భీమా కోరేగావ్ కేసు: సుధా భరద్వాజ్‌కు బెయిల్ - Newsreel

ఫొటో సోర్స్, BBC/ALOK PUTUL
ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త, న్యాయవాది సుధా భరద్వాజ్‌కు బాంబే హైకోర్టు భీమా కోరేగావ్, ఎల్గర్ పరిషత్ కేసులో డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది.
తాను డిఫాల్ట్ బెయిల్‌కు అర్హురాలినని పేర్కొంటూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు అనుమతించింది.
బెయిల్ షరతులపై నిర్ణయం తీసుకోవాలని ప్రత్యేక కోర్టును ఆదేశించింది.
డిసెంబర్ 8న ఆమెను ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరుస్తారు. అదేరోజు బెయిల్ షరతులపై ప్రతేక కోర్టు నిర్ణయం తీసుకుంటుంది.
సుధా భరద్వాజ్ తరపున వాదిస్తున్న న్యాయవాది మిహిర్ దేశాయ్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు.
"సుధా భరద్వాజ్‌కు డీఫాల్ట్ బెయిల్ లభించింది. కానీ, మిగిలినవారికి కోర్టు బెయిల్ మంజూరు చేయలేదు." అని ఆయన తెలిపారు.
2018లో భీమా కోరేగావ్ కేసులో సుధా భరద్వాజ్‌ను అరెస్ట్ చేశారు. గతంలో ఆమె పెట్టుకున్న బెయిల్ పిటీషన్ పలుమార్లు విచారణకు వచ్చినా కోర్టు పరిగణించలేదు.
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) ప్రకారం, చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టానికి సంబంధించిన కేసులను విచారించడానికి ప్రత్యేక కోర్టుకు మాత్రమే అనుమతిచ్చారు. అయితే, ఈ కేసులో నిబంధనలకు విరుద్ధంగా 2018-19లో పుణె సెషన్స్ కోర్టు ఈ కేసును విచారించిందని సుధా భరద్వాజ్ తరపు న్యాయవాది తెలిపారు.
2018 భీమా కోరేగావ్ హింస కేసులో సుధా భరద్వాజ్‌తో పాటు వరవరరావు, సోమసేన్, సుధీర్ ధావలే, రోనా విల్సన్, సురేంద్ర గాడ్లింగ్, మహేష్ రౌత్, వెర్నాన్ గోన్సాల్వేస్, అరుణ్ ఫెరీరా తరపున కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
సుధా భరద్వాజ్ మినహా ఇతరులకు కోర్టు బెయిల్ తిరస్కరించింది.

ఫొటో సోర్స్, Getty Images
దిల్లీలో లీటరుకు రూ. 8 తగ్గిన పెట్రోలు ధర
దిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు 8 రూపాయలు తగ్గింది.
పెట్రోల్‌పై 30 శాతంగా ఉన్న వ్యాట్‌ను 19.4 శాతానికి తగ్గిస్తూ దిల్లీ కేబినెట్ నిర్ణయం తీసుకుందని ఏఎన్‌ఐ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. దీంతో లీటర్ పెట్రోల్‌కు 8 రూపాయలు ఆదా కానున్నాయి. తగ్గిన ధరలు ఈ రోజు రాత్రి 12 గంటల నుంచి అమల్లోకి రానున్నాయి.
ప్రస్తుతం దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర లీటరు రూ 103.97 ఉండగా, డీజిల్‌ను రూ. 86.67కు విక్రయిస్తున్నారు.
అదే సమయంలో ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 109.98, డీజిల్ ధర రూ. 94.14గా ఉన్నాయి.
ఆకాశాన్నంటుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలనే ఉద్దేశంతో నవంబర్ 4న కేంద్ర ప్రభుత్వం వాటిపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. ఆ తర్వాత వీటి ధరల్లో ఎలాంటి మార్పు జరగలేదు. వరుసగా గత 27 రోజులుగా ఇంధన ధరలు నిలకడగా ఉన్నాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఇవి కూడా చదవండి:
- MSP: కనీస మద్దతు ధర అంటే ఏమిటి, రైతులు దీనికోసం ఎందుకు పట్టుబడుతున్నారు?
- తెలంగాణలో కరెంట్ బిల్లుల షాక్ తప్పదా? - ప్రెస్‌రివ్యూ
- 'కేంద్రం గుప్పిట్లో పౌరుల సమాచారం'
- కరోనా థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు భారత్ తీసుకోవాల్సిన 5 చర్యలు..
- భారత్-పాక్ యుద్ధం-1971: రణరంగంలో భారత కమాండర్ రాసిన లేఖకు పాకిస్తాన్ అధికారి ఎలా బదులిచ్చారంటే...
- కరోనావైరస్ కొత్త వేరియంట్ పేరు 'ఒమిక్రాన్', ఆందోళనకరంగా ఉందన్న డబ్ల్యూహెచ్‌వో
- ఈ చిన్న అట్టపెట్టె లాంటి ఉపగ్రహాలు ప్రపంచాన్ని ఎలా మార్చేయబోతున్నాయి?
- హనుమ విహారి ఫౌండేషన్, ఎన్టీఆర్ ట్రస్టు మధ్య గొడవేంటి? ఈ క్రికెటర్ ట్విటర్ నుంచి ఎందుకు తప్పుకున్నాడు?
- 'ఇప్పుడే నీ చేతుల్లో చచ్చిపోయా'.. ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ విడాకులపై రూమర్లకు ఈ కామెంట్ సమాధానమా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








