#Cwg2018: పూనమ్ యాదవ్‌కి గోల్డ్

ఫొటో సోర్స్, Reuters
కామన్వెల్త్ క్రీడల వెయిట్ లిఫ్టింగ్‌లో భారత్‌కు మరో స్వర్ణం. పూనం యాదవ్ 122 కిలోల బరువు ఎత్తి భారత్‌కు అయిదో స్వర్ణాన్ని అందించారు.
మహిళల 69 కిలోల విభాగంలో ఈమె బంగారు పతకం సాధించారు.
భారత్‌కు ఇప్పటి వరకు అయిదు బంగారు పతకాలు వచ్చాయి. ఇవన్నీ వెయిట్ లిఫ్టింగ్‌లోనే రావడం గమనార్హం.
వీటితో పాటు ఓ రజతం, ఓ కాంస్య పతకాలను కూడా భారత్ సాధించింది.
ఇంతకు ముందు తెలుగబ్బాయి రాగాల వెంకట రాహుల్ కూడా వెయిట్ లిఫ్టింగ్‌లోనే బంగారు పతకం సాధించాడు.
భారత్ తరఫున వెయిట్ లిఫ్టింగ్‌లో ఇప్పటి వరకు మీరాబాయ్ చాను, సంజితా చాను, సతీశ్ కుమార్ శివలింగం, రాగాల వెంకట రాహుల్ బంగారు పతకాలను సాధించారు.
ఇప్పుడు పూనం యాదవ్ కూడా వీరి సరసన చేరారు.
ఈమె స్నాచ్‌లో 100 కిలోలు.. క్లీన్ అండ్ జెర్క్‌లో 122 కిలోలు మొత్తం 222 కిలోల బరువు ఎత్తారు.
వారణాసికి చెందిన 22 ఏళ్ల పూనం యాదవ్ 2014లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో కాంస్య పతకం సాధించారు.
తాజా పోటీలో పూనం తర్వాతి స్థానంలో ఇంగ్లండ్‌కు చెందిన సారా డేవిస్ నిలిచారు. ఈమె 217 కిలోల బరువు ఎత్తారు.
ఇవి కూడా చూడండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








