ఏర్పాట్లు చేస్తామని ప్రకటనల్లో మాట ఇచ్చారు.
"బాక్‌స్టాప్ కోసం చట్టపరమైన మార్పులు జరగాలని పార్లమెంటు స్పష్టతతో ఉంది. అందుకే మేం దాన్ని ఈరోజు కచ్చితంగా చేస్తాం" అని థెరెసా మే చెప్పారు.
"ఇది అందరం కలిసి సవరించిన బ్రెగ్జిట్ ఒప్పందాన్ని సమర్థించాల్సిన సమయం. బ్రిటన్ ప్రజల సూచనలను పూర్తి చేయాలి" అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
మూడో అవకాశం లభించదు
పార్లమెంటు సభ్యులను హెచ్చరించిన జంకర్.. "ఒక వేళ ఈ ఒప్పందం రద్దు చేసుకుంటే వారు అందరినీ ప్రమాదంలో పడేస్తారు" అన్నారు.
"రాజకీయాల్లో మీకు అప్పుడప్పుడూ రెండో అవకాశం లభించవచ్చు".
"ఈ రెండో అవకాశం కోసం మేం వేచిచూస్తున్నాం. కానీ మూడో అవకాశం ఏమాత్రం ఉండదు" అన్నారు.
"ఒప్పందమా, లేక బ్రెగ్జిటా అనే మన ఇష్టాన్ని మనం స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది".
మంగళవారం బిల్లు ప్రవేశ పెట్టినపుడు దానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని లేబర్ పార్టీ నేత కాబిన్ ఎంపీలను కోరారు.
ఈ వారం ఏమేం జరగచ్చు
- మంగళవారం థెరెసా మే ప్రవేశపెట్టే ఈ ఒప్పందం పార్లమెంటులో ఓటింగ్ ఎదుర్కోవాల్సి ఉంటుంది.
- దానిని తిరస్కరిస్తే, బ్రిటన్ ఒప్పందం లేకుండానే యూరోపియన్ యూనియన్ వదిలేస్తుందనే వాదనతో బుధవారం బిల్లు తీసుకొస్తారు.
- ఒప్పందం లేకుండా అనే ప్రత్యామ్నాయాన్ని కూడా తిరస్కరిస్తే, గురువారం పార్లమెంటు ఆ ఒప్పందంపై ఓటింగ్ చేపట్టవచ్చు. దాని ప్రకారం యూరోపియన్ యూనియన్ నుంచి బ్రెగ్జిట్ కోసం మరింత సమయం కోరచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
ఓటింగ్ ఎప్పుడు జరుగుతుంది
పార్లమెంటులో ఓటింగ్ కోసం బిల్లును ప్రవేశపెట్టే ముందు రోజంతా దీనిపై చర్చ జరుగుతుంది. తర్వాత సాయంత్రం ఓటింగ్ జరుగుతుంది. అయితే ప్రభుత్వం దీనిపై ఒక ప్రకటన చేయనంత వరకూ ఓటింగ్ ఈ సమయంలో జరుగుతుందని స్పష్టంగా చెప్పలేం.
పార్లమెంటులో ఓటింగ్ ఎలా జరుగుతుంది
ప్రధాన మంత్రి థెరెసా మే రెండేళ్లు చర్చలు జరిపి యూరోపియన్ యూనియన్‌తో చేసుకున్న ఈ ఒప్పందంపై, దీనిని ఎంపీల నిర్ణయంగా భావిస్తారు.
ఇవి కూడా చదవండి:
- బ్రెగ్జిట్: ‘విడాకుల’ ఒప్పందంలో ఏముందంటే..
- బ్రెగ్జిట్‌కు ఈయూ లైన్ క్లియర్: మరి బ్రిటన్ పార్లమెంట్ ఆమోదిస్తుందా?
- బోయింగ్ 737 మాక్స్ 8 విమానం ఏంటి? ఈ విమానాలు ఎందుకు కూలిపోతున్నాయి?
- IND vs AUS: భారత్ ఆర్మీ క్యాప్‌లపై ఐసీసీకి పాకిస్తాన్ ఫిర్యాదు
- తలపై జుట్టు లేకుండా.. 'పెళ్లి కూతురు' ఫొటోషూట్
- 'రాక్షసుడి బంగారం' బయటకు తీసే కార్మికుల కథ
- జీబ్రాలపై చారలు ఎందుకు ఉంటాయి?
- ''గూగుల్ నా కుమార్తె మరణాన్ని సొమ్ము చేసుకుంటోంది''
- అందరికీ మరుగుదొడ్లు కల్పిస్తామన్న మోదీ హామీ నెరవేరిందా...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.









