చింతామణి నాటకం నిషేధం: వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయం సబబేనా?
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకన్న నిషేధం నిర్ణయం ఇక్కడే ఆగుతుందని గ్యారంటీ ఉందా, రేపు మరొకరికి ఎల్లుండి ఇంకొకరికి ఇంకో పాత కళారూపాల్లో అభ్యంతరాలు ఉండొచ్చు. అప్పుడేమి జరుగుతుంది.
మనకు నచ్చినా నచ్చకపోయినా మనది కుల సమాజం. ఆయా కులాలకు సామాజిక పరిణామ క్రమంలో ఎట్లాంటి ట్రీటమ్మెంట్ ఉండింది, సమాజం ఎట్లా మారుతూ వచ్చింది అనేది తెలుసుకోవడానికి చరిత్ర పొడవునా గ్రంధాలు, నాటకాలు ఉపయోగపడతాయి. వాటిని మనమున్న స్థానం నుంచి చైతన్యం నుంచి ఇంటర్‌ప్రిట్ చేసుకోవడం వేరే కథ.
భవిష్యత్ తరానికి ఈ చరిత్ర లేకుండా చేద్దామా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంత దూరం ఆలోచించిందా అసలు. నిషేధం అనేది ప్రజాస్వామ్య సమాజంలో సబబనిపించుకుంటుందా.
అందులో బూతు ఉంటే కించపరిచే సన్నివేశాలు సంభాషణలు ఉంటే ఆమేరకు అడ్రస్ చేయొచ్చు. అది కష్టమే కానీ అసాధ్యమేమీ కాదు. పైగా ఇప్పుడేమీ అంత పాపులర్ నాటకంగా కూడా లేదు. అరుదుగా మాత్రమే అక్కడక్కడా ఆడుతున్న నాటకం.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామిక సూత్రాలకు, స్ఫూర్తికి అనుగుణంగా ఉందని చెప్పగలమా?
ఇవి కూడా చదవండి:
- 'అమర జవాను జ్యోతి'ని శాశ్వతంగా ఆర్పివేస్తున్నారా? అసలేం జరుగుతోంది?
- ఆంధ్రప్రదేశ్లో చింతామణి నాటకాన్ని ఎందుకు నిషేధించారు, అడల్ట్ కామెడీగా మార్చడమే అసలు సమస్యా
- ఏనుగుకు కవల పిల్లలు.. 15 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి
- క్లాస్రూంలోనూ హిజాబ్ ధరిస్తామని ఈ అమ్మాయిలు ఎందుకు పట్టుబడుతున్నారు, ప్రిన్సిపల్ ఎందుకు వద్దంటున్నారు
- అధిక బరువు, ఊబకాయం ఉన్నవారికి కరోనా సోకితే ప్రాణాలకే ప్రమాదమా
- భారతదేశంలో డైనోసార్లను మింగేసే పాములు, ఒంటికొమ్ము రాకాసి బల్లులు ఏమయ్యాయి?
- అమెరికాను పాలించడం ఎవరివల్లా కాదా? ఈ దేశం ముక్కలైపోతుందా?
- రోజురోజుకీ ధరలు పెరుగుతూనే ఉన్నాయి ఎందుకు? మీరు తెలుసుకోవాల్సిన 7 కారణాలు..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)