పుల్వామా దాడి: చైనా మౌనం, పాకిస్తాన్ నేతల ఉద్రిక్త ప్రకటనలు

పుల్వామా

ఫొటో సోర్స్, @NARENDRAMODI

పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ దళాల బస్సుపై జరిగిన ఆత్మాహుతి దాడిని మూడు దశాబ్దాలలో జరిగిన అతిపెద్ద దాడిగా చెబుతున్నారు.

ఈ దాడిలో 46 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందారు. దాడికి తామే బాధ్యులమని జైషే మహమ్మద్ ప్రకటించింది.

జైషే మహమ్మద్ పాకిస్తాన్‌లో ఉన్న మిలిటెంట్ సంస్థ, దీని చీఫ్ మసూద్ అజర్ కూడా ఇప్పుడు పాకిస్తాన్‌లోనే ఉన్నాడు. అందుకే ఈ దాడికి పూర్తిగా పాకిస్తానే కారణమని భారత్ ఆరోపిస్తోంది.

ఐక్యరాజ్యసమితి ద్వారా మసూద్ అజర్‌ను అంతర్జాతీయ టెర్రరిస్టుగా ప్రకటించడానికి భారత్ శతవిధాలా ప్రయత్నిస్తోంది. కానీ చైనా దాన్ని అడ్డుకుంటోంది.

ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ దాడిపై పాకిస్తాన్, చైనా మీడియా దాదాపు మౌనంగా ఉన్నాయి.

పుల్వమా

ఫొటో సోర్స్, Getty Images

దాడిపై చైనా మీడియా మౌనం

గ్లోబల్ టైమ్స్‌ను చైనా అధికార పార్టీ వాణిగా భావిస్తారు. కానీ ఆ వార్తాపత్రిక కూడా దాదాపు దీని గురించి ఏం ప్రచురించలేదు.

ఈ దాడిని చైనా కూడా ఖండించలేదు. గ్లోబల్ టైమ్స్‌లో ఫిబ్రవరి 15న దాడి గురించి రాస్తూ ఒక చిన్న వార్తను ప్రచురించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

అదే విధంగా చైనా న్యూస్ ఏజెన్సీ షిన్హువా కూడా ఈ వార్తను పట్టించుకోలేదు. కానీ, ఈ దాడిని పోర్చుగల్ ఖండించిందనే వార్తను మాత్రం ప్రచురించింది.

చైనా డెయిలీ కూడా ఈ దాడి వార్తను నిర్లక్ష్యం చేసింది. అసలు దాడి గురించి ఎలాంటి వార్తా ప్రచురించలేదు. అయితే చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి గెంగ్ షువాంగ్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్‌లో జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ దాడిని ఖండిస్తున్నానని చెప్పారు.

దాడిలో మృతుల కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేసిన ఆయన చైనా తీవ్రవాదాన్ని వ్యతిరేకిస్తోందని, దీనిని అదుపు చేసేందుకు పొరుగు దేశాలు పరస్పరం సహకరించుకోవాలని అన్నారు.

అయితే, మసూద్ అజర్ గురించి అడిగిన ప్రశ్నలకు మాత్రం షువాంగ్ ఎలాంటి సమాధానం ఇవ్వలేదు.

పుల్వామా

ఫొటో సోర్స్, @narendramodi

సౌదీ ప్రిన్స్ వార్తపై పాక్ ఫోకస్

చైనా, పాకిస్తాన్ మధ్య స్నేహం రహస్యమేమీ కాదు. రెండు దేశాలూ తమ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ అయిన చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కోసం కలిసి పనిచేస్తున్నాయి.

ఈ ప్రాజెక్టు కింద చైనా పాకిస్తాన్‌లో 55 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. చైనా పాకిస్తాన్ అధికారులు పాక్ అధీనంలో ఉన్న కశ్మీర్‌లో కూడా చాలా ప్రాజెక్టులపై పనిచేస్తున్నారు.

