ముంబయి: అప్రెంటీస్ విద్యార్థుల ఆందోళనతో నిలిచిపోయిన రైళ్లు

ముంబై, రైల్వే, అప్రెంటిస్ విద్యార్థులు

ఫొటో సోర్స్, Sharad Badhe/BBC

ఫొటో క్యాప్షన్, ట్రాక్‌పై బైఠాయించిన అప్రెంటీస్ విద్యార్థులు

ముంబయిలో అప్రెంటీస్ విద్యార్థులు లోకల్ రైళ్లను అడ్డుకోవడంతో రైల్వే సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది.

విద్యార్థులు ఉదయం 7 గంటలకు దాదర్ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై బైఠాయించారు.

విద్యార్థులు బైఠాయించిన సమయం అత్యంత రద్దీగా ఉండే సమయం కావడంతో సబర్బన్ రైలు సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సబర్బన్ రైళ్లతో పాటు పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లూ నిలిచిపోయాయి.

దీంతో విద్యార్థులను ట్రాక్ నుంచి తొలగించడానికి పోలీసులు వారిపై లాఠీఛార్జి చేశారు.

ముంబై, రైల్వే, అప్రెంటిస్ విద్యార్థులు

ఫొటో సోర్స్, Sharad Badhe/BBC

తాము చాలా ఏళ్లుగా రైల్వేలో అప్రెంటీస్‌లుగా చేస్తున్నా తమను రిక్రూట్ చేసుకోలేదని విద్యార్థులు అంటున్నారు.

ఇప్పటివరకు అప్రెంటీస్ పూర్తి చేసిన వారంతా గ్రూప్ డి పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండేదని విద్యార్థులు అంటున్నారు. అయితే ప్రస్తుత నోటిఫికేషన్‌లో అప్రెంటీస్ చేసిన వారిలో కేవలం 20 శాతం మంది మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.

ఈ నిబంధన ఎత్తివేసి, మొత్తం అందరూ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

విద్యార్థుల ఆందోళనపై రైల్వే మంత్రి పీయూష్ గోయల్.. చట్ట ప్రకారమే 20 శాతం పోస్టులను అప్రెంటీస్ అభ్యర్థులతో భర్తీ చేస్తున్నామని తెలిపారు.

దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 31 వరకు అవకాశం ఉందని, ఆలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)