రోజుకు 200 సెల్ఫీలు తీసుకుంటే ఏమవుతుంది?

- రచయిత, బెల షా
- హోదా, బీబీసీ
ఇన్‌స్టాగ్రామ్‌లో జునైద్ అహ్మద్‌కు 50వేల మంది ఫాలోవర్లు ఉన్నారు.
22 ఏళ్ల అహ్మద్ రోజుకు 200 సెల్ఫీలు తీసుకుంటారు.
సోషల్ మీడియాలో పోస్టు చేసే ప్రతీ ఫొటోకి ఎక్కువ లైకులొచ్చేలా ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.
600 కంటే తక్కువ లైకులొస్తే ఆ ఫొటోను అహ్మద్ డిలీట్ చేస్తారు.
సెల్ఫీలకు తాను బానిసయ్యానని అతను అంగీకరించారు.
'నేను ఒక ఫొటో పోస్టు చేసిన ఒకట్రెండు నిమిషాల్లో కనీసం 100 లైకులు వస్తాయి. అవంటే నాకు చాలా ఇష్టం. ఆ ఫీలింగ్ అద్భుతంగా ఉంటుంది' అని అహ్మద్ చెప్పారు.

సెల్ఫీ పిచ్చి ఉండటం ఒక రకమైన మానసిక స్థితి అని ఇటీవల చేసిన ఒక అధ్యయనంలో తేలింది. అలాంటి వారిని సెల్ఫీటిస్ అని పిలుస్తారు.
'రోజుకు కనీసం ఆరుసార్లు ఫొటోలు తీసుకుని వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేయాలన్న తాపత్రయం ఉంటే సెల్ఫీ పిచ్చి బాగా ముదిరినట్లు' అని నాటింగ్హామ్ ట్రెంట్ యూనివర్శిటీ, భారత్‌లోని త్యాగరాజర్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ పరిశోధకులు చెబుతున్నారు.
తన సెల్ఫీ పిచ్చి వల్ల అప్పుడప్పుడు కుటుంబ సభ్యులతో కూడా గొడవ పడాల్సి వస్తోందని అహ్మద్ అంగీకరించారు.
సెల్ఫీ తీసుకోకుండా భోజనం చేయలేవా? అని వాళ్లు తరచూ తనను తిడతారని అతను చెప్పారు.
కానీ తాను ఫొటో ఎందుకు తీసుకోకూడదని అహ్మద్ ప్రశ్నిస్తున్నారు.
ఎలాంటి ప్రయోజనం లేకుండా మూడు గంటల పాటు తాను ఎందుకు రెడీ కావాలని అడిగారు.

ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of Instagram ముగిసింది

ఫొటో కింద వచ్చే వ్యతిరేక కామెంట్లు తనపై పెద్దగా ప్రభావం చూపించబోవని అతను చెప్పారు.
కానీ అందంగా కనిపించేందుకు తాను ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటానని వివరించారు.
'కొన్నేళ్ల క్రితం నేను ఇలా ఉండేవాడిని కాదు. ఇతర అబ్బాయిల్లాగే నేనూ ఉండేవాడిని. కానీ సోషల్ మీడియా పరిచయంతో నాకు నేనుగా అప్‌డేట్ కావాలని కోరుకుంటున్నా' అని అన్నారు.
సోషల్ మీడియా చూపించే చెడు ప్రభావం గురించి పెద్దగా పట్టించుకోనని అహ్మద్ వివరించారు.
సోషల్ మీడియాలో చూసేవన్నీ నిజం కాదని చెప్పారు.
సోషల్ మీడియాను సద్వినియోగం చేసుకుంటే అదెంతో ఆనందంగా ఉంటుంది. అది మీ జీవితాన్ని ప్రభావితం చేయకుండా చూసుకోవాలి అని అభిప్రాయపడ్డారు.

23 ఏళ్ల డానీ బౌమన్ టీనేజ్‌లో ఉండగా సెల్ఫీలను సోషల్ మీడియాలో పోస్టు చేసేవారు.
నేను ఫిట్‌గా ఉండాలని కోరుకున్నా. నేను మంచిగా కనిపించాలంటే ఇదే సరైన మార్గమని భావించానని డానీ చెప్పుకొచ్చారు.
సెల్ఫీలు తీసుకోవడం.. వాటిలో లోపాలు వెతకడం.. మంచి ఫొటో కోసం మళ్లీ ప్రయత్నించడం.. ఇలా క్రమంగా ఇదొక విష వలయంగా మారుతుందని డానీ తెలిపారు.
రాత్రి పగలు తేడా లేకుండా రోజుకు 10గంటల పాటు ఫొటోలు తీసుకునే వాడినని గుర్తు చేసుకున్నారు.
ఈ సెల్ఫీ పిచ్చి 16 ఏళ్ల వయసులో డానీ ప్రాణాల మీదికి తెచ్చింది.
అతను డైస్మోర్ఫిక్ డిజార్డర్ అంటే ఒకరకమైన మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు తేలింది. దానికి సోషల్ మీడియా ప్రధాన కారణమని భావిస్తున్నారు.

ప్రస్తుతం డానీ యూనివర్శిటీలో చదువుకుంటున్నారు. మానసిక సమస్యలతో బాధపడుతున్న వారికి సహాయం చేస్తున్నారు.
మంచం మీద పడుకుని, ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలని ఆలోచించే వాడిని. అప్పుడు నాకు ఏ దారి కనిపించలేదు అని డానీ నాటి పరిస్థితిని గుర్తుచేసుకున్నారు.
ఇప్పుడు నేను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తున్న ఫొటోలు సెల్ఫీలు కాదు. అవి నేను ఉపన్యాసం ఇస్తున్నప్పుడు, లేదా ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు తీసిన ఫొటోలు అని బీబీసీకి చెప్పారు.
సెల్ఫీలు పోస్టు చేసినప్పటి కంటే ఇప్పుడు నేను చాలా సంతృప్తిగా ఉన్నా. లైకుల కోసం నేను ఎవర్నీ బతిలాడాల్సిన అవసరం లేదన్నారు.
రెండు గంటల పాటు సోషల్ మీడియాలో గడిపిన తర్వాత వారిని హెచ్చరిస్తూ ఒక పాప్‌అప్ వచ్చేలా చూడాలని రాయల్ సొసైటీ ఫర్ హెల్త్ విజ్ఞప్తి చేసింది.
డిప్రెషన్, మానసిక ఒత్తిడి పెరగడానికి సోషల్ మీడియా కూడా కారణం అవుతోందని ఆర్‌ఎస్‌పీహెచ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ క్రామెర్ అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
- Reality check: చైనీస్.. పాకిస్తాన్ అధికారిక భాషగా మారిందా?
- తప్ప తాగి.. ఊబర్ ఎక్కి.. లక్ష రూపాయలు బిల్లు కట్టాడు..!
- ఇంటి అద్దె వద్దు.. సెక్స్ కావాలంటున్నారు
- ప్రాణాలు తీస్తున్న అంతుచిక్కని వ్యాధి.. కాపాడేందుకు వ్యాక్సిన్ కూడా లేదు
- హైపర్సోనిక్ ప్యాసింజర్ విమానాన్ని తయారు చేస్తున్న చైనా. ఎందుకు?
- ఇన్‌స్టాగ్రామ్‌తో డబ్బులు సంపాదించడం ఎలా?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.








