రూపాయిన్నర కోసం.. రైలు పట్టాలపై ప్రాణాలు పణంగా..

వీడియో క్యాప్షన్, రైలు పట్టాలపై పరుగులు పెడుతున్న మనీలా పేదల ట్రాలీలు

మనీలాలో పట్టాలపై రోజూ రైళ్లతోపాటు అనధికారిక ట్రాలీలు కూడా పరుగులు తీస్తుంటాయి.

వీటిపై జనాలను ఎక్కించుకుని చేత్తో నెడుతూ పట్టాలపై పరుగులు తీసే చాలా మంది పేదలకు ఇది జీవనోపాధి.

ప్రాణాలకు తెగించి చేసే ఈ పనికి వీరికి కి.మీ.కు దాదాపు 2 సెంట్లు లభిస్తుంది. అంటే దాదాపు రూ.1.50 వస్తుంది.

అంటే, ఇలా రోజంతా పనిచేస్తే వీరు దాదాపు 10 డాలర్లు సంపాదించగలరు.

ట్రాలీలు నెట్టుకుంటూ వంతెనపై వెళ్తున్నప్పుడు ఎదురుగా హఠాత్తుగా ఏదైనా రైలు వస్తే చాలా ప్రమాదం.

రైలు నుంచి తప్పించడానికి పట్టాల పైనుంచి దూకితే పక్కనే ఉన్న నదిలో పడిపోతారు.

గత ఏడాది ఇలాంటి ప్రమాదాల్లో 9 మంది మృతిచెందారు.

కానీ పట్టాలపై వేగంగా గమ్యాలకు చేరుకోగలమని స్థానికులు ఎక్కువగా వీటిని ఎక్కడానికే మొగ్గుచూపుతున్నారు.

రోజూ కుటుంబం కడుపు నింపడానికి మనీలాలో చాలా మంది పేదలు తప్పనిసరి పరిస్థితుల్లో ట్రాలీ పుష్షర్లుగా మారిపోయారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)