రష్యా ఎన్నికలు: ఉచిత భోజనం.. బంపర్ ఆఫర్లు

ఫొటో సోర్స్, Getty Images
రష్యాకు వ్లాదిమిర్ పుతిన్ మరో ఆరేళ్లు నేతృత్వం వహించనున్నారు. ఊహించినట్లుగానే దేశాధ్యక్ష ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు.
దాదాపు అన్ని బ్యాలెట్ల లెక్కింపు పూర్తయ్యిందని, పుతిన్‌కు 76 శాతం ఓట్లు లభించాయని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.
పుతిన్‌పై పోటికి దిగిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నావల్నీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించారు.
‘‘గత కొన్నేళ్లుగా సాధించిన విజయాలను గుర్తించారు’’ అని ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పుతిన్ అన్నారు. మాస్కోలో జరిగిన ఒక ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.
మరో ఆరేళ్లు రష్యా అధ్యక్షుడిగా వ్యవహరించనున్నారు కదా! అంటూ విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు ఆయన బిగ్గరగా నవ్వేశారు.
‘‘మీరంటోంది హాస్యాస్పదంగా ఉంది. వందేళ్లపాటు నేను ఇక్కడే ఉంటానని మీరనుకుంటున్నారా? నో!’’ అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Reuters
‘ఈ మెజార్టీ పుతిన్‌కు అవసరం’
2012లో పుతిన్‌కు 64 శాతం ఓట్లు లభించగా, ఇప్పుడు అంతా ఊహించినట్లుగానే భారీగా పెరిగింది.
పుతిన్ సమీప ప్రత్యర్థి.. ధనవంతుడు, వామపక్ష నాయకుడు పావెల్ గ్రుడినిన్‌కు 12 శాతం ఓట్లు దక్కాయి.
అధ్యక్ష పదవికి పోటీపడిన రియాలిటీ టీవీ వ్యాఖ్యాతగా పనిచేసిన క్సెనియా సోబ్చాక్‌కు 2 శాతం, జాతీయవాది వ్లాదిమిర్ జిరినోవ్‌స్కీకు 6 శాతం ఓట్లు లభించాయి.
కాగా, పుతిన్‌ది ‘అత్యద్భుత విజయం’ అని ఆయన ప్రచార బృందం ప్రకటించింది.
‘‘ఈ మెజార్టీయే అన్నీ చెబుతోంది. భవిష్యత్ నిర్ణయాలకు అవసరమైన అధికారాన్ని ఇచ్చింది. పుతిన్ చాలా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ మెజార్టీ ఆయనకు అవసరం’’ అని ప్రచార బృంద అధికార ప్రతినిధి ఒకరు రష్యా ప్రైవేటు వార్తా సంస్థ ఇంటర్‌ఫ్యాక్స్‌తో అన్నారు.

ఫొటో సోర్స్, Reuters
ఎన్నికల ‘చిత్రాలు’
కాగా, కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ స్టేషన్ల సమీపంలో ఉచితంగా భోజనం, స్థానిక దుకాణాల్లో రాయితీలు కల్పించారు.
రష్యా వ్యాప్తంగా పలు పట్టణాలు, నగరాల్లోని పోలింగ్ స్టేషన్లలో అక్రమాలు జరుగుతున్నాయని వీడియోల్లో కనిపించింది. పలు వీడియోల్లో ఎన్నికల అధికారులు బ్యాలెట్ పేపర్లతో బాక్సుల్ని నింపుతున్న దృశ్యాలు కనిపించాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
పోలింగ్ రోజున వందలాది అక్రమాలు జరిగాయని స్వతంత్ర ఎన్నికల పర్యవేక్షణ బృందం గోలోస్ తెలిపింది.
- పోలింగ్ ప్రారంభం అయ్యేప్పటికే బ్యాలెట్ బాక్సుల్లో ఓటింగ్ పేపర్లు కనిపించాయి
- కొన్ని పోలింగ్ స్టేషన్లలోకి ప్రవేశించకుండా పర్యవేక్షకుల్ని అడ్డుకున్నారు
- బలవంతంగా ఓట్లు వేయిస్తున్నారనే అనుమానాల నేపథ్యంలో కొందరు ఓటర్లను బస్సుల్లోకి ఎక్కించారు
- పోలింగ్ స్టేషన్లలోని వెబ్ కెమెరాలకు బెలూన్లు మొదలైనవి అడ్డు తగిలాయి
అయితే, కేంద్ర ఎన్నికల సంఘం అధిపతి ఎల్ల పంఫిలోవా మాట్లాడుతూ.. తీవ్రమైన ఉల్లంఘనలేమీ నమోదు కాలేదని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ఎడిటర్స్ కామెంట్: తెలుగు నేలపై అక్టోబర్ విప్లవం
- పుతిన్‌ను రక్షకుడిగా ఎందుకు చూపిస్తున్నారు?
- ట్రంప్-పుతిన్ సమర్పించు రాజకీయ డ్రామా!
- పుతిన్‌ను సవాల్ చేస్తున్న మహిళా జర్నలిస్టు!
- రష్యా ఎన్నికలు: పుతిన్ ప్రత్యర్ధి అలెక్సీ నావల్సీపై అనర్హత వేటు
- ‘స్టాలిన్ మృతి’: బ్రిటిష్ కామెడీ సినిమాపై మండిపడుతున్న రష్యా
- రష్యా: మైనస్ 60 డిగ్రీల చలిలో ప్రజలు ఎలా జీవిస్తారో తెలుసా!!
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








