#Abhinandan: భారత భూభాగంలోకి అడుగు పెట్టగానే, "స్వదేశానికి రావడం ఎంతో బాగుంద"న్న వింగ్ కమాండర్

పాక్ అధీనంలో ఉన్న భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ శుక్రవారం రాత్రి స్వదేశంలో అడుగుపెట్టారు. పాకిస్తాన్ అధికారులు ఆయనను రాత్రి 9 గంటల 20 నిమిషాలకు వాఘా సరిహద్దు వద్ద భారత అధికారులకు అప్పగించారు.
అభినందన్‌ను లాహోర్ నుంచి వాఘా వద్దకు రోడ్డు మార్గంలో తీసుకువచ్చారు.
అక్కడ రెండు దేశాల అధికారులు అప్పగింతల పత్రాలు మార్చుకున్న తర్వాత అభినందన్ సరిహద్దు గేట్లను దాటి భారత్‌లోకి అడుగు పెట్టారు.

అభినందన్ రాక పట్ల భారత వైమానిక దళం హర్షం వ్యక్తం చేసింది. "నా దేశంలోకి అడుగు పెట్టగానే చాలా బాగా అనిపిస్తోంది" అని అభినందన్ చెప్పినట్లు అక్కడికి వచ్చిన అధికారులు తెలిపారు.
ఆ తరువాత వైమానిక దళ విమానంలో ఆయనను రాత్రి దాదాపు 12 గంటలకు ఢిల్లీ విమానాశ్రయానికి తీసుకువచ్చారు. అక్కడి నుంచి వైద్య పరీక్షల కోసం ఎయిర్ ఫోర్స్ హాస్పిటల్‌కు తీసుకువెళ్ళారు.
వింగ్ కమాండర్ అభినందన్ భారత్ స్వదేశాగమనం సందర్భంగా వాఘా-అటారీ సరిహద్దు వద్దనే కాకుండా దేశంలో చాలా చోట్ల ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి.
అభినందన్ అప్పగింతలో ఆలస్యం
తొలుత సాయంత్రమే ఆయన్ను భారత అధికారులకు అప్పగించినట్లు మీడియాలో వార్తలొచ్చాయి. అనంతరం ఇమిగ్రేషన్ ప్రక్రియలో ఆలస్యం కారణంగా రాత్రి 9 గంటలకు అప్పగిస్తారని వెల్లడించారు.
చివరకు రాత్రి 9 గంటల తరువాత అప్పగింతల ప్రక్రియంతా పూర్తయి అభినందన్ పాక్ సరిహద్దు గేట్లను దాటగా భారత సైనికాధికారులు ఆయన్ను తోడ్కొని భారత్‌లోకి తీసుకొచ్చారు.
అభినందన్ రాక కోసం శుక్రవారం ఉదయం నుంచే వేలాది మంది ప్రజలు వాఘా చేరుకున్నారు.
ఆ ప్రాంతమంతా భారత్ అనుకూల నినాదాలతో మార్మోగింది.