ఇటు పాకిస్తానీ మీడియా కూడా పుల్వామా దాడి గురించి ఎలాంటి వార్తలూ ఇవ్వలేదు. ఇంత పెద్ద దాడి జరిగితే పాక్ ప్రముఖ వార్తాపత్రికలన్నీ దాన్ని ఒక చిన్న వార్తగా ప్రచురించాయి. గతంలో, ఇలాంటి తీవ్రమైన దాడికి పాకిస్తాన్ మీడియాలో చాలా ప్రాధాన్యం ఉండేది.

ఫిబ్రవరి 17న సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్-సల్మాన్ పాకిస్తాన్ వెళ్లనున్నారు. దాంతో, ఆ దేశ మీడియా అంతా దానికి సంబంధించిన వార్తలు, విశ్లేషణలతో హడావిడి చేస్తోంది.

పాకిస్తాన్ వార్తాపత్రిక డాన్ ఫిబ్రవరి 16న రేడియో పాకిస్తాన్ ఆధారంగా ఒక వార్తను ముద్రించింది. పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ భారత అధికారిని పిలిపించి పాకిస్తాన్‌పై వచ్చిన పుల్వామా దాడి ఆరోపణలకు వ్యతిరేకంగా ఒక లేఖను అందించిందని తెలిపింది.

కానీ జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ గురించి పాకిస్తాన్ ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు. మరో వైపు అది భారత ఆరోపణలను పూర్తిగా కొట్టిపారేసింది. ఈ దాడి గురించి పాకిస్తానీ నేతలు చేసిన కొన్ని వ్యాఖ్యలు కూడా వెలుగులోకి వచ్చాయి.

పుల్వామా

ఫొటో సోర్స్, @rajnathsingh

ఫొటో క్యాప్షన్, హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్

పాక్ నేతల ఉద్రిక్త వ్యాఖ్యలు

పాక్ వార్తాపత్రిక ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ ఒక కథనంలో "పాకిస్తాన్ సెనేటర్, సెనేట్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ రహమాన్ మలిక్ పుల్వామాలో భారత భద్రతాదళాలపై జరిగిన దాడి త్వరలో జరగబోయే ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించడానికి ప్రస్తుత ప్రధాన మంత్రి జరిపించిన ఒక కుట్ర అన్నట్లు" తెలిపింది.

ఇదే కథనంలో ఆయన "భారత గూడచారి కుల్‌భూషణ్ జాధవ్ నుంచి దృష్టి మళ్లించడానికే ఈ దాడి చేయించారు" అని కూడా అన్నట్లు రాశారు.అన్నారు.

పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) నేత రహమాన్ మలిక్ శుక్రవారం తన ఇంట్లో ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్సులో పాకిస్తాన్ ఈ దాడిని ముందే ఖండించిందని అన్నారు.

"ఏ దాడి జరిగినా పాకిస్తాన్ వైపు వేలు చూపించడం భారత ప్రభుత్వానికి అలవాటైపోయింది. ఇది పాకిస్తాన్‌ను ముక్కలు చేసే ప్రయత్నం. కానీ భారత్ అందులో విజయం సాధించలేదు" అన్నారు.

పాకిస్తాన్

ఫొటో సోర్స్, AFP/GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ కురేషీ

పాక్ విదేశాంగ మంత్రి షా మహమూద్ కురేషీ

పాకిస్తాన్ జియో న్యూస్ చానల్‌తో మాట్లాడుతూ పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ కురేషీ ఈ దాడిని ఖండించారు. "జరిగిన ఘటనను నేను ఖండిస్తున్నాను. హింస మా మార్గంగా ఎప్పుడూ లేదు, ఇక మీదటా ఉండదు" అని అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

"భారత్ దీనిపై ఇంకా ఎలాంటి విచారణ చేపట్టకుండా, ఆధారాలు లేకుండా పాకిస్తాన్‌పై ఆరోపణలు చేయడం మమ్మల్ని బాధిస్తోంది. ప్రపంచమంతా ఈ ఘటనను ఖండిస్తోంది. ఖండించాలి. ఇంత ప్రాణనష్టం జరగడాన్ని ఎవరూ క్షమించరు" అని కురేషీ అన్నారు.

