ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాకు సహాయకులను నియమించాలంటూ మహారాష్ట్ర హోం మంత్రికి లేఖ - Newsreel

ప్రొఫెసర్ సాయిబాబా

ఫొటో సోర్స్, Vasanta

నాగపూర్ సెంట్రల్ జైలులో ఉన్న ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాకు సహాయకులను ఏర్పాటు చేయాలని, ఆయన ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతూ భార్య వసంత కుమారి, సోదరుడు డాక్టర్ గోకరకొండ రామదేవుడు మహారాష్ట్ర హోం మంత్రికి, ఆ రాష్ట్ర జైళ్ల శాఖ డీజీ, ఏడీజీలకు లేఖ రాశారు.

90 శాతం శారీరక వైకల్యంతో వీల్‌చెయిర్‌కే పరిమితమైన ప్రొఫెసర్ సాయిబాబా గడ్చిరోలీ సెషన్స్ కోర్టు విధించిన జీవితు ఖైదు వల్ల నాగపూర్ జైలులో ఉన్నారు.

జైలులో ఆయన పట్ల సరైన జాగ్రత్తలు తీసుకోవడం లేదు, వైద్య సహాయం అందించడం లేదు.

ఒకరిద్దరు సహాయకులు లేకపోతే ఆయన తన రోజువారీ పనులు కూడా చేసుకోలేరు.

తన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంపై సాయిబాబా ఈ రోజు(07.05.2021) తన లాయర్‌కు సమాచారమిచ్చారు.

తరచూ ఆయనకు ఛాతీనొప్పి వస్తోంది. రాత్రి, పగటి సమయంలో కూడా అచేతనంగా పడి ఉంటున్నారు.

ఆయన ఎడమ చేయి ఇప్పటికే పనిచేయడం లేదు, కుడి చేయి పనితీరు కూడా క్షీణిస్తోంది.

సహాయకులు లేకపోతే వీల్ చెయిర్ నుంచి బెడ్ మీదకు.. బెడ్ నుంచి వీల్ చెయిర్ లోకి కూడా రాలేరు.

అతనితో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిలో ఇద్దరు ఆయనకు సహాయం చేస్తున్నారు. కానీ, వారిప్పుడు కోవిడ్ బారిన పడ్డారు.

దీంతో ఎవరికీ సహాయమూ లేకపోవడం వల్ల జీఎన్ సాయిబాబా నిస్సహాయుడిగా మారిపోయారు.

సహాయకులను ఏర్పాటు చేస్తామని బాంబే హైకోర్టులో సాయిబాబా బెయిలు పిటిషన్ విచారణ సమయంలో జైలు అధికారులు చెప్పారు.. కానీ, ఇంతవరకు ఏర్పాటుచేయలేదు.

ప్రస్తుతం కోవిడ్ రెండో వేవ్ తీవ్రంగా ఉంది. గత ఏడాది కోవిడ్ తీవ్రంగా ఉన్న సమయంలో ఖైదీలను పెరోల్‌పై విడుదల చేశారు.

90 శాతం శారీరక వైకల్యంతో బాధపడుతున్న సాయిబాబాను కనీసం పెరోల్‌పై విడుదల చేయాలని అభ్యర్థిస్తున్నాం.

ఇలాంటి క్లిష్ట సమయంలో ఆయనకు రోజువారీ పనుల్లో తోడ్పడేందుకు వీలుగా కనీసం ఇద్దరు సహాయకులను ఏర్పాటు చేసేలా అధికారులను ఆదేశించాలని కోరుతున్నాం. ఈ విషయంలో జోక్యం చేసుకుని పెరోల్ మంజూరు చేయాలనీ అభ్యర్థిస్తున్నాం'' అని ఆ లేఖలో కోరారు.

Presentational grey line
చోటా రాజన్

ఫొటో సోర్స్, AFP

అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ మృతి చెందారంటూ వార్తలు.. జీవించే ఉన్నారంటున్న ఎయిమ్స్ వర్గాలు

అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ మృతి చెందారని ఆల్ ఇండియా రేడియో ట్వీట్ చేసింది.

అయితే, ఆయన మరణించలేదని, జీవించే ఉన్నారని ఎయిమ్స్ పీఆర్ఓ బీఎన్ ఆచార్య ‘బీబీసీ’తో చెప్పారు.

ఇటీవల ఆయనకు కరోనావైరస్ సోకడంతో చికిత్స కోసం దిల్లీలోని ఎయిమ్స్‌లో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించారని ఆల్ ఇండియా రేడియో ట్విటర్ వేదికగా తెలిపింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

అయితే, చోటా రాజన్ మరణించలేదని, ఆయన చికిత్స పొందుతున్నారని ఎయిమ్స్ అధికారులను ఉటంకిస్తూ ఏఎన్ఐ వార్తాసంస్థ ట్వీట్ చేసింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

డ్రగ్స్, ఆయుధాలు, వసూళ్లు, స్మగ్లింగ్, హత్య తదితర 70 కేసుల్లో నిందితుడైన చోటా రాజన్.. జర్నలిస్ట్ జే డే హత్య కేసులో దోషి.

చోటా రాజన్ ఆరంభంలో బ్లాక్ టికెట్లు అమ్మిన ముంబైలోనే.. కోర్టు అతడికి జీవిత ఖైదు శిక్ష విధించింది.

