అఫ్గాన్‌లో ఆత్మాహుతి దాడి.. 40 మంది మృతి

ఫొటో సోర్స్, AFP
అఫ్గాన్ రాజధాని కాబూల్‌లో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో దాదాపు 40 మంది చనిపోగా 30 మంది గాయపడ్డారు. కాబూల్‌లోని షియా సాంస్కృతిక కార్యాలయం వద్ద ఈ దాడి జరిగింది.
ఆత్మాహుతి దాడి జరిగాక కాసేపటికే ఆ ప్రాంతంలో మరో రెండు చోట్ల పేలుళ్లు జరిగాయని ఇక్కడి హోం శాఖ ప్రకటించింది.
కొన్ని నెలలుగా ఐఎస్ సంస్థ.. షియా వర్గం లక్ష్యంగా దాడులు చేస్తోంది. కానీ.. ఈ దాడులు తామే చేశామంటూ ఇంతవరకూ ఏ సంస్థా ప్రకటించలేదు.

సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోల్లో పేలుడు జరిగిన ప్రదేశంలోని మృతదేహాలు కన్పిస్తున్నాయి.
ఇప్పటికే పదుల సంఖ్యలో మృతదేహాలను బయటకు తీసుకువచ్చారని, ఇంకా హాస్పిటల్‌కు తీసుకు వెళ్లాల్సిన వారు చాలా మందే ఉన్నారని షియా సాంస్కృతిక కార్యాలయం బీబీసీకి తెలిపింది.
పేలుడు జరిగిన సమయంలో.. షియా సాంస్కృతిక కార్యాలయంలో మీడియాతో విద్యార్థుల చర్చా కార్యక్రమం జరుగుతోంది.

ఫొటో సోర్స్, Reuters
సోమవారం అఫ్గాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సమీపంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 10 మంది మరణించారు.
గత అక్టోబర్ నెలలో.. ఆఫ్ఘన్‌లోని షియా వర్గానికి చెందిన ఓ మసీదుపై దాడి జరిగింది. ఆ దాడిలో 39 మంది మరణించారు.








