వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, మెసెంజర్‌లను ఏకం చేస్తున్న ఫేస్‌బుక్

ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, మెసెంజర్‌లో తమ మెసేజ్ సేవలను ఒకేసారి అందించాలని ఫేస్‌బుక్ ప్లాన్ చేస్తోంది.
ఈ మూడూ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలు ప్రస్తుతం వేరు వేరు మొబైల్ యాప్స్‌లా పనిచేస్తున్నాయి.
కానీ, ఈ మూడూ ఒక ప్లాట్‌ఫాంలలో ఒకదాని నుంచి ఇంకో దానికి సులభంగా మెసేజ్ పంపించేలా వాటిని అనుసంధానం చేయడానికి చూస్తున్నారు.
ఇది ఒక 'సుదీర్ఘ ప్రక్రియకు ఆరంభం' అని ఫేస్‌బుక్ బీబీసీతో చెప్పింది.
ఫేస్‌బుక్ ప్లాన్ గురించి మొదట న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రచురించింది. ఈ ప్రణాళిక పట్ల కంపెనీ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ ఆసక్తిగా ఉన్నట్లు తెలిపింది.

ఫొటో సోర్స్, Reuters
ఎక్కడి నుంచి ఎక్కడికైనా మెసేజ్
ఈ ప్లాన్ సక్సెస్ అయితే ఫేస్‌బుక్‌లో ఉన్న వ్యక్తి వేరే వారికి వాట్సాప్ సందేశం కూడా పంపించగలుగుతాడు.
ప్రస్తుతం అలా చేయడం అసాధ్యం. ఎందుకంటే ఈ మూడు యాప్స్ వేరువేరుగా పనిచేస్తుంటాయి. వీటికి ఎలాంటి షేరింగ్ గ్రౌండ్ లేదు.
న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం ఈ మూడింటినీ ఒకటిగా తీసుకువచ్చే పని ఇప్పటికే ప్రారంభమైంది.
ఈ ఏడాది చివరికి, లేదా 2020 ప్రారంభంలో దీనిని పూర్తి చేయనున్నారు.
ప్రజల్లో వీటి వినియోగం పెరగడానికి, జనం ఈ ఫ్లాట్‌ఫాంలపై ఎక్కువ సమయం గడిపేలా మార్క్ జుకర్ బర్గ్ ఈ మూడింటినీ ఒక్కటి చేయాలని భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, Reuters
ప్లాన్ ఏమిటి? దాని ప్రాధాన్యం ఏమిటి?
టెక్ వెబ్‌సైట్ ద వర్జ్‌లో మకేనా కెలీ "వేరు వేరు ప్లాట్‌ఫాంపై ఉన్న యూజర్లు అందరినీ ఒక దగ్గరికి తీసుకురావడం వల్ల కంపెనీ మొత్తం యూజర్ల సంఖ్య కూడా పెరుగుతుంది. దానితోపాటు గూగుల్, యాపిల్ మెసేజ్ సేవలతో పోటీపడేందుకు సన్నద్ధం కావచ్చు" అన్నారు.
ఫేస్‌బుక్ ఒక ప్రకటనలో "మా మెసేజ్ సేవల ద్వారా జనం త్వరగా, సులభంగా తమ వ్యక్తిగత గోప్యతను పాటిస్తూనే ఒకరినొకరు సంప్రదించుకునేలా యూజర్స్‌కు మెరుగైన అనుభవం అందించాలని మేం భావిస్తున్నాం" అని తెలిపింది.
"మేం మా మెసేజ్ సేవల్లో ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ కూడా తీసుకొస్తున్నాం. జనం వేరు వేరు ప్లాట్‌ఫాంలపై తమ స్నేహితులు, బంధువులతో టచ్‌లో ఉండేలా చేయడానికి ప్రయత్నిస్తున్నాం" అని కంపెనీ చెబుతోంది.

ఫొటో సోర్స్, EPA
ప్రైవసీని ఎలా కాపాడతారు?
ఈ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది అనే దాని గురించి ప్రస్తుతం వివరంగా చర్చిస్తున్నామని ఫేస్‌బుక్ తెలిపింది.
ఈ మూడు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను ఒకటిగా జోడించడం అనేది ఫేస్‌బుక్‌కు స్వయంగా ఒక భారీ మార్పు అవుతుంది. ఎందుకంటే ఆ కంపెనీ ఇప్పటివరకూ ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్ తమ యూజర్లతో స్వతంత్రంగా పనిచేసుకునేలా ఉంచింది.
న్యూయార్క్ టైమ్స్ కథనంలో "జుకర్ బర్గ్ నిర్ణయంతో కంపెనీ లోపల ఒక ఒత్తిడి లాంటి పరిస్థితి ఏర్పడింది. గత ఏడాది ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ వ్యవస్థాపకులు కంపెనీని వదలడం వెనుక కారణం ఇదే" అని చెప్పారు.
ఫేస్‌బుక్ తన యూజర్స్ డేటా ఉపయోగించడం, దాని రక్షణపై విమర్శలు వెల్లువెత్తుతున్న సమయంలో ఆ కంపెనీ కొత్త ప్లాన్ వెలుగులోకి వచ్చింది. మరోవైపు ఆరోపణలపై దర్యాప్తు కూడా జరుగుతోంది.
కానీ దీన్ని స్థూలంగా చూస్తే యూజర్స్ డేటాను ఒకటిగా అనుసంధానించే ప్లాన్ గురించి రెగ్యులేటరీ మరోసారి ప్రశ్నలు సంధించవచ్చు. యూజర్స్ ప్రైవసీని ఎలా కాపాడతారని కంపెనీని నిలదీయవచ్చు.
బ్రిటన్ సమాచార కమిషనర్ మొదట వాట్సాప్, ఫేస్‌బుక్ తమ యూజర్స్ డేటాను ఏ స్థాయిలో షేర్ చేసుకుంటాయనేదానిపై దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి.
- చిత్రహింసల జైలుగా మారిన హైటెక్ షాపింగ్ మాల్
- అడవిని నేలమట్టం చేస్తున్న బుల్డోజర్ను ప్రతిఘటించిన ఒరాంగుటాన్
- ముంచుకొస్తున్న మృత్యువు నుంచి ఈ మంచమే నన్ను కాపాడింది
- చూసి తీరాల్సిందే: ప్రపంచంలోనే అత్యంత తెలివైన కాకి ఇదేనేమో
- 'ఝాన్సీ రాణి లక్ష్మీబాయిని దొంగ దెబ్బ తీసి చంపారు'
- అమ్మ పాలు... బాటిల్ రూ.250
- ఒక పక్షి తెలుగు గంగ ప్రాజెక్టు ఆపింది.. ఒక సాలీడు 'తెలంగాణ' పేరు పెట్టుకుంది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