2015లో ఇండోనేసియాలో ఆయన్ను అరెస్ట్ చేసి భారత్‌కు తీసుకొచ్చారు. అప్పటి నుంచి తిహార్ జైలులో ఉన్న చోటా రాజన్‌కు కరోనా సోకడంతో ఏప్రిల్ 26న ఎయిమ్స్‌లో చేర్చారు.

Presentational grey line
స్టాలిన్

ఫొటో సోర్స్, facebook/DMK

కుటుంబానికి రూ. 4 వేలు కరోనా సహాయం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. తమిళనాడు ముఖ్యమంత్రిగా స్టాలిన్ ఆదేశాలు

తమిళనాడు ముఖ్యమంత్రిగా డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ బాధ్యతలు స్వీకరించారు.

ప్రమాణ స్వీకారం తరువాత స్టాలిన్ తమిళనాడులో రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి కరోనా సహాయంగా రూ. 4 వేలు అందించేలా ఆదేశాలు జారీ చేశారు.

రూ. 4 వేల సహాయంలో మే నెలలో తొలి విడతగా రూ. 2 వేలు అందిస్తారు.

రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య బీమా కార్డులున్న వారికి కరోనా సోకితే వారి చికిత్సకయ్యే మొత్తం ఖర్చును తమ ప్రభుత్వమే భరిస్తుందని ఆయన ప్రకటించారు.

వీటితో పాటు రాష్ట్రంలో పాల ధరపై లీటరుకు రూ. 3 రాయితీ ప్రకటించారు.

తమిళనాడు ప్రభుత్వ రవాణా సంస్థకు చెందిన ఆర్డినరీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

Presentational grey line
నాగ్‌పుర్ ముంబయి

ముంబయి ఎయిర్‌పోర్టులో ముందు చక్రం లేకుండా ల్యాండ్ అయిన నాగ్‌పుర్ విమానం

ఒక పేషెంట్‌తో నాగ్‌పుర్ నుంచి బయలుదేరిన అంబులెన్స్ విమానం ముంబయి ఇంటర్నేషనల్ ఎయిర్‌ పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ అయింది.

జెట్ సర్వ్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన విటి-జెఐఎల్ అనే చార్టర్డ్ విమానం నిజానికి నాగ్‌పుర్ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరింది. అయితే, నాగ్‌పూర్‌లో గాల్లోకి పైకి లేస్తున్నప్పుడు దాని ముందు చక్రం ఒకటి ఊడిపోయింది. దాంతో, దాన్ని అత్యవసరంగా ముంబయి విమానాశ్రయంలో ల్యాండ్ చేయాల్సి వచ్చింది.

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పురీ ఆ విమానం ల్యాండ్ అయిన వీడియోను తన ట్విటర్ అకౌంట్లో షేర్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

ఆ విమానం ల్యాండింగ్ కోసం ముంబయి విమానాశ్రయంలో పూర్తి స్థాయి ఎమర్జెన్సీ ప్రకటించారు. చక్రం లేకుండా ముందు భాగంతో ల్యాండ్ అయితే మంటలు రాకుండా ఉండేందుకు రన్‌వే అంతా నురగతో నింపారు. అలా ఆ విమానం గురువారం రాత్రి 9.09 గంటలకు సురక్షితంగా ల్యాండ్ అయింది.

విమానం దిగిన తరువాత అగ్నిమాపక సిబ్బంది దాన్ని నీళ్లతో చల్లబరిచే ప్రయత్నం చేశారు. విమానంలో ఒక డాక్టర్, ఒక పారామెడిక్, ఒక రోగి, ఇద్దరు విమాన సిబ్బంది మొత్తం అయిదుగురు సురక్షితంగా బయటపడ్డారు. రోగిని వెంటనే ముంబయిలోని హాస్పిటల్‌కు తరలించారు.

Presentational grey line

సినీ గాయకుడు, 'స్వర మాధురి' ఆనంద్ కోవిడ్‌తో మృతి

జి ఆనంద్

ఫొటో సోర్స్, DEVISRIPRASAD/TWITTER

తెలుగు సినీ నేపథ్య గాయకుడు జి. ఆనంద్ గురువారం రాత్రి కన్ను మూశారు. ఆయన వయసు 67 ఏళ్లు.

గత కొద్ది రోజులుగా ఆనంద్ కరోనాతో బాధపడుతున్నారు. శరీరంలో ఆక్సిజన్ స్థాయి అకస్మాత్తుగా పడిపోవడంతో, సకాలంలో చికిత్స అందక మరణించినట్లు తెలిసింది.

ఆనంద్ స్వస్థలం శ్రీకాకుళం జిల్లా తులగమ్‌ గ్రామం.

అమెరికా అమ్మాయి (1976) చిత్రంలో "ఒక వేణువు వినిపించెను" పాటతో ఆనంద్ తెలుగు సినీ నేపథ్య గాయకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

ఆ తరువాత అనేక తెలుగు సినిమాల్లో పలు పాటలు పాడిన ఆనంద్ గాంధీనగర్ రెండవ వీధి (1987), స్వాతంత్ర్యానికి ఊపిరి పొయ్యండి (1987), రంగవల్లి (1990) చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు.

'స్వర మాధురి' సంస్థను స్థాపించి దేశవిదేశాల్లో వేల కచేరీలు చేశారు. ఆ సంస్థ ద్వారా ఎంతో మంది యువ గాయనీ గాయకులకు మంచి అవకాశాలు లభించేలా ప్రోత్సహించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)