ఇథియోపియాలో పాస్టర్‌ను చంపిన మొసలి

మొసలి

ఫొటో సోర్స్, Getty Images

దక్షిణ ఇథియోపియాలోని ఒక సరస్సు వద్ద పాస్టర్‌ను ఒక మొసలి చంపేసింది.

మెర్కెబ్ తబ్యా జిల్లాలోని అర్బా మింక్ పట్టణంలోని అబయ సరస్సు వద్ద 80 మందికి ఆదివారం ఉదయం పాస్టర్ డొకొ ఎషెటె క్రైస్తవ మతాన్ని ప్రసాదించే కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

సరస్సులో ఉన్న ఒక మొసలి పైకెగిరి పాస్టర్‌పై దాడి చేసిందని స్థానికులు, పోలీసులు బీబీసీ అమ్హరిక్‌కు తెలిపారు.

రెండు కాళ్లు, వీపు, చేతులను మొసలి కరవటంతో పాస్టర్ డొకొ మృతి చెందారు.

ఇథియోపియా మ్యాప్

‘‘ఆయన (పాస్టర్) ఒక వ్యక్తికి క్రైస్తవ మతాన్ని ప్రసాదించి, రెండో వ్యక్తి వద్దకు వెళ్లారు. ఉన్నట్టుండి, ఒక మొసలి సరస్సులోంచి పైకెగిరి ఆయన్ను నోటకరుచుకుంది’’ అని స్థానిక వ్యక్తి కెటెమ కైరో బీబీసీకి చెప్పారు.

స్థానికులు, మత్స్యకారులు పాస్టర్‌ను కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నించారని, అయినా డొకొను కాపాడలేకపోయారని స్థానిక పోలీసు ఇవ్నెటు కన్కొ చెప్పారు.

అయితే, పాస్టర్ శరీరాన్ని మొసలి సరస్సులోకి లాక్కుపోకుండా వాళ్లు చేపలు పట్టే వలల్ని ఉపయోగించారు.

కాగా, దాడి చేసిన మొసలి మాత్రం తప్పించుకుంది.

వీడియో క్యాప్షన్, వీడియో: ఒడిశాలోని కేంద్రపరా వాసుల జీవితం దినదిన గండం

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)