Mumbai Fire: 20 అంతస్తుల భవనంలో మంటలు - ఆరుగురి మృతి

ముంబయి అగ్నిప్రమాదం

ఫొటో సోర్స్, BBC Marathi

ముంబయిలోని 20 అంతస్తుల భవనంలో మంటలు వ్యాపించడంతో ఆరుగురు మరణించారు. ఈ మేరకు ముంబయి అగ్నిమాపక శాఖ అధికారులు ధ్రువీకరించారు.

తాడ్‌దేవ్ ప్రాంతంలో ఉన్న భాటియా ఆసుపత్రి సమీపంలోని 20 అంతస్తుల కమలా బిల్డింగ్‌‌లో ఈ అగ్నిప్రమాదం జరిగింది.

మంటలనార్పేందుకు అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నారు. పెద్ద ఎత్తున పొగ వ్యాపించడంతో అపార్ట్‌మెంట్‌లోని చాలామంది ఊపిరాడక ఇబ్బంది పడ్డారు.

ప్రస్తుతం అక్కడ 13 ఫైర్ ఇంజిన్లు మంటలు ఆర్పుతున్నాయి. ఈ ప్రమాదంలో 15 మంది గాయపడ్డారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

శనివారం ఉదయం 7.30 ప్రాంతంలో భవనంలో మంటలు చెలరేగినట్లు అక్కడున్నవారు చెబుతున్నారు.

ప్రమాదంలో గాయపడినవారిని సమీపంలోని భాటియా ఆసుపత్రి, నానక్‌రామ్ ఆసుపత్రులకు తరలించినట్లు అధికారులు చెప్పారు.

మంటల్లో చిక్కుకున్న భవనం

ఫొటో సోర్స్, ANI

ప్రమాదానికి కారణమేంటి?

అపార్ట్‌మెంట్‌ 18వ అంతస్తులో మొదట మంటలు చెలరేగాయి. అయితే, మంటలకు కారణం ఏమిటనేది ఇంకా తెలియలేదు.

13 అగ్నిమాపక శకటాలతో సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పారు.

ప్రస్తుతం మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చినట్లు ముంబయి అగ్నిమాపక అధికారులు వెల్లడించారు.

ప్రమాదం జరిగిన 18వ అంతస్తు పైనున్న అంతస్తులతో పాటు మరికొన్ని ఫ్లోర్‌లలో నివసిస్తున్నవారినీ అధికారులు ముందుజాగ్రత్తగా ఖాళీ చేయించారు.

(ఈ కథనం అప్డేట్ అవుతోంది)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)