జీబ్రాలపై చారలు ఎందుకు ఉంటాయి?

జీబ్రాలపై చారలు ఎందుకుంటాయనేది చాలా మందిని తొలిచే ప్రశ్న. శాస్త్రవేత్తలు కూడా చాలా ఏళ్ల నుంచి దీని గురించి ఆలోచిస్తున్నారు. తమను వేటాడే జంతువులను అయోమయానికి గురిచేయడానికి, శరీరానికి చల్లదనాన్ని చేకూర్చుకునేందుకు జీబ్రాలకు చారలు ఉంటాయని చాలా మంది భావిస్తుంటారు.
అయితే, యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్‌కు చెందిన శాస్త్రవేత్తలు మాత్రం చారలు ఎందుకు ఉంటాయో పరిశోధనలతో తేల్చి చెప్పారు. దీని కోసం వారు ఒక ప్రయోగం చేశారు.
గుర్రాలపై జీబ్రాల మాదిరిగా చారలు ఉండే కోట్లను కప్పి కొన్ని రోజులు గమనించారు. అప్పుడు గుర్రాలపై ఈగలు వాలకపోవడం వారు గుర్తించారు. ఈ చారల కోట్స్ వల్ల గుర్రాలపై ఈగలు వాలడం, కుట్టడం 25 శాతం తగ్గిందని పరిశోధకులు చెబుతున్నారు.
ఇక జీబ్రాలపై చారలు ఉండటం వల్ల ఈగలు అయోమయానికి గురై వాటిపై వాలడం లేదని నిరూపించారు.
ఇవి కూడా చదవండి:
- భారత్ నిజంగానే జైషే మొహమ్మద్ శిబిరాలపై వైమానిక దాడులు చేసిందా... ప్రత్యక్ష సాక్షులు ఏమంటున్నారు...
- కశ్మీర్ : ‘టార్చి లైటు వేస్తే సైనికుల తుపాకులకు బలికావాల్సి ఉంటుంది’
- అభినందన్‌ను పాకిస్తాన్ ఎందుకు విడుదల చేస్తోంది? ఇమ్రాన్ ఖాన్ నిర్ణయం వెనుక కారణాలేంటి?
- 15 రాత్రుల్లో 121 మంది మహిళలతో...: ప్రాచీన చైనా చక్రవర్తుల జీవితాన్ని గణితశాస్త్రం ఎలా ప్రభావతం చేసింది?
- గంగానది ప్రక్షాళన పూర్తయిందా?
- విశాఖ రైల్వేజోన్: కేంద్ర ప్రభుత్వ ప్రకటనపై అసంతృప్తి ఎందుకు?
- పాకిస్తాన్‌పై 'నీటి సర్జికల్ స్ట్రైక్స్' వెనుక అసలు నిజం
- #WhyModi: మళ్లీ ప్రధానిగా మోదీనే ఎందుకు?
- కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చిన 'ఆర్టికల్ 370' రద్దు సాధ్యమేనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





