ధనుష్, ఐశ్వర్య: విడిపోతున్నట్లు ప్రకటించిన దంపతులు

తమిళ హీరో ధనుష్, ఆయన భార్య ఐశ్వర్య విడిపోతున్నట్లు ప్రకటించారు.

ఫొటో సోర్స్, DHANUSH

ఫొటో క్యాప్షన్, తమిళ హీరో ధనుష్, ఆయన భార్య ఐశ్వర్య

తమిళ హీరో ధనుష్, ఆయన భార్య ఐశ్వర్య విడిపోతున్నట్లు ప్రకటించారు.

"గత 18 సంవత్సరాలుగా మేము స్నేహితులుగా, దంపతులుగా, తల్లిదండ్రులుగా మా ప్రయాణం కొనసాగించాం. ఇప్పుడు విడిపోతున్నామంటూ" ధనుష్ ఒక లేఖను ట్వీట్ చేశారు.

"ఇకపై మేమిద్దరం వేరు వేరు దారుల్లో నడవాలని నిర్ణయించుకున్నాం. వ్యక్తిగతంగా సమయాన్ని వెచ్చించాలనుకుంటున్నాం. మా నిర్ణయాన్ని గౌరవించి, మా వ్యక్తిగత గోప్యతను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం" అంటూ ఆ లేఖలో రాశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

వయసులో చిన్నవాడిని ప్రేమించి...

తనకన్నా వయసులో చిన్నవాడైన ధనుష్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు ఐశ్వర్య.

2000వ దశకంలో ధనుష్ తమిళ తెరపై హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నంలో ఐశ్వర్య ఆయనకు తోడు నిలిచారు.

ధనుష్, ఐశ్వర్య ఇద్దరూ తమిళ చిత్ర పరిశ్రమలోని ప్రముఖుల కుటుంబాలకు చెందినవారే. ఐశ్వర్య.. రజనీకాంత్ పెద్ద కూతురు కాగా, ప్రముఖ దర్శకుడు, నిర్మాత కస్తూరి రాజా కుమారుడు ధనుష్.

వీరివురి వివాహం పెద్దల అంగీకారంతోనే జరిగింది. అంతకు ఆరు నెలల ముందు వీరిద్దరూ ప్రేమలో పడ్డారు.

అప్పటికి ధనుష్ వయసు 23ఏళ్లు. ధనుష్ కన్నా ఐశ్వర్య రెండేళ్లు పెద్ద. వయసు వ్యత్యాసం కారణంగా వారి జోడీ సరిపోలేదనే విమర్శలు అప్పట్లో వినిపించాయి. అయితే, వయసు భేదం వారికి ఎప్పుడూ గుర్తు రాలేదని ధనుష్, ఐశ్వర్య గతంలో చెప్పారు.

ఐశ్వర్య ధనుష్

ఫొటో సోర్స్, Aishwarya

ప్రేమలో ఎలా పడ్డారంటే..

ధనుష్ సినిమా 'కాదల్ కొండేన్' విడుదలైనప్పుడు వీరిద్దరూ తొలిసారిగా కలుసుకున్నారు. ఒక థియేటర్ యజమాని ఐశ్వర్యను ధనుష్‌కి పరిచయం చేశారు.

ఆ సినిమాలో ధనుష్ నటనను ఆమె అభినందించారు. మర్నాడు ధనుష్‌కు గ్రీటింగ్స్‌తో పాటు పుష్పగుచ్ఛాన్ని పంపారు ఐశ్వర్య. ఆమె వ్యక్తిత్వాన్ని ధనుష్ ప్రశంసించారు.

ఈ క్రమంలో ధనుష్, ఐశ్వర్య తరచూ కలుసుకుంటున్నారనే వార్తలు మీడియాలో హల్‌చల్ చేశాయి. అయితే, తమ మధ్య ఎలాంటి సంబంధం లేదని ధనుష్ అప్పట్లో ఆ వార్తలను ఖండించారు.

తరువాత, వీళ్లద్దరికీ వివాహం జరిపించాలని ఇరువురి తల్లిదండ్రులూ నిశ్చయించారు. వెనువెంటనే నిశ్చితార్థం, వివాహం జరిగిపోయాయి.

ఒక సినిమా మ్యాగజీన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు, ఐశ్వర్యకు మధ్య సంబంధం గురించి ధనుష్ కొన్ని విషయాలను పంచుకున్నారు.

"మా సంబంధంలో మంచి విషయం ఏమిటంటే, మేమిద్దరం ఒకరికొకరు స్పేస్ ఇచ్చుకుంటాం. ఒకరిలా ఒకరు మారిపోవాలని అనుకోలేదు. మేం కలిసి జీవించాలనుకున్నాం. 20 ఏళ్లు దాటాక మారడం చాలా కష్టం. మనం నమ్మినదాన్నే ఆచరిస్తాం" అని అన్నారు.

2004, నవంబర్ 18న ధనుష్, ఐశ్వర్య పెళ్లి చేసుకున్నారు. తమిళం, బాలీవుడ్ సినిమాల్లో ధనుష్ నటిస్తున్నారు. నిర్మాతగా, 3డి చిత్ర దర్శకురాలిగా, స్క్రీన్ రైటర్‌గా ఐశ్వర్య తన సత్తా చాటుకుంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు.

సమంత, అక్కినేని నాగచైతన్య

ఫొటో సోర్స్, facebook/chay.akkineni

ఇటీవల సమంత, నాగ చైతన్య

ఇటీవల టాలీవుడ్‌లో సమంత, అక్కినేని నాగ చైతన్య దంపతులు కూడా విడిపోయారు.

తాము భార్యాభర్తలుగా విడిపోతున్నామని సమంత, అక్కినేని నాగ చైతన్య ప్రకటించారు.

''చాలా చర్చలు, ఆలోచనల తర్వాత సమంత, నేను భార్యాభర్తలుగా విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మా ఇద్దరి మధ్య దశాబ్ద కాల స్నేహబంధం ఉంది. ఇకపై కూడా ఆ స్నేహ బంధం కొనసాగుతుందని మేం ఆశిస్తున్నాం''అని నాగ చైతన్య ట్వీట్‌చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

2010లో విడుదలైన ‘ఏమాయ చేశావే’ సినిమాలో హీరో, హీరోయిన్లుగా నటించినప్పటి నుంచి వీరి మధ్య పరిచయం పెరిగింది.

2017 అక్టోబర్ 6వ తేదీన గోవాలో వీరు హిందు, క్రైస్తవ మత సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)