ఇండోనేసియా: రాక్ బ్యాండ్ సెవెంటీన్ ప్రదర్శనను తుడిచిపెట్టేసిన సునామీ.. ''ఆండీ.. త్వరగా రా. నేను ఒంటరిగా ఉన్నాను.. బ్రో, ప్లీజ్...''

ఫొటో సోర్స్, Instagram/Seventeenbandid
ఇండోనేసియాలో తాజా సునామీ సృష్టించిన బీభత్సం గురించిన వివరాలు ఇప్పుడిప్పుడే బయటికొస్తున్నాయి. అత్యంత విషాదాన్ని నింపిన ఈ సునామీ బాధితుల్లో రాక్ బ్యాండ్ సెవెంటీన్ బృంద సభ్యులు కూడా ఉన్నారు. సునామీ వచ్చినప్పుడు ఈ రాక్ బ్యాండ్ బీచ్ వద్ద ఒక తాత్కాలిక గుడారంలో ప్రదర్శన ఇస్తోంది. రాకాసి అలలు ఈ నిర్మాణాన్ని, అందులో ప్రదర్శన ఇస్తున్న వారినీ తుడిచిపెట్టేసింది.
ఇంత భారీ ప్రమాదానికి సంబంధించి ఎలాంటి ముందస్తు హెచ్చరికలూ ఎందుకు లేవు? ప్రస్తుతం ఇండోనేసియాలో చాలామంది వేస్తున్న ప్రశ్న, చర్చించుకుంటున్న అంశం ఇదే. ప్రమాద తీవ్రతను తెలిపే కఠోర నిదర్శనంగా రాక్ బ్యాండ్ ప్రదర్శన సమయంలో ముంచెత్తిన అలల వీడియో నిలిచింది.
ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of Instagram ముగిసింది, 1
సముద్ర తీరం వద్ద వేసిన గుడారంలోని వేదికపై రాక్ బ్యాండ్ సభ్యులు సంగీతం వినిపిస్తున్నారు. కింద టేబుళ్లు, కుర్చీలు వేసి ఉన్నాయి. దాదాపు 200 మంది అక్కడ చేరి సంగీత ప్రదర్శనలో నిమగ్నమైపోయారు. అలాంటి దృశ్యాన్ని ఒక్కసారిగా ఉవ్వెత్తున లేచిన అలలు తుడిచిపెట్టేసిన వీడియో ఫుటేజ్‌లో.. అప్పటి వరకూ సంగీతాన్ని వింటున్న ప్రజలంతా హాహాకారాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది.
ఈ రాక్ బ్యాండ్ బృందంలోని బసిస్ట్, రోడ్ మేనేజర్, గిటారిస్ట్, మరొక సభ్యుడు మృతి చెందారు. బ్యాండ్‌లో డ్రమ్ములు వాయించే సభ్యుడి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు.
బ్యాండ్ బృందంలో సజీవంగా బయటపడి, అందుబాటులో ఉన్న ప్రధాన గాయకుడు రీఫియన్ ఫజర్స్య తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో సంఘటనకు సంబంధించి పెడుతున్న పోస్టులు అందరి హృదయాలనూ కలచివేస్తున్నాయి.
ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of Instagram ముగిసింది, 2
''బనీ (బసిస్ట్), ఒకి విజయ (రోడ్ మేనేజర్)లను మనం కోల్పోయాం'' అని రీఫియన్ ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ ఒక వీడియో పోస్ట్ చేశాడు.
''నా భార్య డేలన్, హర్మాన్ (గిటారిస్ట్), ఆండీ (డ్రమ్మర్), ఉజాంగ్ (బృంద సభ్యుడు) ఆచూకీ త్వరగా లభించాలని దయచేసి ప్రార్థించండి'' అని అతను కోరాడు.
ఒకరోజు తర్వాత మళ్లీ రీఫియన్ ఒక ఫొటోను పోస్ట్ చేశాడు.
హర్మాన్, ఉజాంగ్‌లు చనిపోయారని తెలిపాడు.
''ఆండీ.. త్వరగా రా. నేను ఒంటరిగా ఉన్నాను.. బ్రో, ప్లీజ్...''
ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of Instagram ముగిసింది, 3
రీఫియన్ ఫజర్స్య భార్య డేలన్ సహర ఆచూకీ ఇంకా లభించలేదు.
''ఇవ్వాళ నీ పుట్టినరోజు. నీకు (ఎదురెదురుగా నిలబడి) శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నా. త్వరగా రా డార్లింగ్'' అని సోమవారం ఆయన ఒక పోస్ట్ చేశారు.
సునామీ ఘటనపై రాక్ బ్యాండ్‌లోని ఇతర సభ్యులు కూడా తమ అనుభవాలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు. ఈ బృందలో ఒకరైన జాక్ సునామీ నుంచి ఎలా బయట పడ్డారో ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపారు. స్టేట్ పై భాగానికి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నాని, కెరటాల తాకిడికి అది కూడా నేలమట్టం అయిందని చెప్పారు.
ఇండోనేసియా ర్యాంక్ ప్రపంచంలో సెవెంటీన్ బృందానికి మంచి గుర్తింపు ఉంది. అనేక ప్రసిద్ధ పాటలు ఈ బృందం నుంచి వచ్చాయి.
ఈ బృందం గత శనివారం రాత్రి నుంచి తంజుంగ్ లెసంగ్ బీచ్‌లో ప్రదర్శనలు ఇస్తోంది. పెరుసహన్ లిస్ట్రిక్ నెగరా(పీఎల్‌ఎన్) అనేక కంపెనీ తమ సంస్థలో పనిచేసే 200 మంది ఉద్యోగులు, వారి సన్నిహితులకు న్యూ ఈయర్ పార్టీ ఇచ్చేందుకు ఈ బృందంతో ప్రదర్శనలు ఏర్పాటు చేసింది.
సునామీ ఘటనతో తమ సంస్థకు చెందిన 20 మంది ఉద్యోగులు, వారి బంధువులు చనిపోయాని, మరో 13 మంది గల్లంతు అయ్యారని పీఎల్‌ఎన్ సంస్థ మీడియా సమావేశంలో తెలిపింది.
'సునామీ ముంచెత్తడంతో సముద్రానికి అతి సమీపంలో ఉన్న వేదిక తుడిచిపెట్టుకపోయింది అని బ్యాండ్ బృందం ఒక ప్రకటనలో తెలిపినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది.
ఇవి కూడా చదవండి:
- రాయలసీమ కరవు: అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేసుకుని ఆత్మహత్య చేసుకున్న రైతు కథ
- నిద్రపై నిండు చంద్రుడి ప్రభావం నిజంగా ఉంటుందా?
- ‘గుడిలో కనిపించింది గుడ్లగూబ.. గరుడపక్షి కాదు’
- భారత్ కన్నా పేద దేశమైన చైనా 40 ఏళ్లలో ఎలా ఎదిగింది?
- నీళ్ళ లోపల చూడగలరు, చలికి వణకరు, ఎత్తులంటే ఏమాత్రం భయపడరు...
- వేరుసెనగ పప్పు తింటే చనిపోతారా?
- జీసస్ గురించి ఖురాన్ ఏం చెబుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