ఇంకా ఆయన ఇలా చెప్పుకొచ్చారు: "భారత ప్రధాన మంత్రి దగ్గర రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఒకటి, వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాజకీయ ప్రయోజనాలతో మాట్లాడడం. రెండోది, ఒక రాజనీతిజ్ఞుడులా తన దేశంలోని పేదరికం, అభివృద్ధి గురించి ఆలోచించడం. అది శాంతి, ప్రాంతీయ స్థిరత్వం తర్వాతే సాధ్యం అవుతుంది. మీ దగ్గర ఏవైనా ఆధారాలు ఉంటే వాటిని మాతో పంచుకోండి. పాకిస్తాన్ కూడా దాని మీద దర్యాప్తు చేస్తుంది.

పాకిస్తాన్‌ను మీరు ఓడించగలరు అని చెప్పుకోవడం కూడా సరికాదు. ఎందుకంటే, మేం కూడా ఒక దేశం. అల్లా దయతో మేం మమ్మల్ని రక్షించుకోగలం, సమాధానం కూడా ఇవ్వగలం. కానీ, మేం శాంతినే కోరుకుంటున్నాం. గొడవకు రావడం లేదు."

పుల్వామా

ఫొటో సోర్స్, @narendramodi

ప్రాధాన్యం ఇవ్వని విదేశీ మీడియా

సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్-సల్మాన్ ఈరోజున అంటే 16న పాకిస్తాన్ చేరుకోవాల్సి ఉంది. కానీ ఆయన హఠాత్తుగా తన ప్లాన్ మార్చుకున్నారు. ఇప్పుడు ఆయన ఫిబ్రవరి 17న పాకిస్తాన్ రానున్నారు.

"హఠాత్తుగా పర్యటనలో ఒక రోజు తగ్గించడానికి కారణం ఇప్పటివరకూ స్పష్టంగా తెలీలేదు" అని పాకిస్తాన్ వార్తాపత్రిక డాన్ రాసింది. మరోవైపు సౌదీ అరేబియా కూడా పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడిని ఖండించింది.

సౌదీ యువరాజు పర్యటనను పాకిస్తాన్ చరిత్రాత్మకమని చెబుతోంది. ప్రిన్స్ సల్మాన్ ఫిబ్రవరి 19న భారత్ కూడా రానున్నారు. భారత్ సల్మాన్ దగ్గర పాకిస్తాన్ తీవ్రవాద అంశాన్ని ప్రస్తావిస్తుందని భావిస్తున్నారు.

భారత్‌లో జరిగిన దాడికి విదేశీ మీడియా కూడా పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. అమెరికా మీడియా నుంచి యూరప్ వరకూ ఆయా దేశాల మీడియాకు ఇది ఒక చిన్న వార్తలాగే కనిపించింది.

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ కూడా ఈ విషయంపై ఎలాంటి ప్రకటనా చేయలేదు.

ట్రంప్ 26/11 సందర్భంగా చేసిన ట్వీట్‌లో తీవ్రవాదం అంశంలో భారత్‌ వెంట నిలుస్తామని భరోసా ఇచ్చారు. కానీ ఈసారీ ఆయన ఎలాంటి ట్వీట్ చేయలేదు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహు ట్విటర్ ద్వారా తన సంతాపం వ్యక్తం చేశారు. ఈ కఠిన సమయంలో తాము భారత్‌కు అండగా ఉన్నామని తెలిపారు.

ఇరాన్ కూడా ఈ దాడిని తీవ్రంగా ఖండించింది. ఎట్టి పరిస్థితుల్లో ఇలాటి దాడులను సహించమని చెప్పింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)