కోవిడ్ చికిత్సకు ఎయిమ్స్, ఐసీఎంఆర్ విడుదల చేసిన కొత్త మార్గదర్శకాలివే...

కరోనావైరస్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కరోనా పరీక్ష కోసం నమూనా సేకరణ

ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (ఎయిమ్స్), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) - కోవిడ్ 19 టాస్క్ ఫోర్స్, జాయింట్ మానిటరింగ్ గ్రూప్ సంయుక్తంగా కోవిడ్-19 రోగుల చికిత్సకు సంబంధించిన కొత్త మార్గదర్శకాలను జారీ చేశాయి

కేసు తీవ్రతను బట్టి వ్యాధిని తేలికపాటి (మైల్డ్), మధ్యస్థ (మోడరేట్), తీవ్రమైన (సీరియస్) కేసులుగా విభజిస్తూ ఒక్కొక్క విభాగానికి మార్గదర్శకాలు అందించారు.

తేలిపాటి కేసు అంటే శ్వాస తీసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేకపోవడం. మధ్యస్థం అంటే కోవిడ్ లక్షణాలు ఎక్కువగానే కనిపిస్తూ ఆక్సిజన్ స్థాయి 93% నుంచి 90% ఉండడం. తీవ్రమైన కేసు అంటే వ్యాధి లక్షణాలు తీవ్రంగా ఉంటూ ఆక్సిజన్ స్థాయి 90% కంటే తక్కువ స్థాయికి పడిపోవడం.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

  • తేలికపాటి కోవిడ్ లక్షణాలు ఉన్నవారు ఇంట్లోనే ఐసొలేషన్‌లో ఉంటూ డాక్టరును ఫోన్‌లో సంప్రదించి మందులు వేసుకోవాలి.
  • మోడరేట్ కోవిడ్ ఉన్నవారిని ఆస్పత్రిలో చేర్పించాలి. వారికి ఆక్సిజన్ సపోర్ట్ అందించాలి. రోగికి వ్యాధి లక్షణాలు ముదురుతున్నట్లు అనిపిస్తే వెంటనే చెస్ట్‌కు సీటీ స్కాన్, ఎక్స్-రే తీయించాలి.
  • తీవ్రమైన కేసుల్లో రోగులను ఐసీయూలో ఉంచి చికిత్స చేయాలి. వారికి రెస్పరేటరీ సపోర్ట్ అందించాలి.
  • మోడరేట్, సివియర్ కేసుల్లో రోగులకు పూర్తిగా నయం అయిన తరువాత డిశార్జ్ ప్రమాణాల ఆధారంగా వారిని డిశ్చార్జ్ చేయాలి.
  • 60 ఏళ్లు పైబడినవారిలో కోవిడ్ లక్షణాలు తీవ్రంగా కనిపిస్తున్నాయి. గుండె జబ్బు, మధుమేహం, రక్తపోటు, మూత్రపిండాలు, కాలేయ, శ్వాసకోస వ్యాధులు ఉన్న వారు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. వీరిలో మరణాల రేటూ అధికంగానే ఉంది.
  • రెమిడెసివిర్ ఇంజెక్షన్‌ను మోడరేట్, సివియర్ కేసుల్లో ఆక్సిజన్ సపోర్ట్ అక్కర్లేనివారికి మాత్రమే అందించాలి.
  • ఇంట్లోనే ఐసొలేషన్‌లో ఉన్న రోగులు ఆక్సిజన్ సపోర్ట్ మీద లేకపోయినా కూడా రెమిడెసివిర్ వాడకూడదని సూచించారు.
  • ఐసీయూలో చేర్చిన 24-48 గంటల తరువాత రోగికి అనారోగ్య లక్షణాలు తీవ్రమైపోతూ ఉంటే వారికి టోసిలీజుమాబ్ ఇవ్వాలని సూచించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)