'కీలెస్ కార్లు'... ఈజీగా కొట్టేస్తున్న దొంగలు... ఈ కార్లను కాపాడుకోవటం ఎలా?

బ్రిటన్‌లో బెస్ట్ సెల్లింగ్ మోడళ్లలో నాలుగైదు కార్లతోపాటు వందలాది పాపులర్ 'కీలెస్' కార్లు దొంగతనాలకు గురయ్యే అవకాశం ఉన్నట్టు ఒక అధ్యయనం అనుమానిస్తోంది.
అవి ఏ కార్లు:
ఫోర్డ్ ఫియెస్టా, ఫోక్స్‌వాగన్ గోల్ఫ్, నిసాన్ కషాకై, ఫోర్డ్ ఫోకస్ లాంటి కార్ల వినియోగదారులందరికీ ఈ చిక్కులు రావచ్చు.
తాళాలు అవసరం లేకుండానే కార్లలోకి ప్రవేశించే సిస్టమ్‌ను బైపాస్ చేయడానికి చాలా మంది దొంగలు టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్టు భావిస్తున్నారు.
కానీ సొసైటీ ఆఫ్ మోటార్ మానుఫ్యాక్చరర్స్ అండ్ ట్రేడర్స్ ప్రతినిధులు మాత్రం కొత్త కార్లు ఎప్పుడూ లేనంత భద్రతతో ఉన్నాయని చెబుతున్నారు.
తాళాలు లేకుండానే కార్ల చోరీల గురించి జనరల్ జర్మన్ ఆటోమొబైల్ క్లబ్(ఏడీఏసీ) నుంచి ఒక అధ్యయనం చేసింది. దాని గణాంకాలను వెల్లడించింది.

ఫొటో సోర్స్, Getty Images
ఈ అధ్యయనం కోసం ఏడీఏసీ తాళాలు అవసరం లేకుండా ఉపయోగిస్తున్న మొత్తం 237 కార్లు పరీక్షించింది. వాటిలో మూడు కార్లపై సందేహాలు వ్యక్తం చేసింది.
ఈ పరిశీలనలో జాగ్వార్ లాండ్ రోవర్ తయారీ డిస్కవరీ లేటెస్ట్ మోడల్స్, రేంజ్ రోవర్, 2018 జాగ్వార్ ఐ-పేస్ కార్లను మరింత సురక్షితంగా ఉండేలా తయారు చేయాలని భావించింది.
బ్రిటన్‌లోని టాప్ సెల్లింగ్ కార్లలో వాక్స్‌హాల్ కోర్సా మాత్రమే సురక్షితమైన కారుగా ఈ అధ్యయనంలో గుర్తించారు. ఎందుకంటే ఆ కారుకు కీలెస్ ఎంట్రీ, కీలెస్ ఇగ్నిషన్ ఉండదు.
"కీలెస్ కార్ల దొంగతనాలు చాలా ఏళ్ల నుంచీ జరుగుతున్నాయి. కానీ తయారీదారులు మాత్రం చోరీకి గురయ్యే ఆ సిస్టమ్‌తో కొత్త మోడల్ కార్లు విడుదల చేస్తూనే ఉన్నారు. అంటే దొంగలు లక్ష్యం చేసుకునేలా మరిన్ని కార్లను ఉత్పత్తి చేస్తున్నారు" అని ఏడీఏసీ తమ ప్రకటనలో తెలిపింది.
'విచ్' అనే మ్యాగజైన్ ఎడిటర్ హారీ రోస్ కార్ల కంపెనీలు "చోరీ కాకుండా వాటిని మరింత సురక్షితంగా తయారు చేయాలని" అన్నారు.

ఎలా దొంగిలిస్తారు?
యజమానులు చేత్తో తాకగానే కారు తలుపులు తెరుచుకోవడం లాంటి 'కీలెస్' ఎంట్రీ సిస్టమ్‌తో వచ్చే కార్ల సంఖ్య పెరుగుతోంది.
కారు తాళం జేబులో ఉన్నప్పుడు యజమానులు అలా చేయగానే కారు తలుపులు తెరుచుకుంటాయి. స్టార్ట్ కూడా అవుతాయి.
అయితే, దొంగలు ప్రత్యేక పరికరాలు ఉపయోగించి ఈ సిస్టమ్‌ను బురిడీ కొట్టిస్తున్నారు. కార్లలోకి ఎక్కి వాటిని తీసుకుని వెళ్లిపోతున్నారు.
కార్ల దొంగలు ఖరీదైన కార్లను నిమిషం లోపే దొంగిలించుకుని వెళ్తున్న వీడియోలు వెలుగుచూశాయి.
కారు చోరీకి ఇద్దరు వస్తారు. ఒకరు కారు పక్కన నిలబడతారు. ఇంట్లో ఉన్న తాళాన్ని గుర్తించేందుకు కారు ఒక సిగ్నల్ పంపిస్తుంది.
దొంగలు ఆ సిగ్నల్‌కు అంతరాయం కలిగించేలా ఒక రిలే బాక్స్ ఉపయోగిస్తారు. ఆ సిగ్నల్ అప్పుడు రెండో బాక్స్‌కు ట్రాన్స్‌ఫర్ అవుతుంది. అది కారును అన్‌లాక్ చేస్తుంది.