రెండు రోజుల తరువాత స్వదేశాగమనం
వింగ్ కమాండర్ అభినందన్‌ను ఫిబ్రవరి 27న పాకిస్తాన్ సైన్యం అదుపులోకి తీసుకుంది.
భారత వైమానిక దళం అధికారులు చెప్పిన ప్రకారం, "ఫిబ్రవరి 27 ఉదయం 10 గంటల ప్రాంతంలో పాకిస్తాన్ విమానాలు భారత గగనతలంలోకి వచ్చినట్లు రాడార్ సంకేతాలు అందాయి. ఆ విమానాలను తిప్పికొట్టేందుకు భారత వైమానిక దళం మిగ్ 21 బైసన్, సుఖోయి 30 ఏంఏకేఐ, మిరాజ్ 2000 యుద్ధ విమానాలను రంగంలోకి దింపింది. ఆ ప్రయత్నంలో మిగ్-21 యుద్ధ విమానం కూలిపోయింది. పైలట్ సురక్షితంగా బయటకు రాగలిగారు. కానీ, ఆయన పారాషూట్ పాకిస్తాన్ పాలిత కశ్మీర్ భూభాగంలో పడింది. దాంతో, పాకిస్తాన్ సైన్యం ఆయనను అదుపులోకి తీసుకుంది."
కాగా అభినందన్ రాక సందర్భంగా ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, ఏపీ సీఎం చంద్రబాబు సహా పలువురు నేతలు ఆయనకు స్వాగతం చెబుతూ ట్వీట్లు చేశారు.
‘‘వింగ్ కమాండర్ అభినందన్! మీకు స్వాగతం
ఆదర్శనీయమైన మీ ధైర్యాన్ని చూసి దేశం గర్విస్తోంది.
130 కోట్ల మంది భారతీయులకు మన సాయుధ బలగాలు స్ఫూర్తిదాయకం.
వందేమాతరం’’
అంటూ మోదీ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
‘‘వింగ్ కమాండర్ అభినందన్! మీ హుందాతనం, ధైర్యం మమ్మల్ని అందరినీ గర్వించేలా చేసింది.
స్వదేశంలోకి మీకు ప్రేమపూర్వక స్వాగతం’’ అంటూ రాహుల్ తన ట్వీట్‌లో అభినందనలు తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
‘‘అభినందన్ సురక్షితంగా భారత్ చేరుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. అతని ధైర్యం స్ఫూర్తినిచ్చే దేశభక్తికి ఆంధ్రప్రదేశ్ వందనం చేస్తోంది’’ అని చంద్రబాబునాయుడు ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
అభినందన్ ఎవరు? కింద పడగానే ఏం జరిగింది?
పాకిస్తాన్ పాలిత కశ్మీర్‌లోని భీంబర్ జిల్లా హోరాన్ గ్రామానికి చెందిన మొహమ్మద్ రజాక్ చౌదరీ ఓ స్థానిక రాజకీయ నాయకుడు. ఆయన పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ పార్టీ పీటీఐ మద్దతుదారుడు.
భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ పాకిస్తాన్ భూభాగంలో పడినప్పుడు ఆయన అక్కడకు సమీపంలోనే ఉన్నారు. అప్పుడేం జరిగిందో ఆయన బీబీసీకి వివరించారు.
ఆయన్ను (ఆ పైలట్‌ను) ప్రాణాలతో అక్కడినుంచి తీసుకెళ్లాలనేది వ్యక్తిగతంగా నా లక్ష్యం. ఆయన పారాచ్యూట్‌పై భారత జెండాను నేను చూశా. దీంతో ఆయనో భారతీయుడు అనే విషయం తెలిసింది. ఆయన విమానం నేలకూలడం చూశాను, ఆయన నేలపై పాకుతూ బయటకు వచ్చారు. కానీ అక్కడకు చేరుకున్న స్థానిక ప్రజలు ఆయనను చుట్టుముట్టారు. ఎక్కడ హాని తలపెడతారో అని కంగారుపడ్డాను లేదా ఆయన స్థానికులకు ఏదైనా హానిచేస్తారేమో అని కూడా భయపడ్డాను.
నేను భారత్‌లోనే దిగానా అని తన దగ్గరకు ముందుగా చేరుకున్న కొందరు యువకులను ఆ పైలట్ అడిగారు. కానీ ఆయనకు ఎవరైనా తగిన సమాధానం ఇచ్చారో లేదో తెలియదు. తన నడుం చుట్టూ ఉన్న పారాచ్యూట్ బెల్టును తనకుతానుగానే తొలగించుకున్నారు. భారత దేశంపై భక్తిని చాటే కొన్ని నినాదాలు చేశారు. కానీ అక్కడున్న యువకులు పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.
దీంతో ఆ వ్యక్తి తన చుట్టూ ఉన్నవారిని భయపెట్టేందుకు తన తుపాకి తీసి ఓసారి గాల్లోకి కాల్చారు. కానీ ఈ పరిణామంతో చుట్టూ ఉన్న యువకులు ఆగ్రహంతో అక్కడున్న రాళ్లను తీసి ఆ పైలట్‌పై విసిరారు. దీంతో ఆయన గాల్లోకి మరికొన్ని రౌండ్లు కాల్పులు జరుపుతూ పరుగందుకున్నారు.
సమీపంలోని కాలవలోకి దూకేవరకూ ఆ యువకులు ఆయన్ను వెంబడించారు. అప్పుడే నా మేనల్లుళ్లలో ఒకరు తన దగ్గరున్న తుపాకితో ఆ పైలట్ కాలిపై కాల్చారు. ఆయన నీళ్లలో పడ్డారు. తుపాకీని కిందపడేయాలంటూ గట్టిగా చెప్పగా, ఆయన పడేశారు.
అప్పుడు మరో యువకుడు అతడిని పట్టుకుని, కింద కూర్చోపెట్టారు. అలా చేస్తే ఆ వ్యక్తి ఇక ఎలాంటి దాడికీ పాల్పడే అవకాశం ఉండదని, తన దగ్గర ఇంకేమైనా ఆయుధాలున్నా వాటిని ఉపయోగించలేరని వాళ్లు భావించారు.
ఈ సమయంలోనే ఆ పైలట్ తన జేబుల్లో ఉన్న కొన్ని పేపర్లను బయటకు తీసి, చింపి, వాటిని నాశనం చేసేశారు. కొన్నింటిని నోట్లో పెట్టుకుని నమిలేశారు. కానీ అక్కడున్న యువకులు ఆయన దగ్గర నుంచి కొన్ని పేపర్లను లాక్కున్నారు. వాటిని తర్వాత సైన్యానికి అప్పగించారు.
మా యువకులంతా చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఆ పైలట్‌ను కొట్టడానికి, పిడిగుద్దులు గుద్దడానికి దగ్గరగా వెళ్లారు. అయితే వారిలో కొందరు కోపంతో ఉన్నవారిని ఆపేందుకు ప్రయత్నించారు. సైన్యం వచ్చేవరకూ ఆయనకు ఎలాంటి హానీ చేయవద్దు అని నేను కూడా వారితో చెప్పాను.
అబినందన్ వర్దనమాన్ తమిళనాడుకు చెందిన పైలట్. స్వస్థలం చెన్నై. తండ్రి వర్దమాన్.
ఇవి కూడా చదవండి.
- అభినందన్: విమానం నుంచి పడగానే ఏం జరిగింది? ప్రత్యక్ష సాక్షి కథనం - BBC EXCLUSIVE
- అభినందన్‌ను భారత్‌లోకి ఎలా తీసుకొస్తారు? విధి, విధానాలు ఏమిటి?
- అభినందన్‌ను పాకిస్తాన్ ఎందుకు విడుదల చేస్తోంది? ఇమ్రాన్ ఖాన్ నిర్ణయం వెనుక కారణాలేంటి?
- యుద్ధం వస్తే తెరపైకి అణు బాంబులు వస్తాయి : అభిప్రాయం
- ట్రంప్-కిమ్ సమావేశం ఎందుకు విఫలమైంది?
- విశాఖ రైల్వేజోన్: కేంద్ర ప్రభుత్వ ప్రకటనపై అసంతృప్తి ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








