భీమా కోరెగావ్ కేసు: ప్రొఫెసర్ హనీ బాబు ఇంట్లో తనిఖీల్లో ఏం దొరికాయంటే

హనీబాబు

ఫొటో సోర్స్, facebook

ఫొటో క్యాప్షన్, హనీ బాబు
    • రచయిత, తారేంద్ర కిశోర్
    • హోదా, బీబీసీ కోసం

నోయిడాలో ఉన్న దిల్లీ విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ హనీబాబు ఇంట్లో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ), నోయిడా పోలీసులు తనిఖీలు చేశారు.

54 ఏళ్ల హనీ బాబు ముసలియార్‌వీట్టిల్ థరియాల్‌ను ఏఎన్ఐ మంగళవారం భీమా కోరెగావ్ ఎల్గార్ పరిషత్ కేసులో అరెస్ట్ చేసింది.

హనీ బాబు అరెస్ట్ తర్వాత ఆయన భార్య, జెన్నీ రావెనా, కూతురుతో కలిసి నోయిడాలోని తమ ఫ్లాట్‌లో ఒంటరిగా ఉంటున్నారు. ఆమె దిల్లీ విశ్వవిద్యాలయం మిరండా హౌస్ కాలేజీలో ఇంగ్లిష్ అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.

హనీబాబు

ఫొటో సోర్స్, Twitter

“నేనిక్కడ నా కూతురితో కలిసి ఉంటున్నాను. పోలీసులు ఇది అధికారిక దర్యాప్తు అని చెప్పారు. కానీ నాకు ఇది వేధిస్తున్నట్లే అనిపిస్తోంది” బీబీసీతో మాట్లాడిన జెన్నీ అన్నారు.

“ఎన్ఐఏ, నోయిడా పోలీసులు మా ఇల్లంతా గాలించారు. కొన్ని పత్రాలు, హార్డ్ డ్రైవ్, ఒక పెన్ డ్రైవ్, ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాకు సంబంధించిన ఒక కరపత్రం తీసుకెళ్లారు. సాయిబాబా కోసం హనీబాబు వాటిని ప్రజలకు పంచేవారు. వారు ఇంతకు ముందు కూడా వాటిని తీసుకెళ్లారు” అని ఆమె చెప్పారు.

దర్యాప్తులో అవసరం కాబట్టే అవన్నీ తీసుకెళ్తున్నామని ఆ బృందం తనకు చెప్పిందని జెన్నీ తెలిపారు.

దిల్లీ విశ్వవిద్యాలయం నుంచి సస్పెండ్ అయిన ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాపై మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నారు. ప్రొఫెసర్ సాయిబాబాను 2014లో దిల్లీలోని ఆయన ఇంటి నుంచి మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు.

‘బెదిరించేందుకే’

హనీ బాబు ఇంటి నుంచి తీసుకెళ్లిన సాయిబాబాకు సంబంధించిన కరపత్ర గురించి సాయిబాబా భార్య వసంత ‘బీబీసీ’తో మాట్లాడారు."పోలీసులు హనీ బాబును కూడా తప్పుడు కేసులో అరెస్ట్ చేశారు.

ఆయన ఎప్పుడూ భీమా కోరెగావ్ గురించి మాట్లాడలేదు, అక్కడికి ఎప్పుడూ వెళ్లలేదు. తప్పుడు వాంగ్మూలం ఇప్పించేందుకు ఆయనపై ఒత్తిడి తెస్తున్నారు. అయన అలా చేయకపోవడంతో ఆయన కుటుంబాన్ని భయపెట్టేందుకు ఈ దాడులు చేయించారు.

ఆయన భార్య, కూతురు ఇంట్లో ఆయన భార్య, కూతురు మాత్రమే ఉన్నారు. ఇలా వేధించడం ఒక పద్ధతి.

పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆ బుక్‌లెట్ బయట కూడా అందుబాటులో ఉంది. అవి రహస్య పత్రాలేం కాదు" అన్నారు.

హనీబాబు

ఫొటో సోర్స్, Twitter

"ఆ బుక్‌లెట్‌లో సాయిబాబాకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పులు ఎంత తప్పు అనేది వివరిస్తున్నారు. అందులో, ఆయన ప్రొఫైల్ ఉంది. పోలీసులు మొదట తనిఖీలు చేసినపుడే హనీ బాబు ఈమెయిల్, పాస్‌వర్డ్ తీసుకున్నారు. అన్నిటినీ మొదటే తీసుకెళ్లిపోయారు. ఈ దాడులను నిజానికి అతడి కుటుంబాన్ని భయపెట్టడానికి, వారిని ఇబ్బంది పెట్టడానికే చేశారు" అని చెప్పారు.మరోవైపు దిల్లీ విశ్వవిద్యాలయం ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు రాజీవ్ రే దీనిపై ఒక ప్రకటన జారీ చేశారు. ఇటీవల అరెస్ట్ అయిన హనీ బాబు భార్య, మిరండా హౌస్‌లో బోధించే డాక్టర్ జెన్నీ ఇంటిపై దాడులు జరగడం దారుణం. దిల్లీ విశ్వవిద్యాలయం ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడుగా నేను దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇలాంటి చట్టవిరుద్ధమైన, కఠిన విచారణ వ్యూహాలను వదిలిపెట్టి, స్కాలర్స్ కు వ్యతిరేకంగా ఇలాంటి చర్యలను తక్షణం ఆపాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను అన్నారు.

భీమా కోరెగావ్ కేసులో అరెస్టయినవారు.

ఫొటో సోర్స్, Siddesh gautam

దిల్లీ విశ్వవిద్లాయంలో హనీ బాబుతో కలిసి పనిచేసే అసిస్టెంట్ ప్రొఫెసర్ సచిన్.ఎన్ కూడా ఈ విషయంలో ‘బీబీసీ’తో మాట్లాడారు. "ఈ ప్రభుత్వం ప్రాథమిక రాజ్యాంగ హక్కులపై దాడి చేస్తోంది. వాటిని అంతం చేయాలని చూస్తోంది. ప్రభుత్వాన్ని విమర్శిస్తే, సామాజిక న్యాయం, సమానత్వం గురించి మాట్లాడితే, వారిని నకిలీ కేసుల్లో ఇరికిస్తున్నారు. ప్రస్తుత కేసు కూడా అలాంటిదే" అన్నారు."ఆగస్టు 4న కోర్టులో హనీ బాబు కేసులో విచారణ ఉంది. ఆ లోపు జరిగిన ఈ దాడులు సాక్ష్యాలు సేకరించడానికా లేక సాక్ష్యాలు సృష్టించడానికా. హనీ బాబు భార్య, కూతురు ఇంట్లో ఒంటరిగా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఇలా బలగాలతో దాడులు చేయడం నిజంగా కలవరం కలిగిస్తోంది.

ఒక మేధావి ఆలోచనపై మీరు నిఘా పెట్టడం మొదలైతే, నేర కార్యకలాపాలు జరుగుతాయి. మొత్తం రాజ్యాంగ ప్రజాస్వామిక వ్యవస్థ కుప్పకూలినట్లు మాకు అనిపిస్తోందని" సచిన్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)