#CWG2018: ఒకే ఈవెంట్‌లో రెండు పతకాలు

ఫొటో సోర్స్, Insta/manubakar
కామన్వెల్త్ క్రీడల్లో ఆదివారం భారత క్రీడాకారులు పతకాల పంట పండిస్తున్నారు.
12.10 : వెయిట్ లిఫ్టింగ్ 94 కిలోల పురుషుల విభాగంలో కాంస్యం సాధించిన వికాస్ థాకూర్. క్లీన్ అండ్ జర్క్ మొదటి ప్రయత్నంలో 192 కిలోల బరువు ఎత్తిన థాకూర్.
మొదట రజతం సాధించే పరిస్థితిలో ఉన్న థాకూర్ తర్వాత మూడో స్థానానికి పడిపోయారు. ఇతను స్నాచ్, క్లీన్ అండ్ జర్క్ రెండు విభాగాల్లో కలిపి 351 కిలోల బరువు ఎత్తాడు.
11.49 : వెయిట్ లిఫ్టింగ్ 94 కిలోల పురుషుల విభాగంలో రజతానికి చేరువైన వికాస్ థాకూర్. క్లీన్ అండ్ జర్క్ మొదటి ప్రయత్నంలో 192 కిలోల బరువు ఎత్తిన థాకూర్
11.00 : వెయిట్ లిఫ్టింగ్ 94 కిలోల పురుషుల విభాగంలో రజతానికి చేరువైన వికాస్ థాకూర్.
09.32 : పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో రవికుమార్ కాంస్య పతకం సాధించారు. దీంతో భారత్ సాధించిన పతకాల సంఖ్య 10కి చేరింది.
భారత్ పతకాలు:మొత్తం:11స్వర్ణం :6, రజతం: 2 కాంస్యం : 3
కామన్వెల్త్ క్రీడల్లో ఈ రోజు మొదట పూనం యాదవ్ వెయిట్ లిఫ్టింగ్‌లో గోల్డ్ సాధించగా.. మనూ బకర్ షూటింగ్‌లో బంగారు పతకం సాధించింది.
16 ఏళ్ల మనూ.. రెండేళ్ల కిందటి వరకూ పిస్టల్ కూడా తాకలేదు. అలాంటిది తాజాగా జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో గోల్డ్ సాధించింది.
ఈమె తర్వాతి స్థానంలో భారత్‌కే చెందిన హీనా సిద్ధూ నిలిచింది.

ఫొటో సోర్స్, Reuters
ఇదే పోటీలో ఈమె రజతం సాధించింది. దీంతో భారత్‌కు ఒకే ఈవెంట్‌లో రెండు ప తకాలు వచ్చినట్టయింది.
భారత్ తరఫున వెయిట్ లిఫ్టింగ్‌లో ఇప్పటి వరకు మీరాబాయ్ చాను, సంజితా చాను, సతీశ్ కుమార్ శివలింగం, రాగాల వెంకట రాహుల్, పూనం యాదవ్‌లు బంగారు పతకాలను సాధించారు.
పూనం యాదవ్ 122 కిలోల బరువు ఎత్తి భారత్‌కు అయిదో స్వర్ణాన్ని అందించింది.
మహిళల 69 కిలోల విభాగంలో ఈమె బంగారు పతకం సాధించింది.

ఫొటో సోర్స్, Reuters
భారత్‌కు ఇప్పటి వరకు ఆరు బంగారు పతకాలు వచ్చాయి. వీటిలో అయిదు వెయిట్ లిఫ్టింగ్‌లోనే రావడం గమనార్హం.
వీటితో పాటు రెండు రజతాలు, ఓ కాంస్య పతకాన్ని కూడా భారత్ సాధించింది.
ఇంతకు ముందు తెలుగబ్బాయి రాగాల వెంకట రాహుల్ కూడా వెయిట్ లిఫ్టింగ్‌లోనే బంగారు పతకం సాధించాడు.
మొత్తానికి ఆరు స్వర్ణాలు.. రెండు రజతాలు.. ఒక కాంస్యంతో పతకాల పట్టికలో భారత్ మూడో స్థానంలో ఉంది.
ఇవి కూడా చూడండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








