వీళ్లిద్దరూ ఒకప్పుడు శరణార్థులు.. ఇప్పుడు అమెరికా కాంగ్రెస్‌కు ఎన్నికైన మొట్టమొదటి ముస్లిం మహిళలు

ఇల్హాన్ ఒమర్, రషీదా తలీబ్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఇల్హాన్ ఒమర్, రషీదా తలీబ్

ఈ మధ్యంతర ఎన్నికల్లో ఇద్దరు ముస్లిం మహిళలు మొట్టమొదటిసారిగా అమెరికా కాంగ్రెస్‌కు ఎన్నికయ్యారు.

ఇల్హాన్ ఒమర్, రషీదా తలీబ్‌లు ఇద్దరూ డెమోక్రటిక్ పార్టీకి చెందిన వారు.

ఎన్నికల్లో గెలిచిన అనంతరం ఇల్హాన్ ఒమర్ రషీదాకు ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

గత కొంత కాలంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శరణార్థుల విషయంలో అనుసరిస్తున్న విధానాలపై తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో.. ఈ ఇద్దరు ముస్లిం మహిళలూ కాంగ్రెస్‌కు ఎన్నిక కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఇది ట్రంప్ ముస్లిం వ్యతిరేక ప్రకటనలకు ప్రతిస్పందనగా విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇల్హాన్, రషీదాల గురించి మరికొన్ని వివరాలు..

ఇల్హాన్ ఒమర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇల్హాన్ ఒమర్

ఇల్హాన్ ఒమర్ ఎవరు?

ఇల్హాన్ ఒమర్ ఇప్పటికే మిన్నెసోటా హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్‌కు ఎన్నికైన మొదటి మహిళగా రికార్డు సృష్టించారు.

ఇల్హాన్ గత ఆగస్టులో డెమోక్రాట్ ప్రతినిధి కీల్ ఎలిసన్ స్థానంలో తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసుకున్నారు.

అందరికీ వైద్యసదుపాయాలు, క్రిమినల్ జస్టిస్‌లో సంస్కరణలు, కనీస వేతనాల కోసం ఆమె పోరాడుతున్నారు.

మధ్యంతర ఎన్నికల్లో ఆమె రిపబ్లికన్ అభ్యర్థి జెన్నిఫర్ జైలిన్‌స్కీపై విజయం సాధించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

టైమ్ పత్రిక ప్రకారం, ఆమె 12 ఏళ్ల వయసులో శరణార్థిగా అమెరికాకు వచ్చారు.

ఒక ఇంటర్వ్యూలో ఇల్హాన్, ''రాజకీయ కార్యకలాపాలంటే నాకు జయాపజయాలు కాదు. నేను మార్పును ఇష్టపడతాను'' అన్నారు.

ఇల్హాన్ విజయంతో ఆమె మద్దతుదారుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

రషీదా తలీబ్‌

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, రషీదా తలీబ్‌

రషీదా తలీబ్ ఎవరు?

42 ఏళ్ల రషీదా తలీబ్ కూడా ఇల్హాన్‌లాగే ఒక శరణార్థి.

రషీదా తండ్రి పాలస్తీనా నుంచి అమెరికాకు వచ్చారు.

డెమోక్రట్ అభ్యర్థి బ్రెండా జోన్స్‌ను ప్రైమరీ ఎన్నికలలో ఓడించినప్పుడు మధ్యంతర ఎన్నికలకు ఆమె అభ్యర్థిత్వం ఖరారైంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

2008లో మిషిగాన్ లెజిస్లేచర్ ఎన్నికల్లో గెలిచినపుడే రషీదా చరిత్ర సృష్టించారు. మిషిగాన్ లెజిస్లేచర్‌కు ఎన్నికైన మొదటి ముస్లిం మహిళ ఆమే.

కార్మికుల కనీసవేతనాన్ని వేయి రూపాయలు చేయాలన్నది ఆమె ప్రధాన డిమాండ్. సామాజిక భద్రత, అందరికీ వైద్య సదుపాయాల కోసం ఆమె పోరాడుతున్నారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.