కార్లను కాపాడుకోవడం ఎలా?
కార్లను దొంగతనాల నుంచి కాపాడుకోవడానికి వాటిని తాళాలు ఉన్న గ్యారేజీల్లో పెట్టాలని, స్టీరింగ్ వీల్ మొత్తాన్ని కవర్ చేసే స్టీరింగ్ లాక్ ఉపయోగించాలని చెబుతున్నారు.
కార్లలో లేటెస్ట్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ గురించి ఎప్పటికప్పుడు కార్ల డీలర్లకు ఫోన్ చేసి తెలుసుకుంటూ ఉండాలని సూచిస్తున్నారు.
కారు తాళాలను కూడా సిగ్నల్స్‌ను బ్లాక్ చేసేలా మెటల్ షీల్డ్ ఉన్న పౌచ్‌లలో ఉంచాలని చెబుతున్నారు.
మెరుగైన ట్రాకింగ్ సిస్టమ్ కూడా ఉపయోగించాలని సూచిస్తున్నారు.

ఫొటో సోర్స్, iStock
పెరిగిన కార్ల చోరీలు
1990లో కార్ల దొంగతనాలు చాలా తక్కువగా ఉండేవి. కానీ ఇటీవల అవి పెరగడానికి కారణం 'కీలెస్' టెక్నాలజీనే అన్న ఆరోపణలూ వస్తున్నాయి.
2018 మార్చిలో లక్ష కార్లకు పైనే చోరీకి గురైనట్లు ఇంగ్లండ్, వేల్స్ పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయి. 2009 తర్వాత కార్ల దొంగతనాల్లో ఇది అత్యధికం.
కార్లు తయారు చేసే కంపెనీలు ఈ దొంగతనాలను చాలా తీవ్రంగా తీసుకుంటున్నాయని ఎస్ఎంఎంటీ హెడ్ మైక్ హేవ్స్ అన్నారు.
"కొత్త కార్లు ఎప్పుడూ లేనంత సురక్షితంగా ఉన్నాయి. ఆధునిక టెక్నాలజీతో రోడ్లపై జరిగే కార్ల దొంగతనాలను సగటున 0.3 శాతం కంటే తగ్గించడానికి ఈ లేటెస్ట్ టెక్నాలజీ సాయం చేసింది".
"కార్లు దొంగిలించడానికి నేరస్థులు ఎప్పుడూ కొత్త పద్ధతుల కోసం చూస్తుంటారు. అదొక నిరంతర యుద్ధం. అందుకే తయారీదారులు అత్యాధునిక సెక్యూరిటీ ఫీచర్స్ తీసుకురావడానికి వేల కోట్లు పెట్టుబడులు పెడుతున్నారు" అన్నారు.
‘‘అయినా టెక్నాలజీతో మాత్రమే అలా చేయగలరు. నేరస్థులకు కార్లు దొంగిలించడానికి ఉపయోగించే పరికరాలను బహిరంగ మార్కెట్లో అక్రమంగా అమ్మకుండా చర్యలు తీసుకోవాలని మేం కోరుతున్నాం’’ అని మైక్ హేవ్స్ తెలిపారు.
ఇవి కూడా చదవండి.
- T20 క్రికెట్ వరల్డ్ కప్ 2020 షెడ్యూల్ ఇదే
- ప్రజల ఖాతాల్లోకి డబ్బు: ఈ పథకం ఎలా ఉంటుందంటే..
- చిత్రహింసల జైలుగా మారిన హైటెక్ షాపింగ్ మాల్
- అడవిని నేలమట్టం చేస్తున్న బుల్డోజర్ను ప్రతిఘటించిన ఒరాంగుటాన్
- ముంచుకొస్తున్న మృత్యువు నుంచి ఈ మంచమే నన్ను కాపాడింది
- చూసి తీరాల్సిందే: ప్రపంచంలోనే అత్యంత తెలివైన కాకి ఇదేనేమో
- 'ఝాన్సీ రాణి లక్ష్మీబాయిని దొంగ దెబ్బ తీసి చంపారు'
- అమ్మ పాలు... బాటిల్ రూ.250
- ఒక పక్షి తెలుగు గంగ ప్రాజెక్టు ఆపింది.. ఒక సాలీడు 'తెలంగాణ' పేరు పెట్టుకుంది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








