ట్రంప్ హెచ్చరిక: 'వ్యాపారానికి అమెరికా కావాలో, ఇరాన్ కావాలో తేల్చుకోండి'

ఫొటో సోర్స్, Getty Images
ఇరాన్‌తో వ్యాపారం చేసే దేశాలకు, సంస్థలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గట్టి హెచ్చరిక చేశారు. ''ఇరాన్‌తో వ్యాపారం చేస్తుంటే అమెరికాతో వ్యాపారం చేయలేరు'' అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇరాన్‌తో అణు ఒప్పందం నుంచి అమెరికా మేలో వైదొలగినప్పుడు తిరిగి విధించిన ఆంక్షల్లో కొన్ని భారత కాలమానం ప్రకారం మంగళవారం అమల్లోకి వచ్చాయి. ఈ మేరకు ట్రంప్ ఒక కార్యనిర్వాహక ఉత్తర్వును జారీ చేశారు.
చమురు ఎగుమతులకు సంబంధించిన కఠినమైన ఆంక్షలు నవంబరు 5న అమల్లోకి వస్తాయి. అవి ఇరాన్ ఇంధన, నౌకారవాణా రంగాలపైన, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇరాన్‌తో విదేశీ ఆర్థిక సంస్థల లావాదేవీలు, పెట్రోలియం ట్రేడింగ్‌పైన ప్రభావం చూపిస్తాయి.

ఫొటో సోర్స్, AFP
నేను కోరేది ప్రపంచ శాంతే: ట్రంప్
ఆంక్షలు నవంబరులో తీవ్రస్థాయికి చేరతాయని ట్రంప్ మంగళవారం ఒక ట్వీట్‌లో స్పష్టం చేశారు. తాను కోరేది ప్రపంచ శాంతేనని, అంతకుమించి ఏమీ కాదని తెలిపారు.
ప్రపంచాన్ని అస్థిరపరిచే తన వైఖరిని మార్చుకొని అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం కావాలా, లేదా అనేది ఇరాన్ నిర్ణయించుకోవాల్సి ఉందని ట్రంప్ చెప్పారు.
ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమం, ఉగ్రవాదానికి ఇరాన్ తోడ్పాటు, ఇరాన్ ఇతర దుష్టచేష్టలు అన్నింటినీ పరిగణనలోకి తీసుకొని మరింత సమగ్ర అణు ఒప్పందం కుదుర్చుకొనేందుకు తాను సిద్ధమని తెలిపారు.
అమల్లోకొచ్చిన ఆంక్షలు ఇవీ...
- అమెరికా కరెన్సీని ఇరాన్ సేకరించకుండా అడ్డుకోవడం
- బంగారం, ఇతర విలువైన లోహాల వాణిజ్యంలో ఇరాన్‌పై పరిమితులు
- ఇరాన్ కరెన్సీ 'రియాల్'కు సంబంధించిన లావాదేవీలపై నియంత్రణ
- ఇరాన్ ఆటోమోటివ్ రంగంపై ఆంక్షలు

ఫొటో సోర్స్, AFP PHOTO / HO / IRANIAN PRESIDENCY
ఇదో మానసిక యుద్ధం: ఇరాన్ అధ్యక్షుడు రౌహానీ
ఆంక్షల విధింపును ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ ఖండించారు. దౌత్యం నెరపేందుకు అమెరికా ప్రభుత్వం నిరాకరించిందని తప్పుబట్టారు.
ఆంక్షల విధింపు ఇరాన్ ప్రజల్లో విభజన తీసుకొచ్చేందుకు చేపట్టిన 'మానసిక యుద్ధం' అని ఆయన నిందించారు.
ఒకవైపు ఆంక్షలు విధించి, మరోవైపు చర్చలు జరపడంలో అర్థం లేదని రౌహానీ వ్యాఖ్యానించారు. దౌత్యం, చర్చల పట్ల తాము ఎప్పుడూ మొగ్గు చూపుతూనే ఉన్నామని, కానీ అవతలి పక్షానికి నిజాయతీ లేదని విమర్శించారు.
అమెరికాలో నవంబరులో జరిగే మిడ్-టర్మ్ ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకు ట్రంప్ ప్రభుత్వం ఇరాన్ అంశాన్ని వాడుకొంటోందని ఆరోపించారు.
ఐరోపా దేశాల 'రక్షణ' చర్యలు
అంతర్జాతీయ భద్రతకు ఇరాన్ అణు ఒప్పందం కీలకమని చెబుతూ జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్ విదేశీ వ్యవహారాల మంత్రులు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఇరాన్‌తో వ్యాపారం చేసే యూరోపియన్ కంపెనీలకు అమెరికా ఆంక్షల ప్రభావం నుంచి రక్షణ కల్పించేందుకు ఉద్దేశించిన చట్టాన్ని ఈ మూడు దేశాలు అమల్లోకి తెచ్చాయి.
ఆంక్షల నుంచి ఇరాన్‌లో వ్యాపారం చేసే ఐరోపా కంపెనీలకు మినహాయింపు ఇవ్వాలని జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్ మంత్రులు జూన్‌లో కోరగా, తర్వాత అమెరికా తోసిపుచ్చింది.

