సీజేఐపై అభిశంసన తీర్మానం తిరస్కరణ!

ఫొటో సోర్స్, Getty Images
కాంగ్రెస్ నేతృత్వంలో పలు పార్టీలు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిపై ఇచ్చిన అభిశంసన తీర్మానాన్ని రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు తిరస్కరించారు.
ఈ మేరకు ఆయన పది పేజీల ఆర్డర్‌ను విడుదల చేశారు.
అభిశంసన తీర్మానం అందాక తాను చేపట్టిన చర్యలు వివరించిన వెంకయ్యనాయుడు చివరకు ఆ తీర్మానాన్ని తిరస్కరిస్తున్నానని ఈ ఆర్డర్‌లో పేర్కొన్నారు.
దీంతో ఈ అభిశంసన తీర్మానంపై కాంగ్రెస్ సుప్రీం కోర్టుకు వెళ్లాలని యోచిస్తోంది.
కాంగ్రెస్ నేతృత్వంలో ఏడు పార్టీలు జస్టిస్ దీపక్ మిశ్రాపై అభిశంసన తీర్మానాన్ని ఇచ్చాయి.
దీనిపై వెంకయ్యనాయుడు ఒక కమిటీ వేశారు.
ఆ కమిటీ ఇచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకుని ఈ తీర్మానాన్ని తిరస్కరించారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








