మీడియా అంటే చిర్రెత్తిపోతున్న ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images
మీడియాను "అమెరికా ప్రజల శత్రువు" అంటూ మరోసారి తీవ్రంగా వ్యాఖ్యానించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ మాట సమస్యాత్మకం అనుకుంటే దాన్ని పరిష్కరించుకోవాల్సింది మీడియాయే కానీ తాను కాదని ఆయన ఆదివారం ఒక ట్వీట్ చేశారు.
గత ఏడాది డొనాల్డ్ ట్రంప్ తొలిసారి మీడియాను 'ప్రజల శత్రువు'గా అభివర్ణించినప్పుడు అక్కడ ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి.
ఆరిజోనా సెనేటర్, రిపబ్లికన్ నేత అయిన జెఫ్ ఫ్లేక్ అప్పట్లో దీనిపై స్పందిస్తూ ఇంతకుముందెన్నడూ లేని రీతిలో శ్వేతసౌధం మీడియాపై దాడి చేస్తోందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ట్రంప్ ఆ తరువాత మరో మూడుసార్లు మీడియా విషయంలో అదే పదాన్ని ప్రయోగించారు.
మీడియాపై ట్రంప్ పదేపదే చేస్తున్న వ్యాఖ్యలు ప్రసార మాధ్యమాల్లో పతాక శీర్షికలుగా రానప్పటికీ పాత్రికేయుల్లో మాత్రం నాటుకుపోయాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఇలా అయితే ప్రమాదమే
న్యూయార్క్ టైమ్స్ పబ్లిషర్ ఎ.జి. సుల్జ్ బెర్గర్ కొద్దిరోజుల కిందట ట్రంప్‌తో సమావేశమైనప్పుడు, మీడియాపై ఆయనకున్న దురభిప్రాయాలను తొలగించాలనుకున్నారు. ట్రంప్ మాటలు హింసకు దారితీసే ప్రమాదముందని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు.
కానీ, ట్రంప్ మరోసారి మీడియాపై తన వైఖరిని చాటారు. ఆదివారం ఉదయం చేసిన ట్వీట్‌లో ఆయన మీడియా పొరపాటు వల్లే తాను వారికి 'అమెరికా ప్రజల శత్రువు' అని ముద్ర వేశానన్నారు.
ఒకవేళ ఈ మాట సమస్యాత్మకం అనుకుంటే దాన్ని పరిష్కరించుకోవాల్సింది మీడియాయేనని వ్యాఖ్యానించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఎంతవరకు ఉపయోగపడుతుంది?
అమెరికా ఎన్నికల్లో రష్యా జోక్యం విషయంలో రాబర్ట్ మ్యూలర్ దర్యాప్తునకు సంబంధించి న్యూయార్క్ టైమ్స్ రాసిన కథనాలకు స్పష్టమైన ఆధారాలు లేవంటూ ఆయన ట్వీట్ చేశారు.
ట్రంప్ పాలనపై న్యూయార్క్ టైమ్స్ కథనాలు ప్రచురించినప్పుడు వాటిని ఆయన ఫేక్ న్యూస్ అంటూ కొట్టి పారేస్తున్నారు.
మీడియాలో వచ్చే కథనాలు తనకు అనుకూలంగా, తన ప్రత్యర్థులకు ప్రతికూలంగా ఉండాలని ట్రంప్ కోరుకుంటారు. ఆ లక్ష్యం నెరవేర్చుకోవడం కోసం ఆయన ఇలా 'ఫేక్ న్యూస్', 'ప్రజా వ్యతిరేకులు' అంటూ విమర్శలు చేస్తూ ఒత్తిడి చేస్తుంటారు.
ఇటీవలి సీబీఎస్ న్యూస్ పోల్ ప్రకారం.. ట్రంప్ "బలమైన మద్దతుదారుల్లో" 91 శాతం మంది కచ్చితమైన సమాచారం కోసం తాము ట్రంప్‌ను నమ్ముతామని చెప్పగా 11 శాతం మంది మాత్రమే మీడియాను విశ్వసిస్తామని చెప్పారు. మొత్తంగా, 63 శాతం మంది తాము తమ "మిత్రులు, కుటుంబ సభ్యులను" నమ్ముతామని తెలిపారు.
మీడియాపై ట్రంప్ మాటల దాడికి దిగడం ఆయనకు కొంత మద్దతు తెచ్చిపెట్టింది.
అయితే, ఇలాంటి మద్దతు ఆయనకు 2020 అధ్యక్ష ఎన్నికల్లో తిరిగి పీఠమెక్కించడానికి తోడ్పడుతుందా లేదా అన్నదే ప్రశ్న.
ఇవి కూడా చూడండి:
- ఉత్తర కొరియాపై ప్రయాణ నిషేధాజ్ఞలు జారీ చేసిన అమెరికా
- అమెరికా-మెక్సికో సరిహద్దు గోడకు సంబంధించి 4 ప్రోటోటైప్‌లు
- ‘తెలుగు రాష్ట్రాల్లో రైతుల ఆత్మహత్యలు తగ్గాయి’ కానీ..
- ఊళ్లలో కుల వివక్షకు పేపర్ కప్పుకు సంబంధమేంటి-
- అభిప్రాయం: గ్రామీణ భారతంలో చట్టానికన్నా కులానిదే ఆధిపత్యం!
- తాగునీరు అందని గ్రామాలు.. ఆంధ్రాలో మూడోవంతు, తెలంగాణలో సగం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








