అమెరికా అటార్నీ జనరల్‌ను తొలగించిన డోనల్డ్ ట్రంప్

ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఆ దేశ అటార్నీ జనరల్ జెఫ్ సెషన్స్‌ను ఆ పదవి నుంచి తొలగించారు.

ఒక ట్వీట్ ద్వారా తన నిర్ణయాన్ని చెప్పిన ట్రంప్, సెషన్స్ స్థానంలో తన చీఫ్ ఆఫ్ స్టాఫ్ మాథ్యూ విట్కర్‌ను తాత్కాలికంగా నియమిస్తున్నట్టు తెలిపారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

"అటార్నీ జనరల్ జెఫ్ సెషన్స్ సేవలకు ధన్యవాదాలు. భవిష్యత్తులో ఆయనకు అంతా మంచి జరగాలి" అని ట్రంప్ ట్వీట్ చేశారు.

మరోవైపు అధ్యక్షుడు ట్రంప్ చెప్పడంతో రాజీనామా చేస్తున్నట్టు సెషన్స్ ఒక లేఖలో తెలిపారు.

సెషన్స్ తన లేఖలో "ప్రియమైన అధ్యక్షుడికి, మీరు కోరినట్లు నా రాజీనామాను అందిస్తున్నాను" అని రాశారు.

ట్రంప్‌కు ధన్యవాదాలు తెలిపిన సెషన్స్ "నేను అటార్నీ జనరల్‌గా ఉన్న సమయంలో మనం చట్ట నియమాలను పునరుద్ధరించడం చాలా కీలకంగా భావిస్తున్నాను" అన్నారు.

ఉన్నతాధికారి జెఫ్ సెషన్స్‌పై అధ్యక్షుడు ట్రంప్ విశ్వాసం కోల్పోయారు.

అమెరికా ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందనే ఆరోపణలపై దర్యాప్తు నుంచి గత ఏడాది సెషన్స్ స్వయంగా వైదొలిగారు.

ఆ తర్వాత నుంచి ఆయన డిప్యూటీ రోడ్ రోసెస్టైన్‌ దీనిని రాజకీయంగా చాలా ముఖ్యమైన దర్యాప్తుగా చూస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)