ఫొటో సోర్స్, ATTA KENARE/AFP/Getty Images
బలహీనంగా ఇరాన్ ఆర్థిక వ్యవస్థ
ఇరాన్ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం బలహీన స్థితిలో ఉంది. ఆర్థిక స్థితి దిగజారడంతో ఆహార పదార్థాల ధరలు పెరుగుతున్నాయి. నిరుద్యోగిత ఎక్కువవుతోంది. ఈ అంశాలపై నిరుడు డిసెంబరు నుంచే నిరసనలు జరుగుతున్నాయి. జూన్‌లో రాజధాని టెహ్రాన్‌లో 2012 తర్వాత ఎన్నడూ లేనంత పెద్దయెత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి.
సగానికి పడిపోయిన 'రియాల్' విలువ
అణు ఒప్పందం నుంచి తప్పుకొంటున్నామని ట్రంప్ ప్రకటించినప్పటి నుంచి ఇప్పటివరకు ఇరాన్ కరెన్సీ రియాల్ విలువ దాదాపు సగానికి క్షీణించింది. రియాల్ పతనాన్ని నిలువరించేందుకు విదేశీ మారకద్రవ్య నిబంధనలను ఇరాన్ సరళీకరిస్తోంది. ఫలితంగా ఈ నెల్లో రియాల్ విలువలో స్థిరత్వం వచ్చింది.

ఫొటో సోర్స్, AFP/GETTY IMAGES
చమురు ఎగుమతులు పడిపోతాయా?
ఇరాన్ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా చమురు ఎగుమతులపై ఆధారపడి ఉంది. అంతర్జాతీయ ఆంక్షలు అమల్లో ఉన్నప్పుడు చమురు ఎగుమతులు తగ్గడంతో దేశ ఆర్థిక వ్యవస్థ డీలా పడింది. 2015లో అణు ఒప్పందం కుదిరాక ఆంక్షలను తొలగించడంతో మళ్లీ ఎగుమతులు పుంజుకున్నాయి.
చమురు ఎగుమతులు రోజుకు దాదాపు 20 లక్షల బ్యారెళ్లు కాగా, నవంబరు 5న కొత్త ఆంక్షలు అమల్లోకి వస్తే చమురు ఎగుమతులు దాదాపు సగానికి పడిపోయే అవకాశముంది. ఆ పరిస్థితులే ఏర్పడితే తమ చమురు రంగాన్ని కాపాడుకొనేందుకు ఇరాన్.. చైనా, రష్యాల సాయం తీసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి:
- కరుణానిధి: సీఎంలకు పంద్రాగస్టున జెండా ఎగరేసే హక్కు ఈయన వల్లే దక్కింది
- జాతీయగీతానికి మదనపల్లెకూ ఉన్న సంబంధమిది
- ట్రంప్: 'అణు నిరాయుధీకరణతోనే ఆంక్షల ఎత్తివేత’
- అప్పుడు బంగారం వేట.. ఇప్పుడు కోబాల్ట్ రష్
- చైనాలోని ఈ ఒక్క గ్రామం ఎకానమీ సింగపూర్‌తో సమానం
- ఘోస్ట్ ఐలాండ్: 'మానవజాతి అంతమైపోయాక భూమి ఇలాగే ఉండొచ్చు'
- టోక్యో ఒలింపిక్స్: కాలాన్ని ముందుకు జరపడంపై జపాన్‌లో చర్చ
- ఈదీ అమీన్: మనిషి రక్తం తాగిన నియంత
- రాయలసీమలో ‘రత్నాల’ వేట
- తొలకరి జల్లుల్లో మట్టి వాసనకు కారణం ఇదే
- BBC Learning English తెలుగులో...
- హిందూమతం అంటే ఏమిటి? చరిత్ర ఏం చెప్తోